Satyabhama Today March 8th Episode క్రిష్‌ గులాబి తీసుకొని సత్య దగ్గరకు వస్తాడు. సత్యకు ఇస్తాడు. సత్య తీసుకొని వెళ్లిపోవాలని అనుకుంటే క్రిష్‌ సత్య చేయి పట్టుకుంటాడు. దీంతో సత్య చేయి వదిలించుకొని వెళ్తే గొడవ పడతాడు అని అలా అని ఉండిపోతే చిరాకు పెడతాడు ఏం  చేయాలి అని అనుకుంటుంది. 


క్రిష్‌: నీతో మస్త్‌ ముచ్చట్లు చెప్పాలి అని ఆరాటంతో వచ్చా పారిపోతే ఎట్లా శంపంగి. ఇక బాలు చూస్తాడు. మనది లవ్ మ్యారేజ్. కానీ గమ్మత్తు ఏంటో తెలుసా నా మనసులో ప్రేమను నీకు పూర్తిగా చెప్పలేకపోయాను. తెల్లారితే మన పెళ్లి అంటే ఈరోజు వరకే మనం లవర్స్. మనం భార్యాభర్తలం. పోని పెళ్లి అయినాక ప్రేమ గురించి చెప్దామంటే పాచిపోయినట్లు ఉంటుంది. ఒక్క నిమిషం అని పేపర్ తీస్తాడు.
సత్య: ఏంటది.
క్రిష్‌: లవ్ లెటర్. నా మనసులో ఉన్న ప్రేమ ఈ పేపర్‌ మీద రాసుకొచ్చి నీకు ఇవ్వాలని తీసుకొచ్చా. కానీ నీ కళ్లల్లోకి కళ్లు పెట్టి నా మనసులోని మాట నీకు చెప్తే నా థిల్ ఖుష్ అవుతుంది. అని పేపర్ నలిసేసి పడేస్తాడు. 
సత్య: ఎందుకు అలా చూస్తున్నారు.
క్రిష్‌: తప్పు నాది కాదు నీ అందానిది. ఒక్కటి చెప్పు నువ్వు అందంగా ఉన్నావా. లేక అందమే నీలా ఉంటుందా. 
బాలు: అమ్మో ఏమో అనుకున్నాను కానీ మామూలోడు కాదు రసికుడే..
సత్య: అమ్మా వాళ్లు వెయిట్ చేస్తుంటారు వెళ్తాను.
క్రిష్‌: ఏయ్ సిగ్గుతో పారిపోతున్నావులే తెలీదు అనుకుంటున్నావా ఒక్కనిమిషం. సత్య చేయి పట్టుకొని అర చేతిని క్రిష్ చూస్తాడు. వెతుక్కుంటున్నాను. జాతకంలో రాసిపెట్టిన వాడితోనే పెళ్లి అవుతుంది కదా నీ చేతిలో నా పేరు ఎక్కడుందో అని వెతుకుతున్నా. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలీడం లేదు సంపంగి. మీ వాళ్లని ఎదురించి పెళ్లి చేసుకుంటున్నావంటే అది మామూలు ముచ్చట కాదు సంపంగి. నీ ఇంట్లో మనల్ని మన ప్రేమని దూరం చేయాలి అని ఎంత మంది ప్రయత్నించినా నువ్వు నాకోసం నా మీద ఉన్న ప్రేమ కోసం అందర్ని ఎదురించావ్. ఇది నా లైఫ్‌లో చాలా గొప్ప విషయం. అసలు ఈ జీవితానికి ఇది చాలు సంపంగి. నువ్వు నా పక్కన ఉంటే చాలు నేను దేన్ని అయినా ఎదురిస్తా తెలుసా. ఒట్టేసి చెప్తున్నా సంపంగి నీ సంతోషమే నాకు అన్నీ. ఎలాంటి ఇబ్బంది ఎదురొచ్చినా నేను నీకు అండగా నిలబడతా. జీవితాంతం నేను పట్టుకున్న ఈ చేయి విడవను. అంటూ మోకాలు మీద నిల్చొని సత్య చేయి పట్టుకొని సత్యకు రింగ్ పెడతాడు. 
బాలు: హలో బ్రో నీది మామూలు ప్రేమ కాదు బ్రో. ప్రేమే నీ మీద ఈర్ష్య పడేలా ప్రేమిస్తున్నావ్ హాట్సాఫ్.
క్రిష్‌: చూసేశావా. 
బాలు: ఇప్పుడు సూపర్‌ హిట్ మూవీకి బాడ్ టాక్ ఇచ్చినట్లు ఎవరో నీ గురించి బాడ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. 
క్రిష్‌: అవును బ్రో.
బాలు: అసలేం జరిగింది.. అంటే క్రిష్ మొత్తం చెప్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. 
క్రిష్‌: నువ్వే చెప్పు బ్రో చావుబతుకుల మధ్య ఉన్న సత్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం తప్పా. నా సంపంగిని చూడాలని ఆరాటపడటం తప్పా. నేను సంపంగిని ప్రేమించడం తప్పా.. సంపంగి నన్ను ఇష్టపడటం తప్పా. ఎందుకు బ్రో ఈ పెద్దవాళ్ల మమల్ని దూరం చేస్తున్నారో. ఎందుకు నామీద పగపడుతున్నారు.
బాలు: మా మామయ్య గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు బ్రో. అలాంటి ఆయన నిన్ను మిస్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది బ్రో. సర్లే అది నేను చూసుకుంటానులేగానీ. చాలా బాగుంది బ్రో నీ లవ్‌ స్టోర్. నీ లవ్‌ స్టోరీ విన్నాక నా మనసే కరిగిపోయింది బ్రో. ఫిదా అయిపోయా. చూడు బ్రో నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ మీ లవ్‌ స్టోర్ సూపర్‌ సక్సెస్. బుద్దున్నోళ్లు మిమల్ని విడదీయరు. ఎవరెన్ని చేసినా మీ పెళ్లి మాత్రం జరుగుతుంది. మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తా.. ఆల్‌ది బెస్ట్ బ్రో. 


