Satyabhama Today Episode: పెళ్లి చూపులకు రెడీ అవుతున్న సత్య చీర కట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. సంధ్యకు హెల్ప్ చేయమంటే సంధ్య సెటైర్లు వేస్తుంది. ఇక ఆ చీర కట్టుకోవడం నా వల్ల కాదు అని సత్య అంటే వెంటనే సంధ్య వాళ్ల నానమ్మకి ఫోన్ చేసి డ్రస్‌లో పెళ్లి చూపులు ఒకేనా అని అడుగుతుంది. ఎప్పటిలా శాంతమ్మ తిడుతుంది. అయినా సంధ్య తన అక్కమీద సెటైర్లు వేస్తుంది. ఇక తొందరగా కానివ్వండి అని శాంతమ్మ హడావుడి చేస్తుంది. ఇక మైత్రి, సంధ్య ఎలా గోలా కష్టపడి సత్యకు చీర కడతారు.


మైత్రి: కలవాలి అని వచ్చావా లేక పొరపాటున వచ్చావా.. లేక ఏదైనా పని ఉండి వచ్చావా..
హర్ష: ఒక్కదానివే ఉన్నావు కదా.. నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను. అవును నువ్వేంటి వంట ఇంట్లో ఈ పనులు అన్నీ అమ్మ చూస్తుంది కదా.. 
మైత్రి: ఆంటీ బిజీగా ఉన్నారు. సత్య, సంధ్య కూడా హడావుడిగా ఉన్నారు. హెల్ప్ చేద్దామని నేను వచ్చాను. పాపం ఆంటీకి కోడలు వచ్చుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు కదా ఎంచక్కా కూర్చొపెట్టి ఈ పనులు అన్నీ చేసి పెట్టేది. కాస్త ఆంటీ గురించి కూడా ఆలోచించు.
హర్ష: అంటే నీ ఉద్దేశం ఏంటి.
మైత్రి: అర్థం కాలేదా నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇలా వంటింటి పనులు చేసే భార్య దొరుకుతుంది కదా అని.
హర్ష: ఇది మరీ బాగుంది వంట కోసం నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటావా.. నాకు కావాల్సింది వంటలక్క కాదు నన్ను అర్థం చేసుకొని ప్రేమించే అమ్మాయి. 
మైత్రి: అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అని ఎలా గుర్తుపడతావ్..
హర్ష: ఏముంది సింపుల్ ఒకసారి ఇటు తిరుగు.. సూటిగా కళ్లలోకి చూడగానే ఆ కళ్లు సిగ్గుతో వాల్చేస్తుంది. దగ్గరకు జరిగినా తల ఎత్తి చూడటానికి భయపడుతుంది. 
మైత్రి: కానీ మీ అబ్బాయిలతో ఓ ప్రాబ్లమ్ ఉంది. ప్రేమించిన అమ్మాయి కళ్లముందే ఉన్న తెలీనట్లు నటిస్తారు. కావాలనే ఏడిపిస్తారు. 
సంధ్య: ఆహా.. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత క్లారిటీ ఉందో తోడు దొంగలు.. బయట హాల్లో పెళ్లి చూపులు వదిలేసి.. మీరిద్దరూ వంటింట్లో పెళ్లి చూపులు సెట్‌ అప్ చేసుకున్నారా.. చూసుకున్నది చాలా ఇక పదండి.. మరోవైపు పెళ్లి వాళ్లు వచ్చేస్తారు. క్రిష్ కూడా సత్య ఇంటికి వస్తుంటాడు. 


