Krishna Mukunda Murari Today Episode ముకుంద ఇచ్చిన బొమ్మలు పట్టుకొని కృష్ణ మురారి దగ్గరకు వస్తుంది. తను వారసుడిని ఇస్తుందని అందరూ అపురూపంగా చూసుకుంటున్నారని.. పెద్దత్తయ్య కోరిక త్వరగా తీర్చాలని భర్తతో అంటుంది. మురారి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండటంలతో ముందు తాగి వచ్చారా అని ప్రశ్నిస్తుంది. 


కృష్ణ: రాత్రి నుంచి చూస్తున్నా నేను నిద్రపోయినప్పుడు మెలకువగా ఉండి ఏడుస్తున్నారు. సరిగా మాట్లాడటం లేదు. తప్పించుకొని తిరుగుతున్నారు. సరే కానీ అవన్నీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎందుకు తాగోరో చెప్పండి.
మురారి: అవును తాగాను అని అరుస్తాడు. బాధ తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ తాగాను.. 
కృష్ణ: బాధా.. అంత బాధ ఏముంది మీ మనసులో.. ఒక్కరే మధన పడాల్సిన అవసరం ఏముంది. ఏమైంది ఏసీపీ సార్ మీరు ఇంతలా బాధ పడటం నేను ఎప్పడూ చూడలేదు. మిమల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నాకూ చెప్పకూడదా..
మురారి: మనసులో.. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను. నేనే ఇలా ఏడిస్తే కృష్ణ ఎలా ధైర్యంగా ఉంటుంది. ముందు నేను సెట్ అయి కృష్ణని ప్రిపేర్ చేసి నిజం చెప్పాలి. ఏం లేదు కృష్ణ ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నా.. నువ్వు కడుపు నొప్పితో విలవిల్లాడిపోయావ్ కదా అది గుర్తొచ్చి తట్టుకోలేకపోతున్నా. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను.
కృష్ణ: అసలు నాకు ఏం అవుతుంది. 
మురారి: అదేం లేదు చెప్పాలి అనిపించింది చెప్పాను అంతే.. అని హడావుడిగా వెళ్లి పడుకుండిపోతాడు. కృష్ణ ఏడుస్తుంది.


మరోవైపు ఆదర్శ్ ముకుందని రమని పిలిచి గులాబీలతో ముకుందకు ప్రపోజ్ చేస్తాడు. ప్రేమిస్తున్నాను అని పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. ముకుంద షాక్ అయిపోతుంది. ఇక కృష్ణ మురారిలు ఆదర్శ్‌ ప్రపోజ్ చేయడం చూస్తారు. అది చూసి కృష్ణ వచ్చి ఆదర్శ్‌ చేతిలోని గులాబీలు తీసుకొని నేలకు విసిరి కొడుతుంది. ఆదర్శ్‌ కృష్ణ మీద సీరియస్ అవుతాడు. 


ఆదర్శ్‌: కృష్ణ ఏం చేస్తున్నావ్ నువ్వు తనని నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నీకు ఏంటి నష్టం. 
కృష్ణ: నష్టం నాకు కాదు ఈ ఇంటికి. అసలు తనకి నువ్వు ముకుంద అని పేరు పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. 
ఆదర్శ్‌: అది నా ఇష్టం. 
కృష్ణ: అంతా నీ ఇష్టం అనుకోవడానికి నువ్వు ఇప్పుడు హిమాలయాల్లో లేవు. కుటుంబంలో ఉన్నావ్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఈ ఇంటికి మేలు చేసిది అవ్వాలి. కీడు చేసేది కాకూడదు. 
ఆదర్శ్‌: నేను ఇష్ట పడటం కీడు ఎలా అవుతుంది. మురారి ఏంట్రా తను మాట్లాడేది. 
మురారి: కృష్ణ చెప్పేది వినురా..
ఆదర్శ్‌: అరే నువ్వు కూడా ఏంట్రా.. నేను ముకుందను పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా..
కృష్ణ: ఆదర్శ్‌ ముకుంద కాదు.. తను మీరా.. మీరా.. ఒకవేళ నీకు తను ఇష్టమైతే ఈ ఇంట్లో వాళ్లని అడగాలి. వాళ్లకి ఇష్ట లేకపోతే వదిలేయాలి అర్థమైందా.. అని అడగ్గానే ఆదర్శ్‌ తుల్లిపడి లేస్తాడు.  అదంతా ఆదర్శ్‌ కల. దీంతో కంగారు పడిన ఆదర్శ్‌ అప్పుడే ముకుంద దగ్గరకు వెళ్లి విషయం చెప్పాలి అనుకుంటాడు.


మరోవైపు ముకుంద డైరీ రాస్తుంటుంది. నాలుగు రోజుల్లో కృష్ణకు గర్భసంచి తీసేస్తారని అందరి చేత కృష్ణని గొడ్రాలని పిలిపిస్తాను అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్ అక్కడికి వస్తాడు. ముకుంద హడావుడిగా డైరీ దాచేస్తుంది. ఆదర్శ్‌ డైరీ చూశాడేమో అని ముకుంద కంగారు పడుతుంది. 


ఆదర్శ్‌ ముకుందతో నీకు ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఏం చెప్తాడా అని ముకుంద కంగారు పడుతుంది. ప్రపోజ్ చేస్తాడేమో అని అనుకుంటుంది. ఆదర్శ్‌తో రేపు జాగింగ్‌కు వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పి ఆదర్శ్‌ని పంపేస్తుంది. ఆదర్శ్ తనకి ప్రపోజ్ చేయడానికే వచ్చాడని.. ఇకపై ఆదర్శ్‌కి ఒంటరిగా దొరకకూడదు అని దొరికినా మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు అనుకుంటుంది.


మరోవైపు కృష్ణ భవానికి ఇచ్చిన మాట తలచుకొని బాధపడుతుంది. మురారి వైపు చూస్తే మురారి మంచి నిద్రలో ఉంటాడు. ఇక ఉదయం ఆదర్శ్‌ ముకుంద వస్తుందని జాగింగ్‌కు రెడీ అవుతాడు. ముకుందతో ఏం మాట్లాడాలా అని ముందే అనుకుంటాడు. ముకుంద ఒప్పుకుంటే అమ్మ ఒప్పుకుంటుందని అనుకుంటాడు. ఇక ముకుంద బయటకు వస్తూ ఆదర్శ్‌ని చూసి తలుపు వేసేస్తుంది. ఎలా తప్పించుకోవాలా అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్ వచ్చి ముకుంద డోర్ కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


 Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గౌతమ్‌ కన్నింగ్ ప్లాన్, జ్యోత్స్నని హర్ట్ చేసిన కార్తీక్‌.. దీప కోసం సిటీకి బయల్దేరిన అనసూయ!