Satyabhama Today Episode క్రిష్ వల్ల తన జీవితం నాశనం అయిందని సత్య బాధ పడుతుంది. నవ్వుతూ సంతోషంగా ఉండే తన ఇంటి కల తప్పిపోయిందని చెల్లి సంధ్యతో చెప్పి ఫీలవుతుంది. సంధ్య కూడా పెళ్లి అయి అక్క అత్తారింటికి వెళ్లిపోతుంది అని ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోతాను అని బాధలు చెప్పుకోవడానికి ఎవరు ఉంటారు అక్క అని అంటుంది.


సత్య: ఈ కష్టాలు నాతోనే ముగిసిపోవాలి. నా చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సత్య.
సంధ్య: వినడానికి చాలా బాగుంది. 
సత్య: క్రిష్ సత్య ఇంటి నెంబరుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ మోగుతుంటే భయం వేస్తుంది. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏం చెప్తారో ఏం వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది.
క్రిష్‌: సంపంగి కాల్ లిఫ్ట్ చేయ్ నీ గొంతు వినాలి అని ఉంది. నీతో మాట్లాడాలి అని ఉంది. ప్లీజ్ నా మీద కోపం వద్దు సంపంగి. కాల్ లిఫ్ట్ చేయ్ ప్లీజ్. 
శాంతమ్మ: ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తకుండా అలా చూస్తారు ఏంటే.. 
విశాలాక్షి: హలో..
క్రిష్‌: సత్య నేను క్రిష్‌ని. నీతో మాట్లాడాలి అని ఎంత ఆరాటంగా ఉందో తెలుసు. ఎందుకు నా మనసుని అర్థం చేసుకోవు. ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు. చూడు నేను మొండి వాడిని కావొచ్చు. కానీ నాకు ఓ మనసు ఉంది. ఆ మనసు నిండా నువ్వే ఉన్నావు. మాట్లాడు సత్య. నీ పక్కన పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నారా అందుకే ఇబ్బంది పడుతున్నావా.. నీకు నా మీద కోపం అనిపిస్తుందా.. వీడేంటి ఈ తల తిక్క పనులు ఏంటి అని. నేను ఏం చేసినా నీ ప్రేమ కోసమే సంపంగి. అది నీకు కూడా తెలుసు. చూడు మన పెళ్లికి మా నాన్నని ఒప్పిస్తున్నా.. తొందర్లోనే మా పెద్దోళ్లని మీ ఇంటికి తీసుకొస్తా. విశాలాక్షి ఫోన్ పెట్టేస్తుంది. సడెన్‌గా కాల్ కట్ చేసింది. పెద్దొళ్లతో ప్రాబ్లమ్ కదా..
సత్య: అమ్మా ఎవరు అమ్మా ఫోన్
విశాలాక్షి: ఏదో కంపెనీ కాల్ అమ్మ.
సత్య: కంపెనీ కాలా లేక ఆ ఇడియట్ ఏమైనా చేశాడా.. 


విశ్వనాథం, హర్ష పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. రఘు తన మాస్టారు విశ్వనాథం కాళ్లకు దండం పెడతాడు. కూర్చొమని మర్యాద ఇస్తాడు. ఇక సమస్య అడుగుతాడు రఘు. దీంతో విశ్వనాథం, హర్ష జరిగినది అంతా చెప్తాడు. విశ్వనాథం రెండు చేతులు జోడించి తన స్టూడెంట్ అయిన పోలీస్‌కు సమస్య పరిష్కరించమని రిక్వెస్ట్ చేస్తాడు.


రఘు: సార్ మీరు నాకు చేతులు జోడించి అడగడం ఏంటి. మీరు చెప్పిన దాని బట్టి ఆ మహదేవయ్య బదులు వేరే ఎవరు ఉన్నా సమస్య చిటికెలో పరిష్కారం అయిండేది.
విశ్వనాథం: అంటే ఇప్పుడు కాదు అంటావా.
రఘు: ఖాకీ డ్రెస్ వేసుకొని కూడా ఈ మాట అంటున్నాను అంటే ఆ మహదేవయ్య ఎలాంటి వాడో అర్థం చేసుకుంటాను. కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. 
హర్ష: మేం వాడి జోలికి వెళ్లలేదు సార్ వాడే మా చెల్లి వెంటపడి నానా రచ్చ చేస్తున్నాడు. నా చెల్లి ఎదురు తిరిగింది అని తన మీద తనకు కాబోయే భర్త మీద  ఎటాక్ చేశాడు.
రఘు: ఇందుకు సాక్ష్యం ఉందా.. 
విశ్వనాథం: లేదు పైగా తనే వాళ్లని హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. వాళ్లు మా జోలికి రాకుండా ఉంటే అది చాలు మాకు..
రఘు: దీనికి కాంప్రమైజ్ ఒక్కటే పరిష్కారం. మీరు ఆ పక్క గదిలో ఉంటే చెప్తాను..