శాంతమ్మ: విశాల సత్య రెడీ అయిందా.. 
విశాలాక్షి: రెడీ అయింది వస్తుంది అత్తయ్య. ఇక సత్య వచ్చి మురళి ముందు కూర్చొంటుంది. 
శాంతమ్మ: ఇది మా చిన్న మనవరాలు సంధ్య లక్ష్మీ బాంబు.
సంధ్య: అంతా మా నానమ్మ పోలికలే.. పెళ్లి చూపులు దొంగ చూపులు చూసుకోవడానికి కాదు దర్జాగా ఒకర్ని ఒకరు చూసుకోవడానికి.
మురళి: నువ్వు చాలా సరదాగా మాట్లాడుతున్నావ్. నేను తనతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడుతా..
శాంతమ్మ: బాబు ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా మేం ఏం అనుకోము.
సంధ్య: బామ్మ వాళ్లు రామాయణం గురించో భారతం గురించే మాట్లాడుకోరు వేరే ఉంటాయ్..
విశ్వనాథం: అలా కాదులే అమ్మ బాల్కానీలోకి వెళ్లి మాట్లాడుకోనిలే.. 
శాంతమ్మ: ఇది ఎడ్డెం అంటే తెడ్డేం అంటుంది. ఏం మాట్లాడుతుందో.. వదిలేయ్ డానికి వీలు లేదు.
సత్య: పర్లేదు లే నాన్న నానమ్మకు ఇష్టం లేదుకదా ఇక్కడే మాట్లాడుకుంటాం.
శేఖర్: మీ నానమ్మకి మేం సర్దిచెప్తాంలే అమ్మా మీరు హ్యాపీగా వెళ్లి ఫ్రీగా మాట్లాడుకోండి.. వెళ్లండి. రేయ్ వెళ్లరా..
మురళి: మీరు తక్కువగా మాట్లాడుతారా..
సత్య: అలాంటిదేం లేదు ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంటాను.
మురళి: చాలా మంచి అలవాటు కానీ నాకు అలా అస్సలు చేతకాదు. ఇందాక హాల్‌లో చాలా కంట్రోల్ చేసుకొని కూర్చొన్నా. ఏం మాట్లాడితే ఎవరు ఏం అనుకుంటారో అని. నిజం చెప్పాలి అంటే మా మామ్ వార్నింగ్ ఇచ్చి మరి తీసుకొచ్చింది అనవసరంగా మాట్లాడొద్దు అని. 
క్రిష్: తనలో తాను ఈ రోజు సంపంగితో  పెళ్లికి అవును అనిపించుకొనే ఇంటికి పోవాలి. వేరే ముచ్చటే లేదు.
మురళి: నాకు ఒకటి అర్థమైంది అండి. మీరు తక్కువ మాట్లాడటమే కాకుండా అవసరం అయితే నిర్మొహమాటంగా కూడా మాట్లాడుతారు. సో ఇక నేను కొన్ని విషయాలు ఫ్రాంక్‌గా మాట్లాడుతాను. విత్ యువర్ పర్మిషన్.. మీ మౌనం అంగీకారంగా తీసుకోవచ్చా.
సత్య: చెప్పండి.
మురళి: నన్ను ఇండియా వరకు రప్పించిన ఫొటో మీకు చూపించనా.. అంటూ సత్య ఫొటో చూపిస్తాడు. 


కాళీ: క్రిష్ సత్య ఇంటి డోర్ తీస్తుండగా హడావుడిగా వచ్చి.. అన్న నీతో ఒక విషయం మాట్లాడాలి.
క్రిష్: రేయ్ ఇప్పుడు కాదురా పెళ్లి ముచ్చట మాట్లాడటానికి నేను సంపంగి దగ్గరకు పోతున్నా తర్వాత మాట్లాడుకుందాం.
కాళీ: అన్నా..
క్రిష్: ఏమ్రా అడ్డు వస్తున్నావ్..


మురళీ: ఇందాక మా డాడ్ నా మనసులో మాట ఒకటి అనేశారు. మీరు పద్ధతికి చీర కట్టినట్లు ఉన్నారని.. ఇంకా చెప్పాలి అంటే పద్ధతే మీ దగ్గర నుంచి పద్ధతి నేర్చుకోవాలి అనే అంత పద్ధతిగా ఉన్నారు. ఇది పెదవుల నుంచి వచ్చిన మాట కాదు హృదయం నుంచి వచ్చిన మాట.


