Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode నర్శింహ గురించి తెలుసుకున్న పారిజాతం దీప, సుమిత్రతో ఈ ఇంటికి ఎవడో వచ్చాడంట.. గొడవ ఏదో జరిగిందట.. వచ్చిన వాడు దీపకోసమే వచ్చాడంట అని అంటుంది. దానికి సుమిత్ర అంట అంట అని గుడిలో గంటలా కొట్టుకోకండి అత్తయ్య అని అంటుంది. ఇంతలో సౌర్యను రఘురాం ఎత్తుకొని వస్తాడు.
సౌర్య: అమ్మా తాతయ్య చూడు ఎన్ని చాక్లెట్లు ఇచ్చారో.
దీప: ఇన్ని ఎందుకు అండీ..
రఘురాం: నా కూతురికి పెళ్లి అయి మనవరాలు పుడితే ఇలాగే ఆడుకుందాం అనుకున్నా కానీ నాకు ఆ దేవుడు కూతుర్ని, మనవరాలిని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురి మీద ఓ చనువు ఉంటుందమ్మ.. ఆ చనువుతోనే చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు..
దీప: కొన్ని బంధాలు దగ్గర అయ్యే కొద్ది భారం అవుతాయండి..
రఘురాం: కానీ కొన్ని బంధాలు దగ్గరైతే బాధ్యత అవుతాయి. సుమిత్ర నాకు అంతా చెప్పింది. ఈ చంటిదాన్ని ఇక్కడే స్కూల్‌లో చేర్పిస్తాను..
పారిజాతం: ఇక్కడ స్కూల్‌లో చదువులు అంటే లక్షల్లో ఉంటుంది.
శివనారాయణ: నీ నెలవారి ఖర్చుల్లో సగం తగ్గిస్తే ఇలాంటి పిల్లలు నలుగురు చదువుకోవచ్చు..
పారిజాతం: మనసులో.. నా నోటి నుంచి మాట ఎప్పుడు వస్తుందా నోరేసుకొని పడిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వీడి సంగతి తర్వాత చెప్తా.
రఘురాం: ఇంక నువ్వు ఊరు వెళ్లే ఆలోచన మానుకొని ఇక్కడే ప్రశాంతంగా ఉండమ్మ. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే కాదు కుటుంబం కూడా ఉంది. ఆలోచించడానికి నిర్ణయం నీకు వదల్లేదమ్మ. నేను తీసుకున్నాను. నువ్వు ఉంటున్నావ్ అంటే..
శివనారాయణ: ఏంటమ్మ ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉందా..
దీప: ఏం లేదు తాతయ్య.. నేను ఇక్కడ ఉండాలి అంటే నా మాటలు కూడా మీరు వినాలి. నేను ఇక్కడ ఏ పని చేయకుండా ఊరికే ఉండలేను.
సుమిత్ర: నిన్ను ఉండమన్నాం కానీ మాకు నచ్చినట్లు ఉండమని చెప్పలేదే. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఏం చేయాలి అనుకుంటున్నావో నీ ఇష్టం. కానీ చేసే ముందు నాతో ఒక్క విషయం చెప్పు చాలు. ఇక్కడ నిన్ను ఎవరూ ఏమీ అనరు..ఏమైనా అంటే నాతో చెప్పు. మాట్లాడవేంటి దీప.
దీప: సరే అమ్మ.
పారిజాతం: మనసులో.. ఇది పోతే ప్రశాంతంగా ఉందామంటే ఆపి నెత్తిన పెట్టారు ఏం జరుగుతుందో ఏంటో.
మరోవైపు మల్లేశ్ అనసూయను హైదరాబాద్‌కు పంపిస్తాడు. ఐదు రూపాయల వడ్డీకి ఐదు వేలు ఇస్తాడు. వారం రోజుల్లో రాకపోతే నీ ఇళ్లు ఉండదని అనసూయకు బెదిరిస్తాడు. అనసూయ బయల్దేరగానే.. మల్లేశ్ నీ ఇంటిని పడగొట్టి వైన్ షాప్ కట్టి తీన్మార్ ఆడుతా.. ఎవడు ఆపుతాడో చూస్తా అంటాడు.
