Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంటికి వచ్చి పందెంలో నేను ఓడిపోయా సీత గెలిచిందని చెప్తుంది. ముందే నేను ఓటమిని ఒప్పుకుంటున్నా అని సీత బిజినెస్ బాగా చూసిందని చెప్తుంది. అందరూ మహాలక్ష్మీ మాటలకు షాక్ అయిపోతారు. రామ్ సీతకి కంగ్రాట్స్ చెప్తాడు. సీత ఏది అడిగితే ఇప్పుడు అది చేస్తావా అని జనార్థన్ అడిగితే పందెం అదే కదా మహాలక్ష్మీ చేయాల్సిందే అని చలపతి అంటాడు. ఇక సీత మహాలక్ష్మీని తాను అత్తమ్మ అని నమ్ముతున్న విద్యాదేవిని విడిపించాలని అడుగుతుంది. ఇంట్లో అందరూ సుమతిని చంపింది తానే కాబట్టి తనని విడిపించడానికి వీళ్లేదని చెప్తారు. 


సీత: ఆ పని చేయండి.
మహాలక్ష్మీ: చేయలేను. నువ్వు ఇలాంటి కోరిక కోరుతావు అని నేను అనుకోలేదు.
సీత: అంటే మాట తప్పుతారా.
మహాలక్ష్మీ: నాకు కండీషన్ కంటే కుటుంబం ముఖ్యం ఇంట్లో అందరికీ ఇష్టం లేని కోరిక నేను తీర్చను. అని వెళ్లిపోతుంది.
సీత: మనసులో.. అత్తమ్మని ఎలా విడిపించరో నేను చూస్తాను.
రామ్: సీత నువ్వు మా పిన్ని మీద గెలిచినందుకు ఆనంద పడాలో లేక ఆ విద్యాదేవి టీచర్‌ని విడిపించమన్నందుకు కోప్పడాలో అర్థం కావడం లేదు.
సీత: నేనేం కోరరాని కోరిక కోరలేదు మామ న్యాయమైన కోరికే కోరాను. అత్తమ్మని టీచర్‌ని నువ్వు వేరుగా చూస్తే ఫలితం ఉండదు మామ ఇద్దరినీ ఒకేలా చూస్తేనే ఫలితం ఉంటుంది.
రామ్: ఎలా నమ్మాలి. ఆవిడ మా అమ్మని చంపిన హంతకురాలని మా పిన్ని చెప్తుంది కదా
మహాలక్ష్మీ: మీరంతా మీ పిన్నిని గుడ్డిగా నమ్ముతున్నారు. టీచర్ మీద మీ పిన్ని వేసిన ఆరోపణ ఇంకా రుజువు కాలేదు అలాంటప్పుడు ఆవిడ ఇంకా ఎందుకు జైలులో ఉండాలి బయటకు వచ్చి తనని తాను నిరూపించుకోవాలంటే తను బయటకు రావాలి. ఒకటి ఆలోచించు టీచర్ మీ అమ్మే అయితే ఇలా సుమతి అత్తమ్మ చేయని తప్పునకు శిక్ష పడటం ఇష్టమేనా. సాక్ష్యాలు లేకుండా మీరు ఏం నమ్మరని నాకు తెలుసు. అసలు నిజాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి. 
రామ్: సీతకి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటో తను చెప్పింది కన్వినెస్స్‌గానే ఉంది కానీ కన్ఫ్యూజన్‌గా కూడా ఉంది.


సీత పందెం గురించి తల్లిదండ్రలు టెన్షన్ పడుతుంటే సీత కాల్ చేసి మహాలక్ష్మీ ఓటమి ఒప్పుకుందని నేనే గెలిచానని చెప్తుంది. సీత తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఇక సీత రేపు తెల్లారగానే ఇంట్లో ఎవరూ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాని తన ఐడియా చెప్తుంది. రేపు మహాలక్ష్మీ అత్తయ్యకి దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది దారిలోకి వస్తుందని చెప్తుంది. ఉదయం అందరూ సీతతో మంచి కోరిక కోరుంటే బాగున్న సీత మంచి అవకాశం కోల్పోయావు అంటారు. ఇక మహాలక్ష్మీ దగ్గరుండి విద్యాదేవిని తీసుకొని ఇంటికి వస్తుంది. అందరూ షాక్ అయిపోయి లేచి నిల్చొంటారు. మహాలక్ష్మీ, విద్యాదేవి వైపు అందరూ కోపంగా చూస్తారు.


మహాలక్ష్మీ: ఆగిపోయారేంటి విద్యాదేవి గారు లోపలికి రండి.  
సీత: మీరు బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తమ్మ.
విద్యాదేవి: మహాలక్ష్మీ నాకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చింది సీత.
జనార్థన్: నువ్వు ఈవిడని విడిపించడం ఏంటి మహా.
విద్యాదేవి: అందరూ అడుగుతున్నారు చెప్పు మహాలక్ష్మీ.
మహాలక్ష్మీ: నేను ఈ విద్యాదేవిని తీసుకురావడానికి ఒకటే కారణం ఉంది. సీత ఈమెను సుమతి అంటుంది మనం విద్యాదేవి అంటున్నాం. ఈమెను అరెస్ట్ అయితే చేయించాను కానీ సీత పదే పదే ఈవిడ సుమతి అని చెప్తుంటే నాకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఒకవేళ ఈవిడ నిజంగా సుమతి అయితే మనం అనవసరంగా కష్టపెట్టినట్లు అవుతుంది. అందుకే నిజం తెలిసే వరకు ఇక్కడే ఉంటుంది.
రామ్: సీత ఏదో చెప్పిందని మీరు చేయడం ఏంటి పిన్ని. ఈవిడ నా కన్న తల్లి అనే ఫీలింగే నాకు రావడం లేదు. 


అందరూ విద్యాదేవి ఇంట్లో ఉండటం ఇష్టం లేదని అంటారు. దానికి మహాలక్ష్మీ తాను సుమతి అని నమ్మి  తీసుకురావడం లేదని అవునో కాదో త్వరలో తేలిపోతుందని అప్పటి వరకు ఇక్కడే ఉంటుందని చెప్తుంది. ఇక సీత అయితే తాను సుమతి అని నిరూపిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: 3 గంటల మ్యాటర్ కనిపెట్టే దిశగా విశాల్.. ఇంతకీ నయని శరీరం ఏ హాస్పిటల్‌లో ఉన్నట్లు?