కాళీ: అన్నా వదిన నీకు ఓ లెటర్ పంపింది. అది ఇవ్వడానికే వచ్చాను. ఇదిగో అన్న లెటర్.. 
క్రిష్: ఏం రాసిందిరా మీ వదినా..
కాళీ: ఏమో అన్న నేను చూడలే మీ పర్సనల్ కదా.. ఆల్రెడీ వదిన నిన్ను ఇష్టపడుతుంది కదా అన్న లవ్ లెటర్ అయింటుంది. చదివితే తెలుస్తుంది. చదువుకో అన్న..
క్రిష్: లెటర్ చదువుతాడు.. మిమల్ని ఏమని పిలవాలో కన్ఫ్యూజన్‌గా ఉంది. తలచుకుంటే సిగ్గేస్తుంది. ఎంత ముద్దుగా రాసిందిరా.. 


మురళీ: మీ క్యారెక్టర్ ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చింది. మీరు అంటే ఇష్టం ఇంకా పెరిగిపోయింది. మీరు నాకు నచ్చారు. మరి నేను మీకు నచ్చానా..


క్రిష్: లెటర్.. నీ మీద నాకు ఇష్టం ఉందని గుడిలో.. బొట్టుపెట్టుకున్నప్పుడే తెలిసిపోయింది కదా.. ఇంకా ఎందుకు రోజూ నాకోసం తిరుగుతున్నారు. మరి పెళ్లి ముచ్చట మాట్లాడాలి కదరా..


సత్య: జనరల్‌గా ఏ ఆడపిల్లా అయినా తన డ్రెస్ సెలక్ట్ చేయడానికే కనీసం ఒక గంట అయినా ఆలోచిస్తుంది.
మురళీ: అర్థమైంది ఇంకోసారి మా మామ్ ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్ అని ఫ్రూవ్ అయింది. ఓకే టేక్ యువర్ ఓన్ టైం బట్ థింక్ పాజిటివ్‌లీ. ఎందుకు అంటే నా మొబైల్‌లో ఉన్న ఈ ఫొటోని డిలీట్ చేయాలి అని లేదు పర్మినెంట్‌గా నా డీపీలా ఉండిపోవాలి అని ఉంది. ఒకవేళ నాలో మీకు ఏమైనా నచ్చకపోతే నో అని చెప్పడానికి అది షాకుగా తీసుకోకండి. అవేంటో నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. నన్ను మీకు నచ్చేలా మార్చుకుంటాను. నా ఇష్టాన్ని మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంతకీ ఎప్పుడు కాల్ చేయమంటారు.
సత్య: ఎవరకి.. 
మురళీ: మీకే మీ డెసిషన్ తెలుసుకోవడానికి.
సత్య: మా ఇంట్లో పద్ధతులు అన్నీ చూశారు కదా.. నా నిర్ణయం మా నాన్న గారికి మాత్రమే చెప్తాను. 


క్రిష్: మిమల్ని మా నాన్న చూస్తే ఇబ్బంది పడతాను. మొదటికే మోసం వస్తుంది. కొద్ది రోజుల గడువు ఇవ్వండి మా నాన్నని మన పెళ్లికి ఒప్పించి అప్పుడు కబురు పెడతాను. అప్పటి వరకు మన మధ్య ఏమీ జరగనట్లు మౌనంగా ఉందాం అది ఇద్దరికీ మంచిది. అట్లానే సంపంగి.. నువ్వు ఎలా చెప్తే అలా.. లైన్ క్లియర్ చేశావ్ అది చాలు..
 కాళీ: అన్నా ఇక వదిన గురించి భయపడకు అన్నా. వదినా నీ పాపర్టీనే పోయి మంచిగా ఎంజాయ్ చేయ్..
క్రిష్:  అవునురా నువ్వు అన్నది నిజమే.. 
కాళీ: రేయ్ పిచ్చోడా నువ్వు నా బుట్టలో పడ్డావురా.. నువ్వు కళ్లు తెరిచేలోగా నీ సంపంగికి పెళ్లే కాదు శోభనం కూడా అయిపోతుంది. నీకు పిచ్చి ఎక్కుతుంది. నవ్వుకుంటా నిన్ను చూసి నవ్వుకుంటా అప్పుడు అని కాళీ అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సీతే రాముడి కట్నం సీరియల్ జనవరి 24th: పేపర్‌లో మధుమిత, రామ్‌ల ఫొటో.. రచ్చ రచ్చ చేసిన సీత తండ్రి!