Brahmamudi Telugu Serial Today Episode: రాజ్‌ భోజనం చేయకుండా కావ్య కోసం బెడ్‌రూంలోకి వెళ్తాడు. అక్కడ కావ్య లేకపోవడంతో గార్డెన్‌లోకి వెళ్తాడు. అక్కడ కావ్య కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రాజ్‌ను చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. రాజ్‌ వచ్చి ఇప్పుడెలా ఉందని అడుగుతాడు. పర్వాలేదని అంటుంది. మరెందుకు అలా ఉన్నావు ఇంట్లో వాళ్లు ఏమైనా అన్నారా? అని అడుగుతాడు. ఎవ్వరూ ఏమీ అనలేదని నా మనసే బాగాలేదని చెప్తుంది కావ్య. నువ్వు ఫోన్‌ చేసినప్పుడు నేను ఆఫీసులో అని రాజ్‌ అనగానే మీరు బిజీగా ఉన్నారు. నేను అర్థం చేసుకున్నాను.. అంటూ కావ్య లేచి వెళ్తిపోతుంది. మరోవైపు అపర్ణ రూంలో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడికి సుభాష్‌ వస్తాడు. అపర్ణను చూసి మళ్లీ ఇంట్లో ఏదో జరిగినట్లు ఉంది. ఇప్పుడు పలకరించకపోవడమే బెటర్‌ అనుకుని వెళ్లబోతుంటే.


అపర్ణ: ఆగండి


సుభాష్‌: ఏంటి? అపర్ణ..


అపర్ణ: ఈ ఇంట్లో పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా?


సుభాష్‌: ఏమైంది మళ్లీ


అపర్ణ: మీ తమ్ముడి భార్యకు కొత్తగా స్వార్థం పెరిగిపోయింది.


అంటూ.. ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర జరిగిన విషయాలు మొత్తం చెప్పి బాధపడుతుంది అపర్ణ. దీంతో సుభాష్‌ ఇందులో ధాన్యలక్ష్మీ తప్పు ఏం లేదని.. ఇన్ని రోజులు కళ్యాణ్‌కు పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు పెళ్లైంది అందుకే భార్య ముందే అలా కళ్యాణ్‌ కు పనిచెప్పడం బాగుండదు అందుకే అలా చేసిందని సుభాష్‌, అపర్ణ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. కానీ అపర్ణ మీరెన్నైనా చెప్పండి ధాన్యలక్ష్మీ అలా మాట్లాడటం నాకు నచ్చడం లేదని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ కూడా తన భర్త ప్రకాష్‌ను తిడుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోరా? అంటూ డైనింగ్‌  టేబుల్‌ దగ్గర జరిగిన విషయాలు చెప్పి బాధపడుతుంది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు బయటకు వచ్చి కూర్చుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. మరోవైపు కావ్య ఒక్కతే ఆలోచిస్తూ ఉంటే.. కళ్యాణ్ వచ్చి


కళ్యాణ్‌: వదిన మీకు ఒంట్లో బాగాలేకపోతే నాకు చెప్పొచ్చు కద వదిన నేను హాస్పిటల్‌కు తీసుకెళ్లేవాడిని కదా


కావ్య: మీరు హాస్పిటల్‌కు రానిదే నయం అయ్యింది కవిగారు.


కళ్యాణ్‌: ఏంటి వదిన ఏమంటున్నారు.


కావ్య: అంటే ఇందాక పెద్దత్తయ్య మీకు ఏదో పని చెబితే చిన్నత్తయ్య ఏదో అన్నారంట కదా మా అక్క చెప్పింది. నేను కూడా హాస్పిటల్‌కు తీసుకెళ్తానంటే నన్ను కూడా ఏదో అనేవారు.


కళ్యాణ్‌: ఈ ఇంట్లో పెద్దరికాన్ని అవివేకం మింగేస్తుంది వదిన. మన కుటుంబం అనే స్థాయి నుంచి నా కుటుంబం అనే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. ఇన్నాళ్లు లేని పట్టింపులు ఇప్పుడు పట్టాభిషేకం కోరుతున్నాయి. భరతుడికి రాజ్యాధికారం కావాలని కోరుకున్న కైక చివరికి ఎం పొందింది అన్న కథ తెలిసి కూడా మా అమ్మా మారిపోతుంది.


అంటూ కళ్యాణ్‌ బాధపడుతూ.. ఇంతకీ కొద్ది రోజల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను ఎందుకో మీరు డల్ గా ఉంటున్నారు. అసలు ఏం జరిగింది. చెప్పకపోతే నామీద ఒట్టే అంటూ ఓట్టేసుకుంటాడు కళ్యాణ్. దీంతో కావ్య, రాజ్‌, శ్వేత గురించి నిజం చెప్తుంది. కావ్య ఫోన్‌లో ఉన్న ఫోటోలు చూపిస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఈ అమ్మాయి శ్వేత కదా అంటూ అప్పట్లో శ్వేత అన్నయ్యను ప్రేమించిందని అయితే అన్నయ్య ప్రేమించాడో లేదోనని చెప్తాడు.


దీంతో ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని కావ్య చెప్తుంది. ఇంతలో అక్కడకు అనామిక వస్తుంది. ఏంటి? అంత సీక్రెట్‌గా మాట్లాడుతున్నారు అంటూ అడగ్గానే ఏం లేదని ఇద్దరు వెళ్లిపోతారు.  దీంతో అనామిక వెళ్లిపోతుంటే రుద్రాణి వచ్చి లేనిపోని కట్టుకథలు చెప్పి అనామికను రెచ్చగొడుతుంది. దీంతో అనామిక ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు బెడ్‌రూంలో కావ్య పడుకుని ఏడుస్తుంటే రాజ్‌ వస్తాడు. ఎం జరిగిందని అడుగుతాడు. ఎం లేదని కావ్య చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ : శారీలో అనసూయ... 'మై హూ నా'లో ప్రొఫెసర్ సుష్మితా సేన్‌లా