మహదేవయ్య: చిన్నా ఆ మినిస్టర్ ముందు నా పరువు గడ్డి పరకలా తీసేశాడు. 
క్రిష్: బాపూ నన్ను తప్పుగా అనుకోకు సత్య మీద ఉన్న ప్రేమ నన్ను అలా మాట్లాడించింది. ఇంతలో మహదేవయ్యకు రఘు నుంచి ఫోన్ వస్తుంది. క్రిష్‌ స్పీకర్ ఆన్ చేస్తాడు.
రఘు: నమస్తే సార్ మీకు ఓ విషయం చెప్పాలి అని కాల్ చేశా.. చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ తప్పడం లేదు. మీ రెండో అబ్బాయి ఈ మధ్య కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. 
మహదేవయ్య: తెలుసు..
రఘు: ఆ అమ్మయి వెంట పడటం.. ఆ అమ్మాయిని తనకి కాబోయే భర్తని ఎటాక్ చేయడం బెదిరించడం ఇవి కూడా మీకు తెలుసా.. వాళ్లు ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి నా దగ్గరకు వచ్చారు. మీరు ఒకసారి స్టేషన్‌కు వస్తే గొడవ కాకుండా కాంప్రమైజ్ అవుదాం.
మహదేవయ్య: ఏందిరా నువ్వు కోరుకున్న మామ నీ బామర్ది పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు చూస్తున్నారు. పోయి తాంబూళం పుచ్చుకోమంటావా..
క్రిష్‌: ఇక్కడ నువ్వు నాకు ఎలా అడ్డుపడుతున్నావో.. అక్కడ నా సంపంగికి వాళ్లు అలానే అడ్డుపడుతున్నారు. కాస్త మంచిగా మాట్లాడి వాళ్లని లైన్‌లో పెట్టడం నీ డ్యూటీ బాపూ..


సత్య: అమ్మా ఇప్పుడు నిజం చెప్పు ఇందాక ఫోన్ ఎక్కడనుంచి. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ అయితే నువ్వు ఇంతగా ఇబ్బంది పడవు. నిజం చెప్పు అమ్మ. 
విశాలాక్షి: క్రిష్ .. నువ్వు అనుకొని నాతో మాట్లాడాడు. తన మీద కోపం పెట్టుకోవద్దు అని చెప్పాడు. వాళ్ల పెద్ద వాళ్లని నీతో పెళ్లికి ఒప్పించి మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు.
సత్య: చెప్పుతో కొడతా అని చెప్పాల్సింది. అంతా వాడి ఇష్టమేనా.. 
విశాలాక్షి: గట్టిగా అరవకే నానమ్మ విన్నది అంటే నన్ను కంగారు పెట్టేస్తుంది.


