Satyabhama Today Episode క్రిష్ నానమ్మ, గంట వచ్చి క్రిష్ కోసం గదిలో వెతుకుతారు. క్రిష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి పడుకొని ఉంటే గంట కొట్టి నిద్ర లేపుతారు. ఎందుకు నిద్ర లేపావని క్రిష్ తన నానమ్మని అడిగితే పొద్దున్నే పెళ్లి పెట్టుకొని రాత్రి ఫుల్లుగా తాగి అడ్డగాడిదలా పడుకుంటారా అని అంటుంది. 


క్రిష్: అరే బాబీ రాత్రి తాగి మీ వదినతో మాట్లాడిన వరకు గుర్తుందిరా తర్వాత ఏమైందిరా..
బాబీ: ఏమో అన్నా అదంతా నేను చూడలేదు. కానీ వదిన మాత్రం నిన్ను మోసుకొని వస్తుంటే మాత్రం చూశాను. 
క్రిష్: నన్నా..
బాబీ: అవును అన్న వదిన నిన్ను క్షమించాను అని అంటుంటే విన్నాను. క్రిష్: రేయ్ అంటే సంపంగి నన్ను నిజంగానే క్షమించింది అన్నమాట. బామ్మా... నా సంపంగి నన్ను క్షమించిందే.. 
బాబీ: అన్న ఇక పెళ్లి కొడుకుగా రెడీ అవ్వబోతున్నావ్.. 


పెళ్లికి అంతా సిద్ధం అవుతుంది. మహదేవయ్య, రుద్రలు బంధువులను రిసీవ్ చేసుకుంటుంటారు. పంతులు సత్యతో గణపతి పూజ చేయిస్తారు. 


సత్య: మనసులో.. స్వామి వివాహ జీవితంలో కలతలు రాకుండా ఉండటానికి ఇలాంటి పూజ చేస్తారు. కానీ తెలిసి తెలిసి నేను నరకంలో అడుగుపెడుతున్నాను. నువ్వే నన్ను కాపాడాలి స్వామి. నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నాను తల్లి. ఈ ఒక్క రోజు ప్రశాంతంగా గడిచేలా చూడు ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా నా మెడలో మూడు ముళ్లు పడేలా చూడు. నా ఫ్యామిలీకి ఒక రాక్షసుడి నుంచి విముక్తి కలుగుతుంది. రేపటి నుంచి స్వేచ్ఛగా సంతోషంగా బతుకుతారు. నా కోసం వాళ్లు వాళ్ల కోసం నేను ఇన్నాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నాం. ఈరోజు నుంచి వాళ్లకి విముక్తి కలగాలి.
విశాలాక్షి: సత్య..
సత్య: ఏంలేదు అమ్మ కళ్లలో నలక పడింది. 
విశాలాక్షి: కళ్లలో కాదు అమ్మ నీజీవితంలో పడింది. అది కొన్ని కనీళ్లతో పోయేది కాదు. 


ఇక సత్య పూజ పూర్తి అవుతుంది. మరోవైపు క్రిష్, హర్షలు పెళ్లి కొడుకుల్లా రెడీ అయి పెళ్లి పందిరి దగ్గరకు వచ్చి పూజ చేస్తారు. తర్వాత పంతులు పెళ్లి కూతుళ్లను తీసుకొని రమ్మని చెప్పారు. 
విశాలాక్షి: సత్య ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావ్. ఎలా మాట్లాడగలుగుతున్నావ్. ఇది నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. ఇంకొక్క సారి ఆలోచించు అమ్మ. మరికాసేపట్లో నీ మెడలో పడే మూడు ముళ్లు నీ జీవితంలో సంతోషం నింపవు. గుండెలో ముళ్లులా గుచ్చుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అతనితో కలిసి నడిచే ఏడు అడుగులు నీ జీవితానికి శనిలా చుట్టుకుంటుంది.
సత్య: ఏం జరిగినా మన తలరాత ప్రకారమే జరుగుతుంది అని నువ్వే అంటావు కదా అమ్మ. మరి ఇప్పుడు ఎందుకు అది మర్చిపోతున్నావ్. పెళ్లి చేసి పంపే వరకే తల్లి బాధ్యత నీ వరకు అది పూర్తి అయింది. ఇకపై నా జీవితం నా బాధ్యత. అంతా మంచే జరగాలి అని దీవించమ్మా. కన్న తల్లి దీవెనకు మించిన దీవెన ఏదీ ఉండదు. మనసులో.. క్షమించు అమ్మ మిమల్ని అందర్ని నా మాటలతో బాధపెడుతున్నాను. కానీ మీరంతా బాగుండాలి అనే నా ఉద్దేశం. అందుకే ఇలా మాట్లాడక తప్పదు. ఇక సత్య తన తండ్రిని కూడా హగ్ చేసుకొని... నాకు ఇన్నాళ్లు ఎప్పుడు బాధగా అనిపించినా నాన్న గుండెల మీద తల పెట్టుకునేదాన్ని. ఓదార్పు దొరికేది. కానీ ఈక్షణం నుంచి ఈ గుండెకు నేను దూరం అవుతున్నాను నాన్న..
విశ్వనాథం: కానీ ఈ గుండెకు మాత్రం సత్య ఎప్పటికీ దూరం కాదు అమ్మ. సత్య..
సత్య: నాన్న మీరు ఏం అనబోతున్నారో నాకు తెలుసు. నేను పెళ్లి కూతురిలా పెళ్లి పీటల మీదకు వెళ్లబోతున్నాను నాన్న. ఆశీర్వదించండి.. సత్యను తీసుకెళ్తారు.
మీన: ఇంతేనా అంకుల్ మీరు చేయగలిగేది. జీవితం నాశనం చేసుకుంటుంది అని తెలిసి కూడా కన్న కూతురిని పెళ్లి పీటల మీదకు ఎలా పంపించగలుగుతున్నారు. 
విశ్వనాథం: ఏలా ఆపమంటావ్ అమ్మ.. ఏం చేయాలో చెప్పు. జీవితాన్ని ఇచ్చాను కానీ తన జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకోలేను కదా. కన్న తండ్రికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది అమ్మ. గొడవ పడి లాభం లేదు. అలా అని లక్ష్మణ రేఖ గీసి ఆపలేను. అని ఏడుస్తాడు.
మీన: మనసుకు నచ్చని పెళ్లి చేసుకుంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు అంకుల్. నేను వెళ్లి సత్యను పెళ్లిపీటల మీద నుంచి లాక్కొని వస్తాను. నా జీవితంలా తన జీవితం కూడా నాశనం చేసుకోవద్దు అని బతిమలాడుతాను. అర్థమయ్యేలా ఇంకోసారి చెప్తాను.
విశ్వనాథం: అమ్మ సత్య ఇప్పుడు వినే పరిస్థితిలో లేదు. ఈ నాన్న మాటే వినదు అంటే ఇంకెవరి మాట లెక్కచేయదు. 
మీన: అంటే కూతురి జీవితాన్ని గాలికి వదిలేస్తారా అంకుల్. నాకు అంటే నాన్న లేరు. అందుకే విధికి తల వంచాను. అమ్మకు బరువు కాకూడదు. అనుకున్నాను. కానీ అందరూ ఉండి కూడా సత్యను వదిలేయడం చూస్తుంటే మనసుకి కష్టంగా ఉంది.
విశ్వనాథం: మేం వదిలేయడం కాదమ్మ.. సత్యనే మమల్ని వదిలేస్తుంది. 


