Satyabhama Today Episode: మహదేవయ్య ఇంట్లో పూజ ఏర్పాట్లు జరుగుతాయి. క్రిష్, సత్య ఇద్దరూ పూజలో కూర్చొంటారు. ఇద్దరితో పంతులు పూజ చేయిస్తాడు. ఇక మహదేవయ్య బేటా ఈ పూజ, హోమం ఎందుకో నీకు తెలుసా అని సత్యని అడుగుతాడు. సత్య తెలీదు అంటుంది.


మహదేవయ్య: బేటా.. పెళ్లితో మీరిద్దరూ కొత్త జీవితం షురూ చేశారు. మీరు ప్రశాంతంగా ఉండాలి అన్నా మీతో పాటు మేము ఈ ఇళ్లు ప్రశాంతంగా ఉండాలి అన్నా మీరు అన్యోన్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మీ ఇద్దరి పేరు బలాలు కలవాలి. కానీ జాతకాల ప్రకారం అవి కలవడం లేదు. అందుకే అగ్ని సాక్షిగా నీ పేరు మార్చాలి అనే ఈ పూజ. అంటే నీ అత్తింట్లో నీకు బారసాల చేస్తున్నాం అన్నమాట. 


సత్య షాక్ అయిపోతుంది. పంతులు రా అనే పదంతో ఒక పేరు పెట్టమని నీకు నచ్చిన పేరు చెప్పమని అంటే మహదేవయ్య కుదరదు మేమే చెప్తాం మాకు నచ్చిన పేరు పెట్టాలి అని రుక్మిణి అని పేరు డిసైడ్ చేశామని సత్యకు అంటాడు. సత్య షాక్ అయి ఏం మాట్లాడలేకపోతుంది. అందరూ పేరు బాగుంది అని పొగుడేస్తారు. ఇక సత్య లేచి అక్షింతలు కింద పడేస్తుంది. 


