Punch Prasad Emotional Interview Promo: పంచ్ ప్రసాద్.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై తన పంచులతో ఎంతోమంది ముఖంలో చిరునవ్వు తెప్పించారు ఆయన. అయితే, ప్రేక్షకులను నవ్వించిన ఆ పంచ్ ప్రసాద్ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చారు ఆయన. ఇప్పుడిక ఆపరేషన్ చేయించుకుని, ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. అయితే, తనకు ఛాన్సులు ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి కచ్చితంగా బాగా చేయగలనని, డేట్స్ కూడా ఇవ్వగలను అంటూ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. యూట్యూబ్‌లో ‘జోర్దార్ పార్టీ విత్ సుజాత’ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన తన గురించి చాలా విషయాలు చెప్పారు. దానికి సంబంధించి ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
ఆమె గురించి ఎందుకమ్మా ఇప్పుడు?
పంచ్ ప్రసాద్ ఎక్కడున్నా నవ్వుల పువ్వులు పూయిస్తారు. అలా ఈ షోలో కూడా ఆయన పంచ్ లతో నవ్వించారు. ఆయనకు ఉన్న ధైర్యంలో మనకు సగం ఉన్నా చాలు అనిపించేలా చేసిన వారియర్ పంచ్ ప్రసాద్ అంటూ సుజాత ఆయన్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత.. "ముందు సునీ గురించి మాట్లాడదాం" అంటూ సుజాత చెప్పాగా.. "ఎందుకమ్మా.. ఫస్ట్ ఆమె గురించి డల్ గా".. "అదేంటి సునీత పేరు వింటే వైబ్రైట్ అయితరు అని విన్నాను".. "అది ఇంట్లో అమ్మా.. ఇక్కడ కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా.. ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతాం కదా? నిజానికి సునీ నాకు వీరాభిమాని. కానీ, ఇప్పుడు పో.. పో.. అంత లేదు అంటుంది" అంటూ తన భార్య సునీత గురించి జోకులు పేల్చారు పంచ్ ప్రసాద్.
నూకరాజు మా ఇంటికి రావొద్దు..
పంచ్ ప్రసాద్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన కో కంటెస్టెంట్ నూకరాజు చాలా హెల్ప్ చేశాడు. అతని గురించి మాట్లాడుతూ.. "బేసికల్ గా నేను ఏం షేర్ చేసుకోను. కానీ, చెప్పు చెప్పు అని బలవంతపెడతాడు.. అతనే నూకరాజు. మోతీనగర్ లో ఉండేవాడిని. వాడు వచ్చాడని నేను ఖాళీ చేసి వెళ్లిపోయా. నేను చాలాసార్లు చెప్పాను. ఇదంతా జోక్ అనుకోకు తమ్ముడు.. నిజంగానే రాకు తమ్ముడు అని చెప్పాడు. నూకరాజు ముందు కామెడీ చేయి, మీ అమ్మ.. కామెడీ ఏం చేస్తున్నాడు నా కొడుకని అడుగుతుంది’’ అంటూ నూకరాజుతో జోక్ చేశాడు ప్రసాద్. ఇక తనది షకలక శంకర్ ది ఒక గ్రూప్ కాదని బ్లడ్ గ్రూపులు వేరు అంటూ పంచ్‌లు పేల్చాడు.
ఆడపిల్ల పుట్టినప్పుడు భయపడ్డాను..
"జీవితంలో పెద్ద ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డారు. ఏక్షణమైనా భయపడ్డారా?" అని సుజాత అడిగిన ప్రశ్నకి ఎమోషనల్ అయ్యాడు పంచ్ ప్రసాద్. "అమ్మాయి పుట్టినప్పుడు ఫీల్ అయ్యాను. అర్రే అమ్మాయి పుట్టింది నాకు ఏమైనా అయితే, దాన్ని ఎవరు చూసుకుంటారు అని బాధపడ్డాను. కట్ చేస్తే ఆ తర్వాత దానికి బాలేదు. తనకే అన్ని సూదులు అవి పెట్టి ఉన్నారు. ఇక హెల్త్ బాలేనప్పుడే జబర్దస్త్ లో చేశాను. ఇప్పుడు బాగున్నాను, ఆరోగ్యం చాలా బాగుంది.. అంటే ఇంకా చాలా చేయగలను. ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్లు ఎవరైనా నాకు ఛాన్స్ ఇవ్వండి. డేట్స్ కూడా ఫుల్ గా ఇవ్వగలను" అంటూ ఛాన్సుల కోసం అడిగారు పంచ్ ప్రసాద్.