Guppedanta Manasu  Serial Today Episode: మను, వసు, ఏంజల్‌ ముగ్గురు విశ్వం ఇంటకి వస్తారు. విశ్వం ప్రేమగా మనును పలకరిస్తూ.. తాతయ్యా అని ఒక్కసారి పిలవమని అడిగితే.. తాను తాతయ్య అని పిలవలేను సార్. ఎందుకంటే నన్ను కన్న తల్లే నాకు దూరంగా ఉంది. నేనామెను అమ్మా అని పిలవలేని పరిస్థితి అటువంటప్పుడు మిమ్మల్ని నేను తాతయ్యా అంటూ ఎలా పిలుస్తాను అంటూ మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎంజేల్‌ వసుధారకు సారీ చెప్తుంది. నేను చెప్పింనందుకే మీరు తనని తీసుకొచ్చారు. అనగానే వసుధార కూడా సరేలేండి అంటూ విశ్వంకు వాళ్లిద్దరూ ఎప్పటికైనా ఒక్కటై మీ దగ్గరకు వస్తారని చెప్పి వెళ్లిపోతుంది. ఇన్నాళ్లు నా కూతురే దూరంగా ఉందనుకున్నాను కానీ నా మనవడు కూడా దూరంగానే ఉండాలా? అంటూ ఎంజేల్‌ను ప్రశ్నిస్తాడు. మరోవైపు మను బాధగా విశ్వం మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వసుధార కాఫీ తీసుకుని వస్తుంది.


వసు: మీకు చెప్పకుండా విశ్వనాథం గారి ఇంటికి తీసుకెళ్లినందుకు మిమ్మల్ని హర్ట్‌ చేసినందుకు రియల్లీ సారీ.


మను: నేను మీ నుంచి సారీ ఎక్స్‌ పెక్ట్‌ చేయట్లేదు వసుధార గారు. మీలాంటి వ్యక్తులు సారీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పించుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోదు.


వసు: తెలుసండి మీ మనసు అర్థం చేసుకున్నాను.  విశ్వనాథం గారి మనసు అర్థం చేసుకున్నాను. మీకు చెప్పకుండా చేస్తే బాధపడతారని తెలుసు. ఈ వయసులో ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఙాపకాలు. ఆ జ్ఙాపకాలు మీరే ఆయనకు ఇవ్వాల్సింది.


మను: కరెక్టే మీరు చెప్పింది కరెక్టే.. కానీ నేను ఇప్పుడు ఎవ్వరి ప్రేమ కోరుకోవట్లేదు. ఒక్క అమ్మ ప్రేమ తప్పా. ఇప్పటికీ కూడా నా తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఇదే అదనుగా చూపించి నన్ను ఎవరెవరో ఏమేమో అంటున్నారు. మా అమ్మను కూడా అవమానిస్తున్నారు.


  అంటూ ఇదంతా నా తండ్రి వల్లే జరిగింది. అతను దొరికితే వదిలిపెట్టను. ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి నా తల్లి ముందు నిలబెట్టి నిలదీస్తాను. అంటూ వెళ్లిపోతాడు. మను మాటలు చాటునుంచి విన్న మహేంద్ర ఆవేశంగా అనుపమ దగ్గరకు వెళ్తాడు.


మహేంద్ర: మళ్లీ లెటర్లు రాయడం బట్టలు మడతపెట్టడం ఇలాంటి ప్లాన్స్‌ ఏం చేయట్లేదు కదా?


అనుపమ: వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను.


మహేంద్ర: నువ్వు వెళ్లాలని నా ఉద్దేశ్యం కాదు అనుపమ. నువ్వు ఇక్కడే ఉండాలి హ్యాపీగా ఉండాలి. అందుకే నువ్వు హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక నిన్ను ఇక్కడికే తీసుకొచ్చాను. కొన్ని నెలల క్రితం నేను ఇలాంటి పరిస్థితే ఎదురుకున్నాను.


వసు: అవును మేడం జగతి మేడం చనిపోయాక మేము చాలా స్రగుల్‌ ఫేస్‌ చేశాం. తర్వాత దేవయాని మేడం వల్ల మేము ఇక్కడకు వచ్చేశాం. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో రిషి సార్‌ మిస్‌ అవ్వడం మీరు చూస్తున్నారుగా.. మీ సమస్యలన్నీ తీరిపోయి హ్యాపీగా ఉండే టైం వస్తుంది మేడం.


అనుపమ: నా సమస్య తీరిపోయేది కాదు వసుధార.


మహేంద్ర: చూడు అనుపమ నీ సమస్యని చిన్నది చేయడం కాదు కానీ వసుధారకు ఎదురైన కష్టాలతో పోలిస్తే చాలా చిన్నది.


అనుపమ: నా ప్రాబ్లమ్స్‌ ఎంటో మీకు తెలియకుండా మీరంతా నాతో మాట్లాడుతున్నారు.


మహేంద్ర: చూశావా అందుకే చెప్పమని అడుగుతున్నాము కదా! మీరిప్పుడు ఎలా ఉన్నారో ఒకప్పుడు జగతి, రిషి కూడా అలాగే ఉండేవాళ్లు. వాళ్లలాగే నువ్వు మను కూడా తొందరలోనే ఒక్కటవుతారు.


అని చెప్పగానే అనుపమ ఆలోచనలో పడిపోతుంది. తర్వాత కాలేజీలో బోర్డు మీటింగ్‌ నడుస్తుంది. కాలేజీలో పేరేంట్స్‌ మీటింగ్‌ పెట్టాలని లాస్ట్‌ మీటింగ్‌లో డిసైడ్‌ అయ్యామని అది ఎంతవరకు వచ్చిందని వసుధార అడుగుతుంది. దీంతో అదే పనిలో ఉన్నామని స్టాఫ్‌ చెప్తారు. ఇంతలో ఒకతను ఇవాళ మన రాలేదేంటి అని అడగ్గానే శైలేంద్ర తను ఈ మీటింగ్‌కు రాలేదంటే ఫ్యూచర్‌ల కూడా రాలేడేమో.. తనకు ఎన్ని ప్రాబ్లమ్స్‌ ఉన్నాయో ఏమో అంటాడు. దీంతో ఫణీంద్ర, శైలేంద్రను తిడతాడు. నువ్వే వెళ్లి మనును తీసుకురా అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: బర్త్​డే బాయ్ బన్నీ ఫిట్​నెస్ టిప్స్ ఇవే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలా చేయడం వల్లే ఫిట్​గా ఉన్నానంటున్న ఐకాన్ స్టార్