Naga Panchami Today Episode: జ్వాల, చిత్రలు ఇంట్లో టిఫెన్ చేస్తూ మాట్లాడుకుంటారు. మోక్ష ప్రతీ సారి చావు అంచుల వరకు వెళ్లి బతకడం ఏంటి అని చిత్ర అంటుంది. ఇక అందతా తమ ఖర్మ అని అందుకే మోక్ష మళ్లీ తిరిగి ఇంటికి వస్తున్నాడు అని బాధపడుతుంది. దానికి జ్వాల కొందరికి కొందరి చేతుల్లో చావు రాసిపెట్టి ఉంటుందని తన చేతిలో మోక్ష చనిపోతాడని అంటుంది.
చిత్ర: నాకు అయితే అనుమానంగా ఉంది అక్క. పాము కాటుతో మోక్ష చనిపోతాడు అంటే ఆ నాగగండం తప్పిపోయి నూరేళ్లు బతికేలా ఉన్నాడు.
జ్వాల: అంత సీన్ లేదు. నేను టైం చూసి డేట్ ఫిక్స్ చేస్తే ఎవరికైనా చావు ఖాయం. నాకు చిరాకు వస్తే ఇంట్లో అందరూ ఒకే రోజు పోవడం పక్కా.
చిత్ర: అర్థమైంది మోక్ష బతికి తిరిగి వస్తున్నాడు అని నీ కడుపు రగిలిపోతుంది. వాళ్లు వచ్చేసినట్లు ఉన్నారు అక్క పద. ఏంటి అక్క పంచమి రాలేదు.
వైదేహి: ఆగు మోక్ష. నేను నీకు జన్మనిచ్చిన తల్లిని అయినా నువ్వునాకు రుణ పడి ఉండక్కర్లేదు. కానీ నీకు మళ్లీ ప్రాణం పోసిన ఈ మేఘనకు మాత్రం రుణపడి ఉండాలి. మేఘన బతికించింది నిన్ను ఒక్కడ్నే కాదు మోక్ష మా అందర్ని కూడా. నీకు ఏమైనా జరిగి ఉంటే మేం కూడా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. ఒక దేవతలా ప్రత్యక్షమై వల్లకాడు అయిపోతున్న ఈ ఇంటిని గుడిలా మార్చింది.
మేఘన: మనసులో.. నేను మోక్షని బతికించింది మీ కోసం కాదు. నా కోసం. నా కోసం బలి ఇవ్వడానికి.
వైదేహి: అమ్మా మేఘన నీకు మేం ఏం చేసినా ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
మేఘన: మీ మోక్ష జీవితం ఎవరికో ఉపయోగపడాలి అని ఉంది. అది జరిగేంత వరకు ఇక మోక్ష ప్రాణాలకు ఢోకా లేదు. ధైర్యంగా ఉండొచ్చు.
జ్వాల: ఏంటి మోక్ష ఒక్క రోజులో సీన్ మొత్తం రివర్స్ అయింది. పంచమి స్థానంలో మేఘన వచ్చింది ఏంటి.
చిత్ర: మొన్నటి దాక ఈ ఇంటి ఇలవేల్పు మా పంచమి అని అందరూ నెత్తినపెట్టుకు తిరిగారు. ఇప్పుడు చూస్తే పంచమి అనే క్యాండిడేటే మనకు కనపడటం లేదు.
వైదేహి: ఆపండి.. ఇంకొక్కసారి ఈ ఇంట్లో దాని పేరు వినిపించడానికి వీలు లేదు. అది ఈ ఇంట్లో నుంచే కాదు మోక్ష జీవితం నుంచి కూడా పూర్తిగా తొలగిపోయింది.
మోక్ష: మీరెవ్వరూ నాలోనుంచి పంచమిని దూరం చేయలేరు. అలా జరిగిన రోజు నేను ఉండను. ఎందుకు అంటే పంచమి నా ప్రాణం నాలోపలే ఉంది కాబట్టి.
మేఘన: మనసులో.. వీడి గుండె కోసినా పంచమినే కనిపించేలా ఉంది. వీడి నుంచి పంచమిని దూరం చేయలేనా.. మోక్షని బలిస్తే పంచమిని అక్కడ బలి ఇచ్చినట్లే. నా శక్తుల కోసం కాకపోయినా పంచమి మీద పగ తీర్చుకోవడం కోసమైనా మోక్షని బలి ఇచ్చి తీరాల్సిందే.
