Satyabhama Today Episode : కావాలనే ట్యాబ్లెట్స్ గురించి ఇంట్లో అందరికీ చెప్పావని రుద్ర రేణుకను తిట్టి కొడతాడు. రేణుక తాను చెప్పలేదని ఎంత మొత్తుకున్నా వినడు. కావాలనే తన తల్లి చూడాలనే ట్యాబ్లెట్స్ ఎదురుగా పెట్టావని తిడతాడు.


రుద్ర: ఒక్కటి గుర్తు పెట్టుకో ఆ దేవుడు దిగొచ్చానా ఈ దరిద్రపు ముఖంతోని పిల్లల్ని కనే ప్రసక్తే లేదు. ఎక్కువ ఆలోచించకు మొగుడిని అలా అని నీకు దూరంగా ఉంటానని అనుకోకు. అలాంటి పిచ్చి పనులు కూడా చేయను. ఎప్పటి లెక్కన నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే నా దగ్గరకు రావాల్సిందే.


రేణుక: తెలిసిపోతే కష్టం అవుతుందయ్యా. 


రుద్ర: ఎవరికీ నీకా నాకా.. 


రేణుక: ఇద్దరికీ మామయ్యకి తెలిస్తే చంపేస్తారు.


రుద్ర: ఎంత మంచి వార్త చెప్పావే చంపనీ వాళ్లు నాకు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తారు.


రేణుక: ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావయ్యా. చేతులెత్తి దండం పెట్టుకుంటా మనసు మార్చుకో. నాకు కూడా అమ్మా అని పిలిపించుకోవాలి అని ఉంది. నువ్వు కూడా ఒక అమ్మకి పుట్టిన బిడ్డే అది మర్చిపోవద్దు. చేతులెత్తి బతిమాలుతున్నా ట్యాబ్లెట్స్ వేసుకోను.


రుద్ర: నా మాట వినకుంటే ఎదురు చెప్తే నీకు పర్మినెంట్‌గా పిల్లలు పుట్టే రాత లేకుండా చేస్తా గుర్తు పెట్టుకో పో.


రేణుక ఏడుస్తూ బయటకు రావడం సత్య చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. అందరూ కలిసి దోషిగా నిలబెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావని అడుగుతుంది. 


సత్య: పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్స్ ఎవరు వేసుకోమన్నారు. ఎందుకు వేసుకున్నావు. 


రేణుక: నిజం అందరికి చెప్పడం ఇష్టం లేకే కదా నేను మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. 


సత్య: అంటే ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పింది బావగారే కదూ. తప్పు చేసిన నీ భర్త ఆ తప్పుని నీ మీద వేసి తాను సుద్దపూసలా వీరంగం ఆడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావ్.


రేణుక: ఇప్పటికిప్పుడు వెళ్లి నీ కొడుకు నాకు కొట్టాడని అత్తమ్మకు చెప్తాను. అప్పుడు అత్తమ్మ నోటికెళ్లి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా నువ్వు ఏం తప్పు చేశావే అని అడుగుతుంది. అంతే కానీ కొడుకు తప్పు చేశాడు అనుకోదు. నీకు తెలీదు సత్య ఈ ఇంట్లో తప్పు కంటే అతి పెద్ద తప్పు ఏదో తెలుసా ఎదురుతిరగడమే.


సత్య: అసలు బావగారు పిల్లలు ఎందుకు వద్దు అనుకుంటారు.


రేణుక: ఆ పెద్ద మనిషికి పక్కన పడుకోవడానికి నేను పనికొస్తాను. కానీ పిల్లలు కనడానికి పనికిరాను అంట.


సత్య: అక్కా ఇదేం లాజిక్. ఇదే మాట నువ్వు పెద్ద వాళ్ల ముందు చెప్పొచ్చు కదా భయపడుతున్నావా.


రేణుక: కాదు బంధాన్ని తెంపుకోవాలి అనుకోవడం లేదు. కడుపులో దాచుకున్న నిజాలు అన్నీ బయటకు చెప్తే నన్ను ఈ ఇంట్లో నరకం చూపిస్తారు. ఆ నరకంలో పడి చావమంటావా. నా బతుకు నన్ను బతకనివ్వు సత్య.


