Brahmamudi Serial Today Episode: ఇంట్లో గొడవ తర్వాత కావ్య, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి ఇకపై తన చెల్లెలు అప్పునూ కలవొద్దని దీనివల్ల నీకే ప్రాబ్లమ్‌ రాకున్నా అప్పుకు ఇబ్బంది అవుతుందని చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ మా స్నేహం చాలా పవిత్రమైందని పెళ్లికన్నా ముందే మేం స్నేహితులమని చెప్తాడు. కానీ సొసైటీ అలా అనుకోదని నువ్వు కూడా అనామిక మనసును కష్టపెట్టకుండా చూసుకోమని చెప్తుంది కావ్య. అయితే  ఈ విషయంలో నేను మీ మాట వినలేనని అప్పూను కలవాలనుకుంటే కలిసి తీరతానని తెగేసి చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్‌. తర్వాత కావ్య కాఫీ తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి ఇస్తుంది. రాజ్ ఒక్క నిమిషం అంటూ డబ్బులు తీసి కావ్యకు ఇస్తాడు.


కావ్య: కాఫీ ఇంత ఖరీదైందేమీ కాదు. నేనేమీ కాఫీ కొట్టు పెట్టుకోలేదు. ఎందుకు ఇంత డబ్బు ఇచ్చారు.  


రాజ్‌: ఇది నీకు రావాల్సిందేలే.. నువ్వేసిన డిజైన్స్‌ కు నేను ఇవ్వాల్సిన డబ్బు.


కావ్య: నెల కాగానే జీతం ఇస్తారుగా


రాజ్‌: అప్పటిదాకా నువ్వు ఉండవు కదా? పాస్‌ఫోర్టు వచ్చిందిగా పారిన్‌ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలిగా.. ఇంకా కావాలంటే అడుగు ఇస్తాను.


అని చెప్పి రాజ్‌ వెళ్ళిపోతాడు. ఇంతలో ఇందిరాదేవి, భాస్కర్‌ వస్తారు.


కావ్య: చూశారా అమ్మమ్మగారు మా ఆయన నేను వెళ్ళిపోవడానికి  దారి ఖర్చులకు చాలా డబ్బులు ఇచ్చారు.


ఇందిరాదేవి: నువ్విలాగే ఆలోచిస్తుంటే వాడు అహానికి పోయి నిన్ను ఎయిర్‌ఫోర్టులో దించేసినా దించేస్తాడు.


అంటూ నువ్వు ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు వాడు ఎందుకు దారికి రాడో నేను చూస్తాను అంటూ బామ్మ చెప్తుంది. నీ కాపురం నిలబెట్టుకోవడానికి నీ ముందున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకో లేదంటే నీఇష్టం అంటూ ఇందిరాదేవి, భాస్కర్‌ వెళ్లిపోతారు. కావ్య ఏడుస్తూ కాగితాలు పట్టుకుని వెళ్లి దేవుడి ముందు నిలబడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. తర్వాత పేపర్స్‌ పై సంతకం పెడుతుంది కావ్య.  ఆ పేపర్స్‌ తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. రూంలో రాజ్‌ రెడీ అవుతుంటాడు. కావ్య ఏడుస్తూ పేపర్స్‌ పక్కకు పడేసి వెళ్లి రాజ్‌ను వెనకనుంచి హగ్‌ చేసుకుని..


కావ్య: మీరు నాకు కావాలి. నేను ఎప్పటికి నీ భార్యగానే ఉండాలి. నన్ను దూరం చేసుకోవద్దు నేను భరించలేను. మీకు దూరం అయ్యి నేను తట్టుకోలేను. ప్రశాంతంగా బతకలేను. మీరు నాకు కావాలి.


అన్నట్లు కావ్య కలగంటుంది. ఇంతలో కావ్యను చూస్తూ..  


రాజ్‌: పిలిచావా? గది బయటే నిలబడిపోయావేంటి?  


కావ్య: మీ నిర్ణయం కోసం...  ఈ కాగితాలు చూడండి.


రాజ్‌: ఏంటివి?


కావ్య: మన భవిష్యత్తు ఈ రాతల్లోనే ఉంది.


రాజ్‌: స్వప్నకు రాసిచ్చినట్టుగా నీక్కూడా భరోసా కోసం ఆస్థి ఏమైనా రాసివ్వాలా? స్థిరాస్తులు రాసిచ్చే రైట్స్‌ నాకు లేవు. తాతయ్యే రాయాలి. అయినా నాన్నమ్మ నీకు బెస్ట్‌ ఫ్రెండే కదా


కావ్య: నాకు మీ ఆస్థులేం అక్కర్లేదు.


రాజ్‌: మరేం కావాలి?


కావ్య: విడాకులు, అవును విడాకుల పేపర్స్‌ మీద నేను సంతకం చేశాను. మీరు సంతకం చేయడమే బాకీ ఉంది. మీరు కోరుకున్నదే కదా.. నేనేమీ వెళ్లిపోతాననలేదు. నాకు విడాకులు ఇచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని మీరే చెప్పారు. మీరు మారతారని చాలా చేశాను. సంవత్సరం గడిచిపోయింది. ఇక మీ జీవితం మీ ఇష్టం.


అంటూ కావ్య చెప్తుంటే రాజ్‌ బాధగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ట్రెండీ వేర్‌లో కేకపుట్టిస్తున్న 'గుప్పెడంత మనసు' ఫేం వసుధర అలియాస్ రక్షా గౌడ