Trinayani Telugu Serial Today Episode: విశాల్ పెద్దమ్మ లలితా దేవి రాక కోసం ఇంట్లో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో లలితా దేవి చేతిలో ఓ మూట పట్టుకొని ఇంటికి వస్తుంది. ఎలా ఉన్నారు అని ఇంట్లో వాళ్లు అడిగితే తన చెల్లి గాయత్రీ దేవి విషయం పేపర్, టీవీల్లో వచ్చినప్పటి నుంచి బాధగా ఉందని లలితా దేవి చెప్తుంది. ఇక నయని లలితాదేవిని కూర్చొపెట్టి అరచేతులను దగ్గరకు తీసుకొని చూస్తుంటుంది.


లలితాదేవి: శంఖరశాస్త్రిగారి మనవరాలిని అని ఇంకా మర్చిపోలేదన్న మాట. జాతకం చెప్పాలి అనిపించిందా నయని.
నయని: లేదమ్మ గారు ఎంతో మందికి సాయం చేసిన ఈ చేతులను పట్టుకొని చూడాలి అనిపించి.. 
సుమన: తిలోత్తమ సుమనకు అడగమని సైగ చేయడంతో.. అత్తయ్య గారు పట్టుకొచ్చిన ఈ మూట ఏంటో. 
విక్రాంత్: పెద్దమ్మ చేతి బరువును నయని దించేస్తే నువ్వు మాత్రం అదేంటో అని బుర్ర బరువు పెంచుకుంటున్నావ్.
లలితాదేవి: చెప్పకపోయినా మూట విప్పకపోయినా నీ భార్య బతికేలా లేదు విక్రాంత్. మూటలో ఉన్నది మా అక్కచెల్లిల్ల పేరిట మా నాన్న గారు రాసిచ్చిన ఆస్తి. ఆడవాళ్లమైన కష్టపడేతత్వం ఉంది కాబట్టి వారసత్వంగా వచ్చిన ఆస్తిని అనుభవించకుండా మాకున్న అనుభవంతో బిజినెస్ విమెన్‌లమయ్యాం. వందల కోట్లు సంపాదించాం.
తిలోత్తమ: అక్క మీ కదలికలు చూస్తుంటే ఏదో ముఖ్యమైన సమాచారం చెప్తున్నావ్ కానీ మీ మాట ఏంటో ఆ మూట ఏంటో తెలీడం లేదు. 
నయని: సైగలతో మీకు నేను తర్వాత అర్థమైయ్యేలా చెప్తాను.
లలితాదేవి: వాళ్ల ఆత్రం ఆగదు.. నయని, ఎద్దులయ్య వాళ్ల చెవిలో ఊదండి.. 
విశాల్: వదిన వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి..
లలితాదేవి: ఈ మూటలో ఉన్నది నా చెల్లులు గాయత్రీ దేవివి నావి ఆస్తి పత్రాలు. 
విక్రాంత్: తిలోత్తమ, వల్లభలకు హాసిని ఎద్దులయ్య అర్థమయ్యేలా చెప్తారు. దీంతో విక్రాంత్ ఇలాంటివి అయితే బాగానే వినిపిస్తాయి.
సుమన: కోట్ల ఆస్తి మరి. 
తిలోత్తమ: ఇప్పుడు ఎందుకు తెచ్చినట్లు.
లలితాదేవి: నీ చిన్న కోడలు చేసిన నిర్వాకానికి అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.  
సుమన: నేను మంచి పనే చేయాలి అనుకున్నాను పెద్దత్తయ్య గారు.
నయని: అలా ప్రచారం చేయడం మంచి పని ఎలా అవుతుంది.
సుమన: మీరు ఎవరూ గాయత్రీ అత్తయ్యని వెతకనప్పుడు జనాలు అయినా వెతుకుతారు అని అలా చేశా.
విశాల్: సుమన అమ్మ కోసం నేను ఖర్చుకు వెనకాడుతాను అనుకుంటున్నావా..
సుమన: నేను అలా అపార్థం చేసుకున్నా సరే అందులో అర్థం ఉండొచ్చు బావగారు.
నయని: చెల్లి పెద్దమ్మ గారు వచ్చినప్పుడు అయినా కాస్త అణుకవతో ఉండు.
లలితాదేవి: తాను ఏం పొగరుతో అన్న మాటలు కావు అవి. ఇంకా చెప్పాలి అంటే నా చెల్లి గాయత్రీ దేవి ఆచూకి తెలీడం కోసం వార్తల్లో ప్రచారం చేయడం అనేది సుమన చేసిన మంచి పనే. 
సుమన: దయచేసి నేను ఎలా మంచి పని చేశానో వీళ్లకి చెప్పండి పెద్దత్తయ్య గారు. 
లలితాదేవి: నా చెల్లి పునర్జన్మ ఎత్తాక ఇన్నాళ్లు అయినా ఇంటికి రాలేదు అంటే నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది. జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొత్త ఇబ్బందులు వస్తాయి. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చి ఈ మూట తెచ్చాను. నయని ఈ మూట విప్పమ్మా.. మూటలో చాలా ఆస్తి పత్రాలు ఉంటాయి. మా అక్కా చెల్లెల్ల మీద ఉన్న కోట్ల ఆస్తిని పిల్లులు లేని నేను ఏం చేసుకోను. విశాల్ పేరిట రాసిస్తాను అన్నా అలాగే ఉండని పెద్దమ్మ అని ఆస్తి పోయినప్పుడు కూడా చెప్పాడు. ఆస్తి పేపర్లు ఈరోజు ఎందుకు తీసుకొచ్చాను అంటే ఎవరో ఒకరి పేరు మీద రాసేయాలి అని డిసైడ్ అయ్యాను.