సత్య: చూడక్కా.. నిన్నూ నీ బాధని ఎవరు అర్థం చేసుకోవడానికి ఎవరు ఉన్నా లేకపోయినా నీకు అండగా నీ తోటి కోడలు  ఉందని మర్చిపోవద్దు. ఇంకోసారి బావగారు ఆ ట్యాబ్లెట్ వేసుకోమన్నా వేసుకోవద్దు. 


క్రిష్ శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయి చేతికి మళ్లెపూలు చుట్టుకొని గదిలో ఉంటాడు. క్రిష్‌ని సత్య వింతగా చూస్తుంది. ఏంటీ వేషాలు అని అడుగుతుంది. తమకు శోభనం అని చెప్తాడు. ఇక సత్య ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తా అని తిడుతుంది. 


క్రిష్ పాటలు పాడుకుంటూ సత్యతో సంపంగి ఇక నీ హిట్లర్ పాలన సాగదని దిమాక్‌లోని గీతలు చెరిపేయ్ అని అని అంటాడు. తన తండ్రి మాటకు తల వంచాల్సిందే అని ఇంకోసారి నువ్వు పాల గ్లాస్‌తో రావాల్సిందే అని రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. ఏది ఏమైనా ఇద్దరం కాపురం చేస్తామని ఆరు నెలలో విడాకులు తీసుకుంటే నీకు ఐదు నెలల కడుపు ఉంటుందని అంటాడు. ఇక సత్య చాకులు చూపించి నీ కోసం చాలా కత్తులు రెడీగా ఉంచానని చెప్తుంది. దీంతో క్రిష్ భయపడి పూలను సత్యకి ఇచ్చేస్తాడు. 


సత్య: ఇంకా నా మీద నీ మనసులో పిచ్చిపిచ్చి ఆలోచనలు పోలేదు అనుకుంటా. మన విడాకుల అగ్రిమెంట్ గుర్తుంది కదా. 


క్రిష్: హలో సంపంగి.. నేనేమీ శోభనం మీద మోజు పడటం లేదు. ఏదో సరదాగా నిన్ను ఆటపట్టించడానికి ఇలా చేశాను. అంతేకానీ నీ మీద ఇష్టంతోనో మోజుతోనో కాదు. నిజానికి మా బాపు ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. 


మహదేవయ్య హాల్‌లో కూర్చొని ఉంటే భైరవి నందినిని తన ప్లాన్ చెప్పమని అంటుంది. నందిని భయపడుతుంది. కానీ భైరవి చెప్పడంతో వెళ్తుంది. నందిని తండ్రి దగ్గరకు వెళ్లి తనను గారభం చేయడం లేదని పట్టించుకోవడం లేదని అంటుంది. 


నందిని: బాపు ఇక నేను ఆ ఇంటికి పోను. నాతో కావడం లేదు. 


మహదేవయ్య: రుద్ర.. రుద్ర నువ్వు తెల్లారి నందిని అత్తారింటికి పోవాలి.


రుద్ర: ఎందుకు బాపు చెల్లిని అత్తారింటికి తీసుకెళ్లాలా.


భైరవి: అది ఈడనే ఉంటా బాపు అని మొత్తుకుంటా అంటే అత్తారింటికి పంపుడేంటి అయ్యా.


మహదేవయ్య: నేను అత్తారింటికి పంపుతా అన్నానా. 


రుద్ర: మరెందుకు బాపు.


మహదేవయ్య: దగ్గరుండి అల్లుడిని ఇక్కడికి తీసుకురావడానికి. 


రుద్ర: ఫోన్ చేస్తే వాడే వస్తాడు. దానికి నేను పోవుడు ఎందుకు.


మహదేవయ్య: ఇదే నాకు నచ్చదు. ఇంట్లో ఎవరికి వారు పెద్దొళ్లు అయిపోయారు. పోయి చెప్పింది చేయ్.


నందిని: ఇప్పుడెందుకు బాపు ఆయన్ను పిలుస్తున్నారు.


మహదేవయ్య: అది రేపు తెలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ : స్కూల్‌లో దీపకు అవమానం, అమ్మ మీద అలిగి బుంగమూతి పెట్టుకున్న శౌర్య.. నర్సింహ వర్సెస్ కార్తీక్!