పంచమి: మోక్షాబాబు నన్ను క్షమించండి. మీ దగ్గర ఉన్న కొన్ని రోజులు నాకు కొన్ని యుగాలు. ఏ విధంగాను నేను మీ భార్యగా సరిపోను. అయినా మీరు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. ఈ జన్మకు నాకు ఇది చాలు. ఇక మీరు నాకోసం ఎలాంటి కష్టం పడకూడదు. మీరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. ఇక ఈ పంచమిని మర్చిపోండి.
మోక్ష: తన ఇంట్లో.. నో పంచమి.. నువ్వు నన్ను వదులు కోవాలి అనుకున్నా నేను నిన్ను వదులు కోను. నీ కోసం ఈ లోకానికి వదులుకోవడానికి సిద్ధమే. ఎవరూ మన ఇద్దర్ని విడదీయలేరు. నువ్వు నా పక్కనే ఉంటే చాలు పంచమి నేను ఎవరినైనా ఎదురిస్తాను. నాకారణంగా నీ జీవితం రిష్క్‌లో పడకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి.
మేఘన: తనలో తాను.. పంచమిని ఓడించాలి అని నేను సర్వం కోల్పోయాను. కానీ పంచమికి పోతాడు అనుకున్న భర్త ప్రాణాలతో ఉన్నాడు. ఎవరూ దగ్గరకు వెళ్లలేరు అన్నంతగా మోక్ష మనసు గెలుచుకుంది. అన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. తోడపుట్టిన వాడిని శాశ్వతంగా కోల్పోబోతున్నాను. పుట్టుకతో వచ్చిన రూపాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సంపాదించుకున్న శక్తులు అన్నీ పోయాయి. మళ్లీ ఈ కరాళికి పూర్వవైభవం రావాలి అంటే మహాకాళి చెప్పినట్లు చేయక తప్పదు. మోక్షని బలి ఇచ్చి శక్తులు సంపాదించుకోవాలి. పంచమికి శాశ్వతంగా దూరం చేయాలి.
ఫణేంద్ర: తనలో తాను.. అంతా యువరాణి వల్లనే. తన మొండితనంతో ఎవరికీ సంతోషం లేకుండా పోయింది. యువరాణిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలి అనుకున్నాను. చివరకు నాగలోకంలోనే నాకు స్థానం లేకుండా పోయింది. ఏం చేయాలో తెలీని అయోమయంలో పడిపోయాను.
పంచమి: సుబ్బు నువ్వా ఎంత సేపు అయింది నువ్వు వచ్చి. నన్ను పిలవొచ్చు కదా..
సుబ్బు: నీ బాధని కనీళ్ల రూపంలో పోగొట్టుకుంటున్నావ్ కదా పంచమి అందుకే పిలవలేదు.
పంచమి: నా దుఖాన్నికి అంతం ఎక్కడుంది సుబ్బు. నిరంతరం ఏడుస్తున్నా నాలోని కనీళ్లు తరగవు.
సుబ్బు: బాధలు లేని మనిషి కష్టాలు లేని ఇళ్లు ఉండవు పంచమి.
పంచమి: మోక్షబాబుకి ప్రాణ గండం పోయింది. తాను ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. ఇక నాకు ఏ బాధ లేదు.
సుబ్బు: నువ్వు వదులు కున్నది నీ సంతోషాన్ని కష్టాన్ని కాదు పంచమి. అందరూ దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటే మీరు మనసులు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. మీరు సజీవంగా ఉన్నంత వరకు ఒకరిని ఒకరు మర్చిపోవడం జరగదు పంచమి.
పంచమి: జరగాలి సుబ్బు మోక్షాబాబు నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. మేం కలిసి ఉన్నంత కాలం మోక్షాబాబుకి ఏ సుఖము సంతోషం ఉండదు.
సుబ్బు: మానసిక ఆనందం మకరందం లాంటిది పంచమి కంటికి కనిపించదు. శారీరక సుఖం అద్దంగా కనిపించే పువ్వు.
పంచమి: చెప్పినా నీకు అర్థం కాదు సుబ్బు. ఇక నేను ఎప్పటికీ మోక్షాబాబుకి దగ్గర కాలేను.
సుబ్బు: నువ్వు ప్రేమతో పెంచుకునే చెట్టు ఎవరైనా నరికేస్తే చూస్తూ ఉండగలవా.. కాయలు కాయకపోయినా చల్లటి నీడని ఇస్తుంది. అందుకే మీరు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు.
పంచమి: అది జరిగే పని కాదు సుబ్బు. ఇక మేం కలవం అది జరగదు.. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 23rd: ఇంటికి వచ్చేస్తున్న ఆదర్శ్.. టెన్షన్‌తో తలపట్టుకున్న ముకుంద!