Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 15th ఎపిసోడ్)


వసు బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు మనుపై ఫైర్ అవుతాడు రాజీవ్. నీలాంటి వాళ్లనుంచి రక్షణ కల్పించేందుకే నేను ఆమెకు తోడుగా ఉంటానంటాడు మను. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా వసుధారని అల్లరి చేయాలని చూసినా చంపేస్తా.... మాటలు చెప్పి వదిలేస్తా అనుకోకు నిజంగానే ప్రాణం తీసేస్తా అని వార్నింగ్ ఇచ్చివెళ్లిపోతాడు మను.


మనుకి కాల్ చేద్దామా వద్దా అని ఆలోచనలో పడిన వసుధార ఎట్టకేలకు కాల్ చేస్తుంది...
వసు: హలో మను గారు నేను వసుధారని...
మను: మీ నంబర్ ఉంది మేడం..పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు..ఏదైనా పనిపై కాల్ చేసారా
వసు: మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా..నా బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు..
మను: మీకు ఇవన్నీ ఇష్టం ఉండదు అన్నా కదా
వసు: రిషి సర్ లేకుండా ఏ సెలబ్రేషన్ నాకు సంతోషాన్నివ్వదు..కానీ రోజు మీరు సెలబ్రేట్ చేసిన తీరు నాకు రిషి సర్ ని గుర్తుచేసింది..
మను: ఈ ప్రపంచంలో మీకు రిషి సర్ తప్ప ఇంకేదీ సంతోషాన్నివ్వలేదని తెలుసు..మిమ్మల్ని సంతోషంగా చూడాలి అనిపించింది అందుకే అలా ప్లాన్ చేశాను
వసు: ఇంత తక్కువ టైమ్ లో ఏవీ ఎలా ప్రిపేర్ చేశారు...
మను: చాలా టైమ్ తీసుకున్నాను..మీ బర్త్ డే అని తెలిసి వన్ వీక్ ముందునుంచే షూట్ చేశాను..అందుకు మహేంద్ర సర్ సపోర్ట్ గా నిలబడ్డారు..ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పకండి..మీ మెచ్చుకోలు కోసం కాదు మీ సంతోషం కోసం చేశాను
వసు: మరో సాయం చేయగలరా..రిషి సర్ ని వెతికే క్రమంలో సాయం చేస్తారా
మను: కచ్చితంగా సపోర్ట్ చేస్తాను
వసు: నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు..ఇప్పటికే చాలా సవాళ్లు ఎదుర్కొంటూ వచ్చాను..నన్ను కాపాడుకుంటూ కనిపించకుండా రిషి సర్ ని కాపాడుకుంటూ వచ్చాను..కానీ ఏమయ్యారో తెలియదు..సర్ ఉన్నారనే నమ్ముతున్నాను..నా నమ్మకాన్ని బలపర్చారు..అందుకే మిమ్మల్ని సాయం అడుగుతున్నా
మను: దీన్ని సాయంగా ఫీలవడం లేదు నా బాధ్యతగా ఫీలవుతున్నా...డీబీఎస్టీ కాలేజీని చేయి జారిపోకుండా ఎలా కాపాడానో రిషి సర్ ని కూడా తీసుకొస్తాను అందుకు సహకరిస్తాను...
ఎలాగైనా కానీ వసుధారా మేడంకి రిషి సర్ ని అప్పగించాలి అనుకుంటాడు మను...


Also Read: రిషి వచ్చే రోజు దగ్గరపడిందన్న వసు - తనకి రక్షకుడిని అంటూ రాజీవ్ కి క్లారిటీ ఇచ్చిన మను , గుప్పెడంతమనసు మార్చి 14 ఎపిసోడ్!


రాజీవ్-మహేంద్ర
నా చావు వాడి చేతిలో ఉందంటున్నాడేంటి అని ఫైర్ అవుతాడు రాజీవ్.. శైలేంద్ర కూల్ చేసేందుకు ప్రయత్నించినా అస్సలు తగ్గడు రాజీవ్. వెంటనే వాడిని చంపేస్తానంటాడు. వదిలెయ్ అని శైలేంద్ర అనడంతో... మాటలు పడింది నువ్వుకాదుకదా అందుకే ఇలా అంటున్నావని చురకలు వేస్తాడు రాజీవ్. వాడిని చంపేస్తే మనిద్దరికి పిండం పెట్టేస్తారంటాడు శైలేంద్ర. కానీ మన చేతికి మట్టి అట్టకుండా వాడిని లేపేద్దాం అని ఫిక్సవుతారు. ఓ రౌడీకి మను ఫొటో పంపించిన శైలేంద్ర...వాడు ఈ లోకంలో ఉండకూడదు అని చెబుతాడు. ఇక మనుకి చెక్ పడినట్టే అని ఫిక్సైపోతారు..