సత్య పెళ్లి పీటల మీదకు వెళ్తుంది. మరోవైపు పోలీస్ ఆఫీసర్ రఘు విశ్వనాథానికి కాల్ చేసి మనం వెతుకుతున్న ఆవిడ దొరికింది అని కంప్లైంట్ ఇచ్చి సాక్ష్యం చెప్తాను అంది అని చెప్తాడు. వెంటనే వచ్చేస్తాను అని అంటాడు. ఆ మహదేవయ్యను, రుద్రప్రతాప్‌ను అరెస్ట్ చేసి లాక్కెత్తాను అని రఘు చెప్తాడు. 


విశ్వనాథం: అమ్మ మీన ఆగిపోయినట్లేనమ్మ ఇక సత్య పెళ్లి ఆగిపోయినట్లే. జరగబోయేది నువ్వే చూస్తావు కదా.. పదమ్మ అర్జెంటుగా మండపానికి వెళ్దాం. 


మరోవైపు నందిని కూడా పెళ్లి పీటల మీదకు వచ్చేస్తుంది. విశ్వనాథం, మీనలు మండపం దగ్గర టెన్షన్‌గా ఉండటం సత్య చూస్తుంది. ఇక బాలు కూడా చూసి పూలగంప మీన.. తనని పట్టించుకోకుండా మామయ్య వెనకే తిరుగుతుంది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాడు. ఇక తను కోరుకున్న అమ్మాయి పెళ్లి కూతురిగా ఎదురుగా కూర్చొని ఉండడంతో క్రిష్ సంతోషంగా ఉంటాడు. 


సత్య: మనసులో.. ఎందుకు నాన్న అంత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఎందుకు పదే పదే గుమ్మం వైపు చూస్తున్నారు. మరోవైపు క్రిష్ తమ మధ్య ఉన్న తెరను నుంచి చాటుగా సత్యను చూసి మురిసిపోతాడు. 
బాలు: ఏంటి పూలగంప ఎందుకు అలా అదిరిపడ్డావ్.. పెళ్లి జరుగుతుంటే ఎందుకు ముఖం అలా పెట్టావు. 
మీన: నా ముఖమే అంత.. 
బాలు: పెళ్లి కూతురు ప్రశాంతంగా ఉంది. పెళ్లి కొడుకు హుషారుగా ఉన్నాడు. నువ్వేంటి అలా ఉన్నావ్.. 


ఇంతలో రఘు కొంత మంది పోలీసులతో కలిసి మండపానికి వస్తాడు. పోలీసుల్ని చూసి సత్య, క్రిష్, హర్షలు షాక్ అవుతారు. ఇక రఘు మహదేవయ్యతో మిమల్ని మీ పెద్ద కొడుకును అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఎక్కడి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని రుద్ర ఫైర్ అవుతాడు. 


మహదేవయ్య: ఇదిగో కమిషనర్ ఈ మహదేవయ్య ముందు ఉండి మాట్లాడాలి అంటే కాకీ డ్రస్ ఉంటే సరిపోదు దాని వెనక గుండె ఉండాలి దానిలో దమ్ము ఉండాలి. 
రఘు: అన్నీ ఉండే మీ ముందు నిలబడ్డాను. అయినా నేరస్తుల్ని అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు మహదేవయ్య గారు. బేడీలు ఉంటే చాలు..మీరు రెండు నెలల క్రితం శీనయ్య అనే వ్యక్తిని మర్డర్ చేశారు. అతని భార్య ఇప్పుడు ఫిర్యాదు చేసింది. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపకు మరో 600 కోట్ల విలువైన ఆస్తి.. షాక్‌లో సుమన, అక్కాబావలతో మళ్లీ లొల్లి!