Brahmamudi Serial Today Episode: అనామిక వెళ్లి రుద్రాణిని కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లేలా చేయడానికి ఏదైనా ప్లాన్‌ ఇవ్వమని అడుగుతుంది. దీంతో రుద్రాణి కళ్యాణ్‌ పర్మినెంట్‌గా ఆఫీసుకు వెళ్లకుండా ఉండేలా ప్లాన్‌ ఇవ్వాలని మనసులో అనుకుని మీ అమ్మానాన్నలను పిలిపించి అడగమని చెప్పు అని చెప్తుంది. దీంతో అనామిక సరేనని వెళ్లిపోతుంది. మరోవైపు మాయ కోసం వెతుకుతున్న కావ్యను రౌడీలు వెనక నుంచి ఫాలో అవుతుంటారు. మాయ గురించి ఎంక్వైరీ చేస్తుంది. మాయ అడ్రస్‌ చెప్తుంది ఒకావిడ. కావ్య అక్కడకు వెళ్తుంటే రౌడీలు కావ్యను కిడ్నాప్‌  చేయడానికి ప్లాన్‌ వేసుకుంటారు. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. కళ్యాణ్‌ను నిలదీయాలని చెప్తుంది. దీంతో వాళ్ల అమ్మ సరేనని చెప్తుంది. మరోవైపు రాజ్‌ కూడా మాయ గురించి వెతుకుతుంటే కావ్యకు నిజం చెప్పిన వ్యక్తి ఎదురవుతాడు. ఆ వ్యక్తి రాజ్‌ ను చూసి బిత్తర చూపులు చూస్తుంటే రాజ్‌ వాడిని అనుమానిస్తాడు.


రాజ్‌: ఏయ్‌ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.


వ్యక్తి: సారీ సార్‌ నేను కావాలని చేయలేదు. ఏదో భయపడి తప్పు చేసేశాను. ఇంకెప్పుడు అలా చేయను సార్‌ అసలు మీ కంటికి కనిపించను సార్‌.


రాజ్‌: వీడేంటి నన్ను చూసి ఇలా భయపడుతున్నాడు. అంటే ఏదో తప్పు చేశాడన్నమాట. అదేంటో నాకు తెలిసినట్టు నాటకమాడి నిజం తెలుసుకోవాలి.       (అని మనసులో అనకుంటాడు)


వ్యక్తి: సార్‌ సారీ చెప్పాను కదా సార్‌ ఇంకోసారి  అలా  చేయను నన్ను వదిలేయండి సార్‌.


రాజ్‌: వదిలేయడానికి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పు అనుకుంటున్నావా?


అంటూ రాజ్‌ కోపంగా నిలదీయడంతో ఆ వ్యక్తి కావ్యకు నిజం చెప్పిన విషయం రాజ్‌కు చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని వెళ్లిపోతాడు. రాజ్‌ షాక్‌ అయి వెంటనే కళావతికి నిజం తెలిసినా ఇంత సైలెంట్‌గా ఎందుకుంది అని ఆలోచిస్తూ కావ్యకు ఫోన్‌ చేస్తాడు. కావ్య అప్పుతో మాట్లాడుతుంది. నువ్వు చెప్పిన లోకేషన్‌కు వస్తున్నానని అప్పు చెప్తుంది. కావ్య వెనక కిడ్నాపర్లు ఫాలో అవుతుంటారు. రాజ్‌ మాయ కోసం వెతుకుతుంటారు. ఒక లేడీ కిడ్నాపర్‌ కావ్యతో మాట్లాడి మాయ అడ్రస్‌ తనకు తెలుసని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. మరోవైపు అనామిక అమ్మానాన్నలు దుగ్గిరాల ఇంటికి వస్తారు.     


ఇందిరాదేవి: చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు.


కావ్య తండ్రి: చెప్పేదేముంది అమ్మా నా కూతురు కాపురం గురించే


అపర్ణ: మీ కూతురు కాపురానికి  వచ్చిన నష్టం ఏముంది ఇప్పుడు అత్తపోరు ఉందా? ఆడపడచు పోరు ఉందా? తోటి కోడలు సాధింపు ఉందా? మా అబ్బాయి తాగుబోతా? తిరుగుబోతా? మీరు ప్రత్యేకంగా వచ్చి పంచాయతి పెట్టి అడగాల్సిన అవసరం లేదే?


స్వప్న: చెప్పే అవకాశమే ఇచ్చారంటే కళ్యాణ్‌ కవితలే రాస్తారు. ఈ ఫ్యామిలీ కథలు కూడా రాస్తారు. కళ్యాణ్‌ వల్ల ఏం కష్టాలు ఉన్నాయో వాళ్లు చెప్తారు. అప్పుడు వాళ్ల అమ్మాయి చేసిన ఘనకార్యం గురించి వాళ్లే సమాధానం చెప్పాలి.


సుభాష్‌: నిజానికి మేమే పిలవాలి పంచాయతీకి. కానీ మా కుటుంబం చెత్త వచ్చినా మాలో కలిపేసుకుంటుంది.


రుద్రాణి: వచ్చిన వాళ్లను మనం మాట్లాడనిస్తే.. తర్వాత మనం మాట్లాడేది మనం మాట్లాడుదాం.


అనగానే అనామిక అమ్మానాన్నలు మా అమ్మాయి కాపురం ఏమైపోతుందోనని భయంగా ఉందని చెప్పడంతో అనామిక చేసిన పనులు.. కళ్యాణ్‌ పై పెట్టిన పోలీస్‌ కేసు గురించి అన్నీ చెప్పినా వాళ్లు వినరు ఇంకా కళ్యాణ్‌ను అనుమానిస్తుంటే.. ఇందిరాదేవి కోపంగా అనామిక అమ్మానాన్నలకు వార్నింగ్‌ ఇస్తుంది. కలపడానికి వస్తే కామ్‌ గా కూర్చో.. లేదంటే లేచి వెళ్లిపో అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మరోవైపు కావ్యను ఎవరూ లేని దగ్గరకు తీసుకెళ్తుంది లేడీ కిడ్నాపర్ ఇంతలో అప్పు, కావ్యకు ఫోన్‌ చేస్తుంది. నువ్వు చెప్పిన లోకేషన్‌కు వచ్చానని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ఆ డబ్బులు అడిగింది నేనే, కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు - రూ. 3వేలు పంపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