సుమన: ఎవరికి ఇస్తారు పెద్దత్తయ్య గారు.
లలితాదేవి: నువ్వు మంచి పని చేశావ్ కదా..
సుమన: మనసులో.. అంటే నాకే ఇచ్చేస్తుందా.. ఉలూచి పేరున రాసినా రాసేస్తుంది. 
లలితాదేవి: గాయత్రీ దేవి జాడ చెప్పండి అని అడిగినందుకు ఎవరు అడిగినా ఏం చెప్పాలో తెలీడం లేదు. అందుకే మా అక్క తిరిగి వచ్చేంత వరకు మా అక్కాచెల్లెల్ల మొత్తం ఆస్తిని నయని, విశాల్ దత్తత తీసుకున్న గాయత్రీ పాప పేరు మీద రాయాలి అనుకున్నాను. అందరూ షాక్ అయిపోతారు. 
తిలోత్తమ: అనాథపిల్ల..
లలితాదేవి: నోర్ముయ్‌.. ఇంకోసారి ఆ మాట ఎవరూ అనకూడదు తిలోత్తమ. గాయత్రీ పాప చివరన దేవి అన్న పేరు చేర్చితే నా చెల్లిల పేరు వస్తుంది. 
సుమన: రేపు ఎప్పుడైనా మీ చెల్లెలు గారు అదే మా అక్క కన్న గాయత్రీ అత్తయ్య గారు ఇంటికి వచ్చేస్తే.. 
లలితాదేవి: అప్పటి వరకు ఆస్తి అంతా గాయత్రీ పాప పేరిటే ఉంటుంది. తనే నా చెల్లి గాయత్రీ అని చెప్పుకోవాలి. అందుకే రేపు మంచి రోజు పునఃనామకరణ చేసి 600 కోట్ల ఆస్తికి పట్టపు యువరాణిని చేయదలచాను. అభ్యంతరాలు ఉండకూడదు. ఏర్పాట్లే ఉండాలి. నయని ఆస్తి పేపర్లు జాగ్రత్తమ్మ. 


సుమన: తమ గదిలో హు.. ఎలా బతకాల్సిన వాళ్లు ఎలా బతుకుతున్నారో..
విక్రాంత్: ఎవర్ని అనాలి అనుకున్నావో వాళ్లనే అంటే చెంపపగలగొడతారేమో..
సుమన: మీరు కొట్టరుగా మిమల్నే అన్నారు.
విక్రాంత్: ఏంటి తమాషానా.. 
సుమన: నా బతుకులో సరదా ఏముంది అండి మీరు సీరియస్‌ కదా.. గాయత్రీని ఎత్తుకొని ఉంటే.. హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ పిల్లని ఎత్తుకొని కాలు కింద పెట్టకుండా చూసుకొంటే మీకు ఏం వస్తుంది. 
నయని: ఏం రావాలి అని కోరుకుంటున్నావో అది కూడా చెప్పు సుమన
సుమన: మీ దత్త పుత్రికను ఎత్తుకొని తిరిగితే బోనస్ డబ్బులు ఏమైనా ఇస్తారా అక్క. 
విశాల్: సుమన వీడు ఈ పాపకి బాబాయ్.. 
సుమన: నన్ను మాత్రం చిన్నమ్మ అని మాత్రం పరిచయం చేయకండి బావగారు.
విక్రాంత్: తనకు ఇంకా ఏం అర్థం కావడం లేదు బ్రో ఆస్తి అంతా పాప పేరు మీద వచ్చేస్తుంది అని అసూయ పడుతుంది. 
సుమన: మీరు కూడా కలిసొస్తుంది అనే కదా పిల్లని ఎత్తుకొని ఊడిగం చేస్తున్నారు.
నయని: నోర్మూసుకొని ఇక్కడి నుంచి వెళ్లకపోతే దెబ్బలు పడతాయి చెప్తున్నా. 
విశాల్: రేయ్ పాపను ఇటు ఇవ్వరా.. 
విక్రాంత్: బ్రో దీని మాటలు పట్టించుకోవద్దు. చూశావా నీ వల్ల బ్రో నన్ను నమ్మడం లేదు.
సుమన: అంత నమ్మకం లేని వారి మోచేయి నీళ్లు తాగడం ఎందుకో..
నయని: సుమన మంచిగా మాట్లాడకపోతే మర్యాద ఉండదు చెప్తున్నా. 
సుమన: ఏంటి అక్క ఇలా ప్రవర్తిస్తున్నావ్.. లలితా దేవి అత్తయ్య గాయత్రీ దేవి అత్తయ్య ఇద్దరూ అక్కాచెల్లెల్లు  చెల్లి కోసం లలితా దేవి ఆస్తి ఇచ్చేశారు. గాయత్రీ, గానవిలకు కూడా ఆస్తి ఉంది. మరి మనం కూడా అక్కాచెల్లెల్లమే కదా అక్క నువ్వు ఎందుకు నాకు ఏం ఇవ్వడం లేదు. 
విశాల్: నువ్వు నయని మాటలు విని ఉంటే నీ కోరికలు అన్నీ తీరేవి సుమన.  అయినా నీ ప్రవర్తనకు ఇప్పుడు నీకు చిల్లిగవ్వకూడా రాదు. కానీ నీకు ఒక అవకాశం ఉంది. నీ ప్రవర్తన మారితే విక్రాంత్ నీతో కాపురం చేస్తే నీకు ఓ బిడ్డ పుడితే నీకు ఆస్తిలో వాటా రావొచ్చు. అంతే కదా నయని. అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: ఓటీటీలో హనుమాన్ మూవీ: హమ్మయ్య.. 'హనుమాన్‌' తెలుగు ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..