Karthika Deepam 2 Serial Today April 8th:కార్తీకదీపం 2 సీరియల్: తన ఇంట్లో దీపని కలిసిన కార్తీక్, నిజం చెప్తాడా.. దీప కార్తీక్‌ను క్షమిస్తుందా.. నిలదీసిన సుమిత్ర!

Karthika Deepam 2 Serial Today Episode సుమిత్ర ఇంట్లో ఉన్న దీపని జ్యోత్స్న తన బావ కార్తీక్‌కు పరిచయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప, సౌర్యలను జ్యోత్స్న, సుమిత్రలు ఇంటికి తీసుకొస్తారు. సుమిత్ర, దశరథలు సౌర్యని చాలా ముద్దు చేస్తారు. తమనతో ఆడుకోమని అంటారు. ఇంతలో కార్తీక్‌ కారు రావడంతో జ్యోత్స్న బావ వచ్చాడు అని పరుగులు తీస్తుంది. జ్యోత్స్న కార్తీక్ విషయం చెప్పబోతే తనకు ముందే తెలుసు నాన్న కాల్ చేసి చెప్పాడు అంటుంది.

Continues below advertisement

జ్యోత్స్న: బావ తను ఇప్పుడు లోపలే ఉంది. తను ఎంత మంచిదో తెలుసా.. ఒక్క మాట మాట్లాడదు. అక్కని చూశావంటే ఇలాంటి మనిషిని ముందు కలిసుంటే బాగుండేది అనుకునే వాడివి.
కార్తీక్: అంత మంచి మనిషి కాబట్టే ప్రాణాలకు తెగించి కాపాడింది. ముందు నేను తనకు థ్యాంక్స్ చెప్పాలి పద.

కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. కార్తీక్‌ను చూసిన సౌర్య సైకిల్ ఇవ్వడం, యాక్సిడెంట్ చేయడం గుర్తు చేసుకుంటుంది. ఇక దీపని జ్యోత్స్న పిలిచి తన బావని పరిచయం చేస్తుంది. దీప కార్తీక్‌ను చూడగానే కోపంతో రగిలిపోతుంది. తన తండ్రిని కార్తీక్‌ గుద్దిన సంఘటన, తప్పు చేయలేదు అని కార్తీక్ అనడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. 

దీప: అవుట్ హౌస్‌లో.. తనలో తాను.. ఎందుకిలా జరుగుతుంది. కనిపిస్తేనే నేను అసహ్యించుకునే ఆ మనిషి ఇంటికి రావడం ఏంటి. అతను నాకు కనిపించకూడదు అంటే నేను ఇంకా ఎక్కడికి పోవాలి. 
సౌర్య: అమ్మా జాతరలో కనిపించాడు. రోడ్డు మీద కనిపించాడు. ఇప్పుడు ఇంట్లో కూడా కనిపించాడు. అదే అమ్మ ఆ సారు. ఇది ఆ సారు ఇల్లేనా.. సారు మూడు సార్లు కనిపించాడు కానీ నాన్న ఒక్క సారి కనిపించలేదు. నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలినా నాన్న రాలేదు. ఏ అమ్మ నాన్న ఎలా ఉంటాడో నీకు కూడా తెలీదా.. 
దీప: ఏడుస్తూ..నీకు ఎలా చెప్పాలి. 

కార్తీక్: దీప.. నువ్వు మా నాన్నని చంపేశావ్ కానీ నేను మీ అత్తని కాపాడాను మనిషి అంటే ఇలా ఉండాలిరా అని చెంప దెబ్బ కొట్టి నిలదీసి అడుగుతున్నట్లుంది. కళ్లలో కోపం చూపులో ద్వేషం ఇదంతా పోవాలి అంటే ఆ రోజు ఏం జరిగిందో నీకు నేను చెప్పాలి. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి దేవుడే నాకు ఓ అవకాశం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావో తెలీదు కానీ నువ్వు వెళ్లేలోపు నీకు నిజం తెలియాలి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. కానీ నేను చెప్పేది నిజం అని నీవు  నమ్ముతావా..

దీప సౌర్యని పడుకోపెడుతుంటే పళ్లు పట్టుకొని సుమిత్ర దీప దగ్గరకు వస్తుంది. సౌర్యకు సుమిత్ర పళ్లు ఇస్తే సౌర్య తీసుకోదు. దీంతో సుమిత్ర ఈ అమ్మమ్మ దగ్గర తీసుకుంటే  మీ అమ్మ ఏమీ అనదు అని సుమత్రి అంటుంది. సౌర్య తీసుకుంటుంది. 

సుమిత్ర: దీప నీ వివరాలు అడుగుతుంటే కష్టాల్లో ఉన్న ఆడపిల్లని అన్నావు. అందుకే అప్పుడు వదిలేశాను. ఇప్పుడు అడుగుతున్నాం ఏం జరిగిందో చెప్పు అప్పుడే నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. 
దీప: ఏడుస్తూ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా.
సుమిత్ర: దీప నిన్ను చూస్తేంటే నీ తలకు తగిలిన గాయం కంటే ఇంకా పెద్ద గాయం మనసుకు తలిగింది అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్తేనే తెలుస్తుంది. నీ కన్నీళ్ల వెనక ఉండే కథ ఏంటి. అమ్మా నాన్న ఎక్కడుంటారు.
దీప: ఏడుస్తూ.. అమ్మా నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కళ్లు మూసుకుపోయి కారు నడుపుతూ నా కళ్ల ముందే నాన్నని చంపేశాడు. ఇక సుమిత్ర దీపను తన భర్త గురించే అడిగితే నన్ను ఏమీ అడగొద్దు అని దీప అంటుంది. 

ఇంతలో బంటు దీపని చూస్తాడు. దీప ఎంత అడిగినా తన భర్త గురించి చెప్పదు. దీంతో సుమిత్ర వెళ్లిపోతుంది. దీప మనసులో క్షమాపణ చెప్తుంది. ఇక బంటు చేసిన పనికి పారిజాతం కంగారు పడుతుంటే బంటు వచ్చి పారిజాతం కాలుమీద పడతాడు. మీకో నిజం చెప్పాలమ్మా అని అంటాడు. దీప తనని చూసిందని బంటు పారిజాతం చెప్తాడు. దీంతో పారిజాతం బంటుని తిడుతుంది. బంటు తనని రక్షించకపోతే మీరు నాతో పాటు జైలుకి వస్తారని పారిజాతాన్ని కంగారు పెడతాడు. ఇక దీప తన భర్తని తిట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

 Also Read: అనంతిక: రెడ్​ కలర్ హాఫ్ శారీలో మ్యాడ్​ హీరోయిన్.. ఈ భామ టాలెంట్స్​ చూస్తే నిజంగానే పిచ్చెక్కెస్తాది

Continues below advertisement
Sponsored Links by Taboola