Satyabhama Today Episode సత్య కారం కలిపిన నలుగు క్రిష్‌కి రాసేస్తుంది. క్రిష్‌ మంటకు ఇబ్బంది పడుతుంటే శాంతమ్మ ఏమైంది బాబు అని అడుగుతుంది. దాంతో క్రిష్‌ ఏదేదో అవుతుంది. తెలుస్తలేదు.. చెప్పడానికి వస్తేలేదు అంటాడు. క్రిష్ సున్నిపిండిని చూసి షాక్ అవుతాడు..


క్రిష్: సున్ని పిండి అంటే తెల్లగా ఉండాలి కదా ఇదేంటి ఎర్రగా ఉంది. 
సత్య: మీరు రంగు వస్తారని కొంచెం కుంకుమ కలిపాను. 
క్రిష్: రంగు రావడం కాదు నాకు ఏదో రంగు పడుతుంది ఇక్కడ. నాతో అవ్వడం లేదు. నీ నలుగుకి ఓ దండం నీకో దండం. అని క్రిష్ పారిపోతాడు. ఇక సత్య నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అనుకుంటుంది. 


క్రిష్ స్నానం చేసి వచ్చి మంటకు ఫుల్లుగా పౌడర్‌ రాసుకుంటాడు. సత్య వచ్చి అంతగా మంటగా ఉందా అంటే క్రిష్ మామూలుగా లేదు అంటాడు. దాంతో సత్య అప్పటికీ సున్ని పిండిలో కారం కొంచమే కలిపానే అంటుంది. దీంతో క్రిష్ బిత్తరపోతాడు. రాక్షసి అని సత్యను తిడతాడు. దీంతో సత్య క్రిష్‌తో నువ్వు సత్యలా బుద్ధిగా ఉండకపోతే నేను క్రిష్‌లా చెలరేగిపోతా అంటుంది. మరోవైపు పూజ కోసం ఏర్పాట్లు జరుగుతాయి. 


క్రిష్: తనలో తాను.. కోపంగా.. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయానే. కత్తికి కూడా భయపడనోడిని సత్యకు భయపడుతున్నాను. నన్ను కంట్రోల్‌లో పెట్టుకుంటుందా. అంత దమ్ము ఉందా నీకు. ఏది అయితే అది అయింది నేను ప్రశాంతంగా ఉండను నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. 



హర్ష: కలిసి ఒకే గదిలో ఉన్నా ఇద్దరి మనసుల మధ్య దగ్గర కాలేనంత దూరం. నన్ను శిక్షిస్తాను అనుకుంటూ తనని తాను శిక్షించుకుంటుంది. ఎప్పటికి తెలుసుకుంటుందో.
రేణుక: నందిని అంత తొందరగా నిద్ర లేవదు అందుకే మీ ఒక్కరికే కాఫీ తీసుకొచ్చా.
హర్ష: పెద్దవాళ్లు పట్టించుకోరా. మంచి చెడు చెప్పరా. 
రేణుక: ఈ ఇంట్లో అంత సంస్కారం లేదు తమ్ముడు. పెద్దవాళ్లు పట్టించుకుంటే నందిని అలా ఎందుకు తయారవుతుంది. కాఫీ తీసుకో.. అని హర్షకు కాఫీ ఇచ్చి నందినిని రేణుక నిద్ర లేపుతుంది. దీంతో నందిని రేణుకని తిడుతుంది. 
హర్ష: ఏయ్.. వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా. నీ కంటే పెద్దది మర్యాద ఇవ్వడం తెలీదా.
నందిని: ఇగో ఇది నా అత్తారిళ్లు కాదు పుట్టిళ్లు. నాకు ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఉంటా అడగటానికి ఎవరికీ హక్కు లేదు నీకు కూడా. నందిని మాటలకు హర్ష చిరాకుగా బయటకు వెళ్లిపోతాడు. 


