Krishna Mukunda Murari Today Episode : కృష్ణ, ముకుంద, మురారి ఓ హోటల్‌లో కలిసి మాట్లాడుకుంటారు. ఆదర్శ్‌తో ఆ పెళ్లి ఆపమని ముకుంద.. కృష్ణ వాళ్లకు చెప్తుంది. కడుపులో బేబీ ఉండటం వల్ల ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నా అని మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందని వెళ్లిపోతాను అని ముకుంద బయల్దేరుతుంది. కృష్ణ, మురారిలు ఏమీ అనలేకపోతారు. 


మధు కథ రాస్తుంటే సంగీత అక్కడికి వస్తుంది. మధు తీయబోయే సినిమాలో తనని హీరోయిన్‌గా చేయమని అంటుంది. దానికి మధు వద్దు అనేస్తాడు. 


మధు: వద్దు బంగారం. ఈ ఫీల్డ్‌లో రాణించాలి అంటే స్క్రీన్‌ మీదే కాకుండా బయట కూడా నటించడం రావాలి. నీ అమాయకత్వానికి ఈ ఫీల్డ్ సరిపోదు. ఎవరినైనా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా బతుకు సరేనా..


రజిని: మధుని లాగిపెట్టి కొట్టి.. ఏరా నా కూతురి భుజం మీద చేయి వేసి మాట్లాడుతావా.. ఎంత ధైర్యంరా నీకు.


సంగీత: అమ్మా తెలుసుకోకుండా మాట్లాడకు. నేను యాక్టింగ్ చేస్తాను అంటే మధు బావ నువ్వు అమాయకురాలివి నీకు ఈ ఫీల్డ్ సెట్ అవ్వదు. చక్కగా పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని అన్నాడు. నువ్వు మాత్రం నన్ను ఆ సెకండ్ హ్యాండ్‌ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు. 


మధు: నువ్వేం టెన్షన్ పడకు సంగీత ఎవరు ఏమనుకున్నా నువ్వు మంచి దానివి నీకు మంచే జరుగుతుంది. మీ అమ్మలో మార్పు వచ్చే వరకు ఇలాగే మీ అమ్మకు ఎదురు తిరుగుతూ ఉండు. ఆల్ ది బెస్ట్ రజినీ అత్త. ఇక నా కథ నేను రాసుకుంటాను.


మురారి, కృష్ణ తమ గదిలో ఆలోచిస్తూ ఉంటారు. మీరా కాకుండా ఇంకెవరైనా సరోగసీ మదర్ అయింటే ఇంత టెన్షన్ ఉండేది కాదని కృష్ణ అంటుంది. దానికి మురారి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేయలేమని అంటాడు. 


కృష్ణ: సరోగసీ మదర్ వేరే ఎవరైనా అయింటే మనమే దగ్గరుండి ఆదర్శ్‌, మీరాల పెళ్లి చేసేవాళ్లం. ఇప్పుడు చూడండి ఈ పెళ్లి ఎలా ఆపాలా అని మన ఇద్దరమే ఆలోచిస్తూ ఉన్నాం. మనం ఏం తప్పు చేశాం ఏసీపీ సార్ ఎందుకు ఇలా జరుగుతుంది. 


మురారి: ఇవే కాదు మనకు ముందు ముందు ఇంకా చాలా సమస్యలు వస్తాయి. వాటిని మనం ఎదుర్కొవాలి. ముందు అయితే ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. 


కృష్ణ: నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు.


ఇంతలో భవాని పాలు తీసుకొని అక్కడికి వస్తుంది. ఇద్దరూ షాక్ అయి నిల్చొంటారు. ఎందుకు ఇద్దరూ టెన్షన్‌లో ఉన్నారని భవాని దేవి అడుగుతుంది. ఏం లేదు అని మురారి టెన్షన్ పడుతూనే కవర్ చేస్తాడు. ఆదర్శ్‌ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్తారు. ఇక కృష్ణ తనకు బిడ్డ గురించి పెళ్లి గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేదని అంటుంది. ఇక భవాని ఆదర్శ్‌ పెళ్లి బాధ్యత ఇద్దరి మీద పెడుతుంది. ఇక కృష్ణ మురారితో ఇప్పుడు చెప్పండి ఏసీపీ సార్ అసలు ఈ పెళ్లి ఆపే ఆలోచన చేయగలమా అని అడుగుతుంది. 


ముకుంద: డైరీ రాస్తూ.. కృష్ణ నన్ను ఆరోజు చెంప మీద కొట్టావు. ఆ రోజే చెప్పా నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు అని.. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లే వరకు నీకు చుక్కలు చూపిస్తా చూడు. ఈ సారి పక్కాగా క్లియర్ ప్లాన్ చేస్తున్నాను అనుకుంటుంది. ఈ బిడ్డ కోసం కచ్చితంగా పెళ్లి ఆపుతారు. నేనే సరోగసీ మదర్ అని తెలిసిపోతుంది. కృష్ణ చేసిన నేరానికి ఇంటిలో ఉండనివ్వరు. ఒకవేళ ఉండనిచ్చినా ఎవరికీ ముఖం చూపించుకోకుండా తానే వెళ్లిపోతుంది. ఒకవేళ తానే ముకుంద అని బయట పడిన తాను ఉన్న పరిస్థితి వల్ల ఎవరూ ఏమీ అనరని అనుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ల బిడ్డ నా కడుపులోకి వచ్చిందో అప్పుడే మొత్తం నా కంట్రోల్‌లోకి వచ్చేసింది. భవాని అత్తయ్య తర్వాత ఈ ఇంటి యజమాని స్థానం నాదే.


ముకుంద పుట్టిన రోజు నాడే మీరా పుట్టిన రోజు వచ్చిందని అది షాకింగ్‌గా ఉందని కృష్ణ.. మురారితో చెప్తుంది. దాంతో మురారి ఒకే తేదీలో పుడితే ఒక్కరే అయిపోరని క్లాస్ తీసుకుంటాడు. 


కృష్ణ: అసలు నా డౌట్ ఏంటి అంటే ఈ మీరా సరోగసీ మదర్‌గా ఉంటున్నా అని ముందే ఎందుకు చెప్పలేదు. చట్టపరంగా చెప్పలేదా.. కుట్ర పరంగా చెప్పలేదా. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేయండి కనిపెట్టేద్దాం. 


మురారి: ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే. ఆదర్శ్ పెళ్లి ఆపడం, మీరా కడుపులో ఉన్న మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం. 


భవాని దేవి పంతుల్ని పిలిపించి ఆదర్శ్‌, మీరాల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తుంది. ముకుంద మనసులో కృష్ణని ఏడిపించడానికి ఇతన్ని భరించాల్సి వస్తుందని అనుకుంటుంది. మురారి, కృష్ణలు వస్తారు. పంతుల్ని చూసి షాక్ అవుతారు. దగ్గర్లో ఏ ముహూర్తాలు లేకుండా చూడాలని కృష్ణ కోరుకుంటుంది. మరోసారి భవాని పెళ్లి బాధ్యతల్ని కృష్ణ, మురారిల మీద పెడుతుంది. ఇక రేవతి.. కృష్ణ ప్రవర్తనలో తేడా ఉందని ఏదో జరుగుతుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ : స్కూల్‌లో దీపకు అవమానం, అమ్మ మీద అలిగి బుంగమూతి పెట్టుకున్న శౌర్య.. నర్సింహ వర్సెస్ కార్తీక్!