Jagadhatri Telugu Serial Today Episode: టీవీలో ధాత్రి కేదార్‌లను చూసి యువరాజ్ షాక్ అవుతాడు. టీవీలో మాట్లాడుతున్న ధాత్రిని ఫోటో తీస్తాడు. వీళ్లిద్దరూ పోలీసులా.. పాఠాలు చెప్పుకునే పంతుళ్లా తెలియాలంటే వీళ్లు ఇంట్లో ఉన్నారో లేరో తెలుసుకోవాలి.. అనుకుంటుండగా బూచి రావడంతో యువరాజ్ బూచిని అడుగుతాడు ఇందాక స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్లారని చెప్తాడు. దీంతో యువరాజ్ వాళ్లు ఇంటికి రాని అప్పుడు చెప్తా అని బయట ఎదురుచూస్తుంటాడు. ఇంతలో కేదార్, ధాత్రి రావడంతో టీవీలో హెడ్‌లైన్స్ చదివినట్లు స్కాం గురించి యువరాజ్ చదువుతుంటాడు. దీంతో కేదార్, ధాత్రి షాక్ అవుతారు.
యువరాజ్: ఈ న్యూస్ ఎక్కడైనా విన్నట్టుందా?
ధాత్రి: లేదు యువరాజ్
యువరాజ్: న్యూస్ అయ్యేలా చేసిందే మీరైతే ఇంక మీకెలా తెలుస్తుందిలే బాగా ఫైట్ చేసి అలిసిపోయినట్లున్నారు. వెళ్లండి వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
కేదార్: యువరాజ్ నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావడం లేదు.
యువరాజ్: మొన్న కవర్ చేసినట్లు ఇప్పుడు కూడా కవర్ చేశారా? ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని పిచ్చొళ్లను చేసి తప్పించుకోవడం అలవాటే కదా?
ధాత్రి: నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు యువరాజ్.
అనగానే యువరాజ్ కోపంగా ఇక ఆపండి అంటూ నిలదీస్తాడు. దీంతో ధాత్రి ఏవో మాటలు చెప్పి మళ్లీ తప్పించుకుంటుంది. దీంతో యువరాజ్ మీరు చెప్తుంది కట్టుకథ అని నాకు బాగా తెలుసు అని యువరాజ్ అనుకుంటాడు. లోపలికి వెళ్లిన కేదార్ కూడా ధాత్రితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. లేదంటే యువరాజ్ మనల్ని కనిపెట్టేస్తాడు అని లోపలికి వెళ్లిపోతారు. తర్వాత మెహిందీ ఫంక్షన్‌కు అంతా రెడీగా ఉంటారు. నిషిక ధాత్రికి వాటర్ తీసుకురమ్మని చెప్పి దివ్యాంకను మీ ప్రేమ ఎలా మొదలైందని అడుగుతుంది. దీంతో దివ్యాంక తన ప్రేమ కథ చెప్తుంది. దీంతో సురేష్‌ను దూరం చేసుకున్న కౌషికిని తిడుతుంది దివ్యాంక. దీంతో దివ్యాంక, ధాత్రి మధ్య గొడవ జరగుతుంది.
ధాత్రి: ఆ దివ్యాంక లాంటి క్రిమినల్, సొసైటీలో చీడపురుగులాంటి మనిషి కూడా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతున్నాను వదిన.
కౌషికి: దివ్యాంక నుంచి మంచి మాట, మంచి ప్రవర్తన ఆశించడం కూడా మన తప్పే అవుతుంది జగధాత్రి. తన వాళ్ల ముందు తన మర్యాదను కాపాడుకోవడానికి మీ అమ్మ మీద దుమ్మొత్తిపోయాలని చూస్తుంది.
కేదార్: అవును ధాత్రి నువ్వు ఆ దివ్యాంక మాటలను ఏమీ పట్టించుకోవద్దు. అయినా నిజమేంటో మనకు తెలుసు ఆ దేవుడికి తెలుసు.
ధాత్రి: మంచివాళ్లకు మంచే జరుగుతుందంటారే మరి మా అమ్మ చావు ఎందుకు ఇన్ని నిందలు మోస్తుందో తెలియడం లేదు. కానీ దివ్యాంకకు బుద్ది చెప్పి తీరాల్సిందే
కౌషికి: వదిలేయ్ ధాత్రి
కేదార్: లేదు అక్క మనం ఇలా వదిలేస్తున్నాం కాబట్టే వాళ్లు అలా రెచ్చిపోతున్నారు.
కౌషికి: సరే ఇప్పుడు ఏం చేద్దాం.
ధాత్రి: మెహిందీ ఫంక్షన్‌ను మనం ఆపడానికి చూస్తున్నాం అంది కదా నిజంగానే అపాలి.
కేదార్: ఏంటక్కా ఇంకా ఆలోచిస్తున్నావు మన జోలికి వస్తే ఎం జరుగుతుందో ఆ దివ్యాంకకు అర్థం కావాలి.
అని ముగ్గురు కలిసి ఆలోచిస్తుంటారు. ఇంతలో బూచి మందు తీసుకుని వచ్చి తాగుతుంటాడు. సోడ తెచ్చుకోవడానికి కిందికి వెళ్లగానే అక్కడున్న మందు బాటిల్ తీసుకుని కేదార్, ధాత్రి వెళ్లిపోతారు. మరోవైపు సురేష్, దివ్యాంక మాట్లాడుకుంటుంటారు.
దివ్యాంక: ఏంటి సురేష్ మీరు చేస్తున్న పని. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకుందామనుకున్నామో మీకు గుర్తుందా? మీకోసమే నేను ఈ పెళ్లి డ్రామా మొదలుపెడితే మీరేమో అన్నింటినీ చెడగొడుతున్నారు. ఈ మోహిందీ ఇక్కడ పెట్టిందే కౌషికి మనసు కరగాలని. కానీ మీరేమో అంతా నాశనం చేస్తున్నారు.
సురేష్: అది కౌషికి కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా అని అలా పట్టుకున్నాను.
నిషిక: అదంతా ఆ ధాత్రి ఆడుతున్న నాటకం
అంటూ నిషికి లోపలికి రాగానే కౌషికిని నన్ను కలపడానికి దివ్యాంక ఈ పెళ్లి నాటకం ఆడుతుంది అంటూ సురేష్ చెప్పగానే నిషిక షాక్ అవుతుంది. నాకు నా భార్య, కూతురు ఇద్దరూ కావాలి. ఇద్దరితో ఏ సమస్యా లేకుండా ఉండాలి అని చెప్పి వెళ్లిపోతాడు సురేష్. నువ్వు కౌషికిని సురేష్ అన్నయ్యని కలపడమేంటి దివ్యాంక అని నిషిక అడుగుతుంది. దీంతో కౌషికి మీద పగ తీర్చుకోవాలంటే సురేష్‌ను పెళ్లి చేసుకోవాలి. కానీ సురేష్ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా నాటకం అని పెళ్లి దాకా తీసుకొచ్చానని అసలు విషయం చెప్తుంది దివ్యాంక. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: డ్రగ్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ అరెస్ట్? - ఆ ఛానళ్లపై నటి ఘాటు వ్యాఖ్యలు