హర్ష: నందిని తరుఫున నేను సారీ చెప్తున్నాను.
రేణుక: మీరు సారీ చెప్పడం ఎందుకు ఏం పర్లేదు నేను కోడలిని కదా నాకు ఇవన్నీ అలవాటే. నందిని మంచి పిల్ల వయసు వచ్చింది కానీ మనసు పెరగలే. అల్లరి చేసే పిల్లను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా కోపం తెచ్చుకోకూడదు. నందిని అదృష్టం ఏంటి అంటే నీలాంటి భర్త దొరకడం. కాస్తంత ఓపిక పట్టి నందినిని నీ దారికి తెచ్చుకో. బంధం తెంచుకోవడం కష్టమేమీ కాదు నిలుపుకోవడమే కష్టం. 


మరోవైపు క్రిష్ పంతులుని అడ్డుకుంటాడు. సంప్రదాయం పేరుతో సత్యకు కష్టమైన పనులు చెప్పి టార్చర్‌ చేయమని పంతులుతో క్రిష్ చెప్తాడు. పంతులు విశ్వనాథానికి విషయం చెప్తాను అంటే క్రిష్ పంతులుకి డబ్బులు ఇస్తాడు. పంతులు ఒప్పుకోకపోవడంతో గన్‌ తీసి బెదిరిస్తాడు. లోపలికి వెళ్లి క్రిష్ పంతులుతో మంచిగా మాట్లాడుతాడు. దీంతో పంతులు తన టైమింగ్‌తో సెటైర్లు వేస్తాడు. కాసేపు జబర్దస్త్ చూసినట్లు ఉంటుంది. 


పంతులు క్రిష్, సత్యలతో పూజ చేయిస్తాడు. పూజ టైంలో సత్య క్రిష్ చేయి తాకడంతో క్రిష్ హ్యాపీగా ఫీలవుతాడు. ఇక క్రిష్ తాను చెప్పినట్లు సత్యను ఇరికించమని పంతులుకి సైగ చేస్తాడు. దీంతో పంతులు వ్రతం పూర్తయిందని అరచేతిలో హారతి వెలిగించుకొని దేవుడికి ఇవ్వమని అంటాడు. దీంతో సత్యతో పాటు అందరూ షాక్ అయిపోతారు. వెంటనే క్రిష్ ప్లేట్ మార్చేస్తాడు. దీంతో పంతులు అబ్బో అని వెటకారంగా అంటాడు.


క్రిష్: అరచేతిలో హారతా  నా సంపంగి చేతులకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. కావాలి అంటే ఆ హారతి నేను ఇస్తా. 
పంతులు: అబ్బో.. కుదరదు బాబు అమ్మాయి చేతితోనే హారతి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వత్ర ఫలితం దక్కదు. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. 
క్రిష్: హాలో ఈ హారతి ప్లాన్ మనదే..
సత్య: నిన్నూ.. పంతులు గారు మేం బాగానే ఉంటాం నేను అరచేతిలో హారతి ఇవ్వను.
విశాలాక్షి: వద్దమ్మ మీ బంధం బాగుండాలి కష్టమైన చేయాలి తప్పదు.
విశ్వనాథం: ఇప్పుడిప్పుడే మీ కాపురం కుదుట పడుతుంది. మా కోసం అయినా ఓర్చుకొని హారతి ఇవ్వమా.. 


సత్య ఇరుక్కు పోయానని అనుకొని తప్పని పరిస్థితుల్లో హారతి ఇస్తుంది. క్రిష్ నవ్వుకుంటాడు. పంతులు క్రిష్ వైపు కోపంగా చూస్తాడు. సత్య నొప్పికి ఇబ్బంది పడి క్రిష్‌ని చూసి తిట్టుకుంటుంది. ఇక తర్వాత పంతులికి క్రిష్‌ సైగ చేస్తాడు. దీంతో పంతులు సత్యతో అమ్మా నువ్వే ఉగాది పచ్చడి చేసి నీ చేతితోనే తినిపించాలి అని అంటాడు. సత్య రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గౌతమ్‌ కన్నింగ్ ప్లాన్, జ్యోత్స్నని హర్ట్ చేసిన కార్తీక్‌.. దీప కోసం సిటీకి బయల్దేరిన అనసూయ!