Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప శౌర్యని తీసుకొని ఆటోలో స్కూల్ దగ్గరకు వస్తుంది. ఇక నర్శింహ కారు అక్కడ ఆపి ఫోన్ మాట్లాడుతుంది. దీప అతన్ని చూసి భయపడుతుంది. ఎవరినో డ్రాప్ చేయడానికి వచ్చిన నర్శింహ తనని చూసేలోపు వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే నర్శింహ కూడా దీపని చూసి భ్రమ పడ్డాను అనుకుంటాడు.
దీప ఫ్యూన్‌ని ప్రిన్సిపల్ రూం ఎక్కడని అడుగుతుంది. దీప వాలకం చూసి అతడు మీ పాపని ఈ స్కూల్‌లో జాయిన్ చేస్తారా అనుకుంటాడు. దీపకి ప్రిన్సిపల్ రూం చూపిస్తాడు. ఆశకైనా హద్దు ఉండాలని ఈమె కూడా మా బ్యాచ్ అనే అనుకుంటుంది. ఇక దీప ప్రిన్సిపల్ రూంకి వెళ్తే ప్రిన్సిపల్ దీపని చూసి ఆయా పోస్ట్ కోసం వచ్చిందనుకొని ప్రస్తుతం ఆ ప్లేస్‌లు కాళీ లేవని చెప్తాడు.
శౌర్య: అమ్మా మనం వచ్చింది నీ కోసం అనుకుంటున్నారు.
దీప: నువ్వు ఉండు శౌర్య.. సార్.. నేను వచ్చింది నా కూతుర్ని ఈ బడిలో చేర్పించడానికి..
ప్రిన్సిపల్: బడిలోనా..
దీప: మా పాపని మీ బడిలో చేర్పించుకోండి ఎలా అయినా కష్టపడి ఫీజు కట్టుకుంటా.
ప్రిన్సిపల్: చూడమ్మ మా స్కూల్‌కి చాలా రూల్స్ ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు చదువుకొని ఉండాలి. మేం 50 శాతం చెప్తే మిగతా 50 శాతం మీరు నేర్పించాలి. మీరేమో చదువుకోలేదు.
దీప ఎంత చెప్పినా వినకుండా ప్రిన్సిపల్ కుదరదు అనేస్తాడు. దీప బాధ పడుతూ వెల్లిపోతుంది. శౌర్య తనకు ఆ స్కూల్ బాగా నచ్చిందని అంటే స్కూల్‌లో చేర్పించరని చెప్తుంది. దీంతో శౌర్య అల్లరి చేస్తుంది. కార్తీక్‌తో చెప్పమని అంటుంది. దీప కుదరదు అంటే శౌర్య మొండికేస్తుంది. నేను అడిగింది ఏదీ ఇవ్వవని గొడవపడుతుంది. దీప ఎంత నచ్చచెప్పినా వినకుండా అలిగిపోతుంది.
దీప: మా నాన్న నన్ను కలెక్టర్ అవ్వమన్నాడు అమ్మ. అది నా వల్ల కాలేదు. కనీసం నువ్వు అయినా ఆ కోరిక తీర్చాలి అమ్మా. అమ్మ ఇవ్వలేనిది నువ్వు అడిగితే ఎలా అమ్మా.
శౌర్య: నాకు ఈ స్కూల్ నచ్చిందమ్మా.
దీప: వేరే స్కూల్ కూడా నచ్చుతుంది. నా మాట వినమ్మా రా..
మరోవైపు కార్తీక్ కారులో వెళ్తుండగా నర్శింహ కూడా అటుగా వచ్చి ఒకరికి ఒకరు ఎదురవుతారు. నర్శింహ కార్తీక్ నువ్వు నా జీవితానికే అనుకున్నా కారుకు కూడా అడ్డుగా వస్తున్నావ్ అంటాడు. దీంతో కార్తీక్ మాటలు పద్ధతిగా వస్తే బాగుంటుంది అంటాడు. పద్ధతిగానే మాట్లాడుకుందాం అని నర్శింహ కార్తీక్ కారు మొత్తం వెతుకుతాడు.
కార్తీక్: ఏంటి నా కారు వెతుకుతున్నావ్.
నర్శింహ: నాకు సంబంధించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని.
కార్తీక్: నీకు సంబంధించిన వాళ్లు నా కారులో ఎందుకు ఉంటారు.
నర్శింహ: ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్లతో సంబంధం పెట్టుకున్నావ్ కాబట్టి.
కార్తీక్: నువ్వు అసలు మనిషివేనా. సాయం చేయడానికి సంబంధం పెట్టుకోవడానికి తేడా తెలీదా నీకు లేదా అందరూ నీలాగే అవకాశం దొరకగానే గోడ దూకే రకం అనుకుంటున్నావా.
నర్శింహ: నువ్వు కూడా నాలాంటి రకమేరా. కాకపోతే నేను వెధవని ఒప్పుకుంటాను కానీ నువ్వు ఒప్పుకోవు.
కార్తీక్: రేయ్ ఎక్కువ వాగావు అంటే రోడ్డు అని కూడా చూడను. మొన్నే నీకు పడాల్సింది దీప అడ్డుకుందని ఆగిపోయా. ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది.
నర్శింహ: అంత బాగా నీకు అది నచ్చిందా.. బాగానే కంట్రోల్ చేస్తుంది.
నర్శింహ మాటలకు కార్తీక్ కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. నర్శింహ కూడా గొడవకు దిగుతాడు. దీప పేరు పెట్టే అర్హత కూడా నీకు లేదని కార్తీక్ అంటాడు. ఓ భర్త ఎలా ఉండాలో తన తండ్రి రుజువు చేస్తే ఎలా ఉండకూడదో నువ్వు రుజువు చేస్తున్నావ్ అని అంటాడు. దీపని బాధ పెడితే బయట తిరగడానికి కూడా భయపడేలా చేస్తానని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
నర్శింహ: తనలో తాను నువ్వు ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చావు అంటే నీ బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందిరా. కానీ నీ టైం నడుస్తుంది. నాకు అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఆడుకుంటారా మీ ఇద్దరితో..
మరోవైపు హోటల్ దగ్గరకు దీప వస్తుంది. హడావుడిగా పని మొదలు పెడుతుంది. పాపని స్కూల్‌లో చేర్పించి వచ్చేసరికి లేటు అయిందని కడియం బాబాయ్‌కి సారీ చెప్తుంది. ఇక కడియం దీపకి తన భర్త గురించి అడిగితే తాను భర్తకి దూరంగా ఉన్నాను అని ఇక దాని గురించి అడగొద్దని జాలి కూడా చూపించొద్దని చెప్తుంది.
జ్యోత్స్న తన నానమ్మ మాటలు తలచుకొని రగిలిపోతుంది. జ్యోత్స్నని సుమిత్ర పరిశీలిస్తూ ఉంటుంది. జ్యోత్స్న జ్యూస్ తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టబోయి కింద పడేసే టైంకి కార్తీక్ పట్టుకుంటాడు. దీంతో సుమిత్ర జ్యోత్స్న అంటూ పిలుస్తూ వస్తుంది. కార్తీక్ జ్యోత్స్నని ఏం ఆలోచిస్తున్నావ్ జ్యోత్స్న అని అడుగుతుంది. జ్యోత్స్న ఏం ఆలోచించకుండా ఏమరపాటుగా ఉంటుంది. కార్తీక్ అలర్ట్‌గా ఉండొచ్చు కదా అని జ్యోత్స్నని అంటే అలర్ట్‌గా లేకపోవడం వల్లే ఇంత వరకు వచ్చిందని జ్యోత్స్న అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.