Also Read: రిషి సమక్షంలో వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ - రాజీవ్ కి ఝలక్ ఇచ్చిన మను!


వ‌సుధార చాలా సంతోషంగా క‌నిపించ‌డం అనుప‌మ గ‌మ‌నించి నీ సంతోషానికి కార‌ణం ఏంటని అడుగుతుంది. మ‌ను త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసిన తీరు న‌చ్చింద‌ని వ‌సుధార రిప్లై ఇస్తుంది. తన వ్యక్తిత్వం ఎలాంటిదని అనుప‌మ‌ను ప్ర‌శ్నిస్తుంది వ‌సుధార‌.
అనుపమ: మంచివాడు, క‌ల్మ‌షం లేని మ‌నిషి, ఎదుటివాళ్లు క‌ష్టాల్లో ఉంటే చూస్తూ ఉండ‌లేడు. అంద‌రికి సాయం చేస్తూ ఉంటాడ‌ు 
వసు: రిషి నా ప‌క్క‌నే ఉండి నా బ‌ర్త్‌డేను జ‌రిపిన‌ట్లుగా మ‌ను చ‌క్క‌గా ఏర్పాట్లు చేశాడ‌ు, చాలా రోజుల త‌ర్వాత నా మ‌న‌సుకు ఆనందం క‌లిగేలా మ‌ను చేశాడ‌ు తను చాలా గ్రేట్ . రిషిని వెత‌క‌డంలో మ‌ను త‌న‌కు సాయం చేస్తాన‌ని మాటిచ్చారు
అనుపమ: రిషి వ‌స్తే అన్ని క‌ష్టాలు తొల‌గిపోతాయి, మ‌న బాధ‌ల‌న్నీ తీరిపోతాయి...వీలైనంత తొంద‌ర‌గా రిషి జాడ తెలిస్తే బాగుండున‌ు
వసు: మ‌నుకు మీకు ఏదైనా శ‌త్రుత్వం ఉందా 
ఆ ప్రశ్నకు షాక్ అవుతుంది అనుపమ
వసు: ఫ‌స్ట్ టైమ్ మ‌ను కాలేజీకి వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని చూసి షాక‌య్యారు. మ‌నును చూడ‌గానే మీ ఫేస్‌లో ఆనందం క‌నిపిస్తుంది. సొంత మ‌నిషిని చూసినట్లు ఫీల‌వుతారు. తన ప‌ర్స‌న‌ల్ విష‌యాలు రాగానే మీరు కోపంగా చాలా సార్లు టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డం   గ‌మ‌నించాన‌ు.
అనుపమ: మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు
వసు: మీ క‌ళ్లు అబ‌ద్ధం చెబుతున్నాయి. గ‌తంలో జ‌గ‌తి మేడ‌మ్‌, రిషి మ‌ధ్య ఇలాంటి ఎమోష‌న్ చూశాన‌ని, అలాంటి ఎమోష‌న్ మీకు, మ‌నుకు మ‌ధ్య   క‌నిపిస్తోంది . మీకు పెళ్లి కాలేద‌ని అన్నారు కానీ మీకు పెళ్లి అయ్యింద‌ని నాకు అనిపిస్తోంది. మ‌ను రాక‌ముందు అనుప‌మ మేడం వేరు...మ‌ను వ‌చ్చిన త‌ర్వాత వేరుగా క‌నిపిస్తున్నారు
అనుపమ: నాకు పెళ్లి కాలేద‌ు ఒంట‌రిని జీవితాంతం ఇలాగే ఉంటాన‌ు నాకు ఎలాంటి బంధాలు లేవు ఇక‌పై ఉండ‌వు కూడా 
వసు: మ‌రి మ‌ను ఎవ‌రు?  మీకు ఎలా ప‌రిచ‌య‌మ్యాడు? గ‌తంలో మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదైనా గొడ‌వ జ‌రిగిందా?  మ‌ను మీ గ‌త‌మా లేదా అన్న‌ది స‌మాధానం చెప్పాల‌ి 
అనుపమ: ఈ ప్ర‌శ్నలు ఇంకెప్పుడు న‌న్ను అడ‌గొద్దు.  అది నీకు అవ‌స‌రం లేని విష‌యం అని చెప్పి కోపంగా  అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.
అనుప‌మ స‌మాధానం చెప్ప‌కుండా వెళ్ల‌డంతో వ‌సుధార అనుమానం మ‌రింత పెరుగుతుంది. మ‌ను, అనుప‌మ మ‌ధ్య ఏదో బ‌ల‌మైన బంధం ఉంద‌ని ఫిక్సవుతుంది...


ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


గుప్పెడంతమనసు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది
గుప్పెడంత మనసు మార్చి 16 ఎపిసోడ్ లో (Guppedantha Manasu March 16th Episode) మనుపై హత్యా ప్రయత్నం జరగబోతోంది...అనుపమ  ఏం చేస్తోందో చూడాలి.