మరోవైపు సత్య, క్రిష్, హర్షలు మంగళ స్నానాలకు వస్తారు. నందిని రాదు. నందిని ఎక్కడ అని అందరూ అడుగుతారు. భైరవి తీసుకొస్తా అని వెళ్తుంది. భైరవి పిలిస్తే నందిని రాను అని చెప్తుంది. కూతురుకి ఇష్టం లేని పెళ్లి చేస్తే నువ్వు కూడా బాపుకే సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది.


నందిని: నాకు ఒక రూల్ చిన్నన్నకి ఒక రూలా.. వాడికేమో కోరుకున్న పిల్లతో పెళ్లి. నాకేమో ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తారా ఇదేం న్యాయమే.
భైరవి: నేనే  ఒప్పుకుంటా బిడ్డా మీ బాపు నీకు అన్యాయం చేస్తున్నాడు. మాటిస్తున్నా అన్నింటిని నేను సరిచేస్తా.. 
నందిని: సరిచేసుడు అంటే..
భైరవి: వాడితో నీ పెళ్లి జరగనివ్వను. కడుపులో పొడిచే ధైర్యం లేనప్పుడు వెన్నుపోటు పొడవాలి. ఉన్నమాట చెప్పనప్పుడు మోసం చేయాలి.
నందిని: అంటే బాపుని మోసం చేసే ధైర్యం నీకు ఉందా.
భైరవి: ఇంతకు ముందే నిలదీశావ్ కదే నువ్వు అమ్మవేనా అని అమ్మని కాబట్టే తెగించి నీ వెనక నిలబడుతున్నా. కట్టుకున్న మొగుడిని మోసం చేయబోతున్నా. నా బిడ్డని ఆ అడుక్కుతిన్న ఇంటికి కోడలు కాకుండా ఆపుతా. 
నందిని: నమ్మొచ్చు కదా.. నా దిక్కు ఉన్నట్టుండి ఆఖరి నిమిషంలో చేయి ఇస్తే. లేదంటే ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి పారిపోతా.
భైరవి: పారిపోయి ఏం చేస్తావే బాపుని కాదు అని బతుకుతావా. బాపు కళ్లు కప్పి ఎన్నాళ్లు దాక్కొంటావ్. నా మాట విను. ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా. పద. 


రెండు జంటలకు మంగళ స్నానాలు జరుగుతాయి. ఇక సత్య తన తల్లిదండ్రులు ఇంకా రాలేదు ఏంటని ఆలోచిస్తుంది. దీంతో క్రిష్ సంపంగి నువ్వు చూడాల్సింది ఆ దిక్కు కాదు నా వైపు.. మన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. సిగ్గు ఎందుకు చెప్పు. ఇంతలో బాలు మాకు వినిపించేస్తుంది అంటాడు. దాంతో క్రిష్ ఏం లాభం వినిపించాల్సిన వారికి వినిపించడం లేదు కదా అంటాడు. దీంతో బాలు అది వినిపించకపోవడం కాదు బ్రో ఏడిపించడం అంటారు అంతే కదా సత్య అని అడుగుతాడు. ఇక విశాలాక్షి విశ్వానాథానికి రమ్మని పిలుస్తుంది. విశ్వనాథం పిల్లల జీవితం పాడైపోతుంది అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: మహేష్‌ బాబు: ఎంతపని చేశావ్‌ మహేష్‌! - ఆ రూల్‌ బ్రేక్‌ చేసి రాజమౌళికి షాకిచ్చిన సూపర్‌ స్టార్‌?