సత్య: నా పేరు మార్చుకోవడానికి నేను ఒప్పుకోను. ఏంటి అత్తయ్య ఇది నాకు చెప్పకుండా నాకు అడగకుండా నా పేరు మార్చడం ఏంటి. అయినా ఈ పూజ ఏంటి.
మహదేవయ్య: ఏరా నీ పెళ్లాం ఏమైనా ఈ రాష్ట్రానికి గవర్నర్ అనుకుంటుందా అన్ని అమెకు చెప్పి చేయడానికి ఆఫ్ట్రాల్ కోడలు. ఇక్కడ ఏం జరిగినా బొమ్మ లెక్క, ఆ గోడ లెక్క మౌనంగా చూస్తూ కూర్చొవాలి. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా కోడల్ని అడిగి తీసుకోరు. కోడలికి చెప్పి చేయరు. పీటల మీద కూర్చొమని చెప్పు. 
సత్య: మామయ్య గారు ఇది నాకు సంబంధించిన విషయం నాకు ఇష్టం లేకుండా ఎలా చేస్తారు మీరు.
మహదేవయ్య: పుట్టింటిలోనే నీ ఇష్టాలు వదిలి రావాలి. ఇక్కడ నేను చెప్పినట్లే నువ్వు వినాలి. నేను చెప్పిందే చేయాలి.
సత్య: వింటాను మామయ్య గారు. ఈ ఇంటి పద్ధతులు ఆచారాలు చెప్పండి.. ఈ ఇంటి గౌరవం నిలబెట్టడానికి ఏం చేయాలో చెప్పండి అస్సలు ఎదురు చెప్పను. కానీ నా పేరు మార్చే విషయంలో మాత్రం దయచేసి నా మాట వినండి.
మహదేవయ్య: వినా.. ఈ ఇంట్లో ఎవరైనా సరే ఈ మహదేవయ్య మాట వినాల్సిందే..
సత్య: ప్లీజ్ మామయ్య ఇది చాలా చిన్న విషయం పంతాలకు పోవద్దు. పేరు మార్చుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నా వల్ల కాదు. 
భైరవి: ఏందే నోరు లేస్తుంది. ఎవరి ముందు నిల్చని ఎవరికి ఎదురు చెప్పి మాట్లాడుతున్నావో తెలుస్తుందా.. 
సత్య: నేను నా మనసులో బాధ చెప్తుకుంటున్నాను అత్తయ్య.
మహదేవయ్య: గట్టిగా మొత్తుకో.. ఓర్లు, గోల పెట్టు అవేవి నా దగ్గర చెల్లవు. ఆకరికి నేను చెప్పింది వినాల్సిందే.. జరగాల్సిందే..
భైరవి: దిమాక్‌లోకి పెట్టుకున్నావా. ఆయన ఒప్పుకున్నారు కాబట్టే నువ్వు ఈ ఇంటికి కోడలు అయ్యావ్. ఆయన ఒప్పుకున్నారు కాబట్టే నా కూతురు నీ పుట్టింటికి వెళ్లింది. ఇప్పుడు ఆయన ఇష్ట ప్రకారమే నీ పేరు మారాల్సిందే.. ఏరా చిన్నా అది నీ బాపుని ఎదురించి మాట్లాడుంటే అట్లా తమాషా చూస్తున్నావ్. పెళ్లం మీద ప్రేమతో కళ్లు మూసుకుపోయాయా..
క్రిష్‌: నువ్వు చెప్పింది నువ్వు చెప్పావ్.. బాపు చెప్పాల్సింది బాపు చెప్పాడు.. ఇంకా నేనేం చెప్పేది.. సత్య చదువుకున్నది మంచి చెడు నా కంటే బాగా తనకే తెలుసు.
మహదేవయ్య: అలా అని గాలికి విడిచిపెడతావా.. పెళ్లం గాలానికి చిక్కిన చేప లాంటిది. చచ్చినట్లు చెప్పినట్లు వినాలి. మొగుడు ఏం చెప్పినా వినాలి. కూర్చొ అంటే కూర్చొవాలి.. నిల్చొఅంటే నిల్చొవాలి..
క్రిష్‌: వింటున్నావ్ కదా ఏమంటావ్. పేరు మార్చుకుంటావా..
సత్య: ఇంటికి కొత్తగా పెంపుడు జంతువును తెచ్చుకుంటే పేరు పెట్టుకుంటారు. నన్ను కోడలిగా తెచ్చుకున్నారు. పెంపుడు జంతువుగా కాదు. సత్యభామ అన్నది మా నాన్న నా చెవిలో ఆప్యాయంగా చెప్పిన పేరు. ఏరి కోరి పెట్టుకున్న పేరు. ఆ పేరు వెనక మా అమ్మానాన్నల ప్రేమ ఉంది. సమాజంలో సత్యభామ పేరుతోనే నాకు గుర్తింపు దాన్ని ఎలా వదులుకోమంటారు. మీరు అన్నట్లు నాది కొత్త జీవితమే అందుకే కదా ఇంటి పేరు మార్చుకున్నాను. అది సరిపోదా.. పేరుకు సంబంధించిన ఉనికే పోగొట్టుకోమంటారా.. ఇది అన్యాయం కాదా.. ఇది నా సెంటిమెంట్ అర్థం చేసుకోండి. అయినా పురాణాల్లో శ్రీకృష్ణుడు సత్యభామ కలిసే ఉన్నారు కదా వాళ్లుకు సరిపోయిన బలం మాకు ఎందుకు సరిపోదు. ఆలోచించండి  మామయ్య గారు.
మహదేవయ్య: ఈ ఇంట్లో ఆడోళ్లు నాతో మాట్లాడటానికే ఆలోచిస్తారు. నీ పెళ్లం ఏంట్రా ఏకంగా ఎదురు తిరుగుతుంది అడగవేంట్రా.. రేయ్ మాట్లాడవేంట్రా..
క్రిష్‌: మాట్లాడే ముందు ఆలోచించాలి కదా బాపు. సత్య చెప్పినదాంట్లో న్యాయం ఉంది. సత్య బాధలో నిజాయితీ ఉంది. జరంత సేపు మీ పెద్దరికాన్ని అహాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. లొల్లి చేయడం కాదు. ఇప్పుడు సత్యభామ పేరుకు ఏమైంది. ఆ పేరుకు బలం ఉండ బట్టే కదా ప్రేమించా.. ఇదిగో పచ్చబొట్టు పొడిపించుకున్నా.. పెళ్లి చేసుకున్నా.. ఇంత చిన్న విషయానికి రాద్దాతం ఎందుకు బాపు. జర తగ్గండి ఇంటి కోడలికి మర్యాద ఇవ్వండి. సత్య మాటకు గౌరవం ఇవ్వండి. దానితో మన పెద్దరికానికి నష్టం ఏం లేదు. పంతులు మీరు ఇక పోండి. నేను చెప్తున్నా కదా పోండి సత్య పేరు మార్చుకోదు. ఇదే ఫైనల్ డెసిషన్.
మహదేవయ్య: గన్ పట్టుకొని వచ్చి క్రిష్‌కి గురి పెట్టి.. ఇప్పుడు చెప్పురా ఎవరి నిర్ణయం ఫైనల్. ఏది ఫైనల్ చెప్పాల్సంది నేను నువ్వు కాదురా.. ఈ బాపు ముందే తోక ఊపుతున్నావా.. ఆ ప్రొఫెసర్ కూతురు నీకు మంచిగానే పాఠాలు నేర్పిస్తుంది. అవిడ నేర్పించిన ఎక్కాలు నా ముందు చెప్పుకు తిక్కలేస్తాది. ఇష్టం లేకపోయినా నీ పెళ్లి జరిపించా అందుకు నువ్వు ఇచ్చే బహమతి ఇదారా.. బాపు కంటే నీకు పెళ్లం ఎక్కువ అయిపోయిందా చెప్పరా నా మాట వింటావా నీ పెండ్లమ్ మాట వింటావా..
క్రిష్: ఏమనుకోకు బాపు పేరు విషయంలో నేను సత్య దిక్కే ఉంటా. 
మహదేవయ్య: ఈ మహదేవయ్య మాటకు ఎదురు తిరుగడం అంటే ప్రాణాలు పావురాలకు వదిలినట్లే అది కన్న కొడుకు అయినా వినిపించుకోను.


మహదేవయ్య క్రిష్‌ని చంపబోతే అతడి తల్లి కంటిన్యూగా గంట కొట్టి మహదేవయ్యకి చిరాకుపుట్టించి అడ్డుకుంటుంది. దీంతో మహదేవయ్య వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోతాడు. సత్య ఏడుస్తూ తన గదికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తన ఇంట్లో దీపని కలిసిన కార్తీక్, నిజం చెప్తాడా.. దీప కార్తీక్‌ను క్షమిస్తుందా.. నిలదీసిన సుమిత్ర!