రఘు: మిమల్ని ఇక్కడి వరకు పిలిచినందుకు క్షమించండి సార్. మీ స్థాయి వేరు వాళ్ల స్థాయి వేరు.
మహదేవయ్య: ఆ సంగతి వాళ్లకి తెలుసు కదా మరి ఏ ధైర్యంతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. 
రఘు: ధైర్యంతో రాలేదు భయపడే వచ్చారు. వాళ్లని చూస్తుంటే అర్థం కావడం లేదా. 
విశ్వనాథం: మహదేవయ్య గారు కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. 
రఘు: వాళ్ల ఇంటి ఆడపిల్లని ప్రేమ అని వెంటాడి వేధిస్తున్నాడు.
మహదేవయ్య: ఇంత చిన్న విషయానికి నన్ను పిలిచారా..
విశ్వనాథం: మహదేవయ్య గారు మీకు ఇది చిన్నవిషయమే కావొచ్చు. కానీ మాకు చాలా పెద్ద విషయం.
మహదేవయ్య: వయసు వచ్చిన పిల్లల నడుమ ఈ ముచ్చట్లు ఉండనే ఉంటాయి. నాలుగు దినాల తర్వాత విడిపోతారు. ఆ ముచ్చట తర్వాత పెద్దోళ్లు చూపించిన సంబంధం చేసుకొని ఎవరి బతుకులు వాళ్లు చూసుకుంటారు. 
విశ్వనాథం: మీ అబ్బాయి మమల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మా కూతురుని కాబోయే అల్లుడి మీద హత్యాయత్నం చేశాడు.
మహదేవయ్య: మా వాడికి ప్రయత్నాలు చేసే అలవాటు లేదు. చేయాలి అనుకుంటే అవతల వాడు చావాల్సిందే.. మీ వాళ్లు చావలేదు అంటే చంపబోయింది మా వాడు కాదు రాసిస్తా. 
రఘు: ఇప్పుడు మనం ఆర్గ్యూలు చేయడం కాదు సమస్యకు ఓ పరిష్కారం ఆలోచిద్దాం. 
మహదేవయ్య: ఏంటి సెటిల్ మెంటా.. 
రఘు: మీ వాడు ప్రేమించిన మాట నిజమేనా..
 మహదేవయ్య: మాతో చెప్పాడు నిజమే.
రఘు: అయితే ప్రేమించిన అమ్మాయితో మీ వాడి పెళ్లి మీకు ఇష్టమేనా..
విశ్వనాథం: ఇలాంటి పరిష్కారం కోసం కాదు బాబు మేం వచ్చింది. 
రఘు: సార్ మీరు ఎగ్జైట్ అవ్వొద్దు. నేను మాట్లాడుతాను. 
విశ్వనాథం: మీ అబ్బాయికి చెప్పండి మా అమ్మాయి జోలికి రావొద్దు అని చెప్పండి.
మహదేవయ్య: ఇదేనా దానికి ఎందుకు అంత లొల్లి. మా చిన్నా ఇక మీ బిడ్డ జోలికి రాడు. నన్ను ఇక్కడికి పిలిపించి మంచి పని చేశావ్ వీళ్ల సమస్యతో పాటు నా సమస్య కూడా తీరిపోయింది. 
క్రిష్‌: అమ్మా బాపూ ఇంకా రాడు ఏంటి.
భైరవి: ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ బాపు తానికి వస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు మీ నాన్నకి కొత్త సమస్యలు తెచ్చావు కదా. ఇప్పుడు నువ్వేం చేయకుండానే ఆ కమిషనర్ పిలిచాడా.
క్రిష్‌: నువ్వేం ఫికర్ చేయకే. బాపు శుభవార్తతో ఇంటికి వస్తాడు. పండగ చేసుకుందాం. 
మహదేవయ్య: కరెక్ట్‌గా చెప్పాడే శుభవార్త తీసుకొచ్చా. చిన్నాకి పెళ్లి ఫిక్స్ అయినట్లే. రేపో మాపో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేస్తా. 
క్రిష్‌: బాపు అంత దగ్గర అయితే వాళ్లకి కష్టం అవుతుంది ఏమో..
మహదేవయ్య: కష్టం ఏందిరా మినిస్టర్ అంటే చేతి నిండా మస్తు మంది ఉంటారు. గంటలో ఎంగేజ్మ్ంట్ అన్నా సెట్ చేస్తారు.
క్రిష్‌: బాపు మినిస్టర్ అంటున్నావ్ ఏంటి. 
మహదేవయ్య: అవును నీ పెళ్లి మినిస్టర్ కూతురుతోనే.
క్రిష్‌: కమిషర్ దగ్గరకు పోయి నువ్వు మాట్లాడింది వాళ్లతో కాదా.
మహదేవయ్య: సిగ్గు ఉండాలిరా. నిన్ను ఛీ కొడుకున్న వాళ్ల వెంట పడటానికి. నీకు నీ కొడుకుకు ఓ దండం మా జోలికి రావొద్దు అని కమిషనర్ ఎదుటే నాకు చేతులు ఎత్తి మొక్కారు. పరువు పోయింది. 
క్రిష్‌: నాకు సత్యకు పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు. అందుకే కావాలని చెడగొట్టుకొని వచ్చావు. బాపు నా సంగతి నీకు తెలుసు పంతానికి పోతే ప్రాణం పోతుంది అన్నా వెనక్కి తగ్గను. మీరు నా పెళ్లి చేయాలి అనుకుంటే నా సంపంగి తోనే చేయాలి. ఈ ఇంటికి చిన్న కోడలు రావాలి అనుకుంటే అది నా సంపంగే. అది మీ బాధ్యత ఏం చేస్తారో వాళ్లని ఎలా ఒప్పిస్తారో నాకు తెలీదు. నాకు నా సంపంగి కావాలి అంతే. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  'నాగ పంచమి' సీరియల్ ఫిబ్రవరి 20th: కరాళి చేతిలో ఓడిపోతానని సుబ్బు ముందు ఏడ్చిన పంచమి.. మేఘన, ఫణేంద్రలను పంపేయమన్న మోక్ష!