మరోవైపు కార్తీక్, జ్యోత్స్నలు పార్టీకి వస్తారు. జ్యోత్స్న డ్యాన్స్ చేస్తుంది. కార్తీక్ ఓ టెబుల్ దగ్గర కూర్చొంటాడు. దీప గురించి ఆలోచిస్తూ ఇద్దరి పుట్టిన రోజులు ఒకే రోజు కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అనుకుంటాడు. దీప బాధని పంచుకోడానికి ఎవరూ లేరు అని తన తండ్రిని నేనే దూరం చేశానని కార్తీక్ బాధ పడతాడు. దీపకు సాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడాలి అని అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో గతంలో జ్యోత్స్నకి ప్రపోజ్ చేసిన గౌతమ్ వస్తాడు. జ్యోత్స్న రిజెక్ట్ చేసిన మాటలు గుర్తుచేసుకొని కార్తీక్ వైపు కోపంగా చూస్తాడు. ఇక జ్యోత్స్న ఫ్రెండ్ కార్తీక్‌ని నీతో డ్యాన్స్ చేయడానికి పిలువు అని అంటే జ్యోత్స్న తన బావకు ఇలాంటి పార్టీలు అంటే ఇష్టం ఉండదని చెప్తుంది. అది విన్న గౌతమ్ కార్తీక్‌తో ఓ ఆట ఆడుకోవాలి అనుకుంటాడు. జ్యోత్స్న దగ్గరకు వెళ్లి భర్త్‌డే విషెష్ చెప్తాడు.
గౌతమ్: సారీ జ్యోత్స్న నేను వెళ్లిపోతున్నా..
జ్యోత్స్న: ఎందుకు..
గౌతమ్: నువ్వేమో నువ్వు పుట్టకముందే మీ బావతో పెళ్లి అయింది అంటున్నావ్. సారేమో ఈ పార్టీతో ఏ సంబంధం లేదు అన్నట్లు ఎలా కూర్చొన్నాడో చూడు. కనీసం నీ చేయి పట్టుకొని ఓ మూమెంట్ చేసినా నువ్వు చెప్పది నిజం అని మేం నమ్ముతాం.
జ్యోత్స్న: ఓకే నేను ఇప్పుడే ఫ్రూవ్ చేస్తా.. బావ.. బోర్డ్ మీటింగ్‌లో కూర్చొన్నట్లు చేస్తే బోర్ కొడుతుంది రా నాతో వచ్చి డ్యాన్స్ చేయ్.
కార్తీక్: కొత్తగా అడుగుతావేంటి. నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసుకదా.
గౌతమ్: బ్రో పార్టీ అంటే ఇష్టం లేదా.. జ్యోత్స్న అంటే ఇష్టం లేదా.. సారీ జ్యోత్స్న నువ్వంటే మీ బావకు ఇష్టం లేనట్లుంది.
కార్తీక్: మిస్టర్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్.
గౌతమ్: సారీ బాస్. ఆన్సర్ నేను వేరు ఎక్స్‌పెక్ట్ చేశా.. జో నీ అంత ఇదిగా మీ బావ నీ మీదున్న లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం లేదు.
జ్యోత్స్న: బావ గౌతమ్‌కి నిన్ను అడిగే రైట్ లేదు కానీ నువ్వు చెప్పొచ్చు కదా. జ్యో నాకు కాబోయే భార్య అని.. తనంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పొచ్చు కదా.. ఇది గౌతమ్ అభిప్రాయమే కాదు నువ్వు అలా దూరంగా ఉంటే అందరూ అలాగే అనుకుంటున్నారు.
కార్తీక్: నువ్వు నేను ఏంటి అనేది మన పర్సనల్ ఇది నా వ్యక్తిగతం. అందరి ముందు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాల్ వస్తే బయల్దేరుతా అని చెప్పా కదా బయల్దేరుతా.. ఓ మరదలిగా నీ మీద నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. గుర్తుపెట్టుకో.
గౌతమ్: నువ్వేమో ప్రేమ అంటున్నావ్ మీ బావ అభిమానం అంటున్నాడు. సో ప్రేమ లేదన్నమాట. నీకు తప్ప మీ బావ దృష్టిలో నువ్వు ఏంటో అందరికీ తెలుస్తుంది. నీకు మీ బావ ప్రాణం మీ బావకి మాత్రం నువ్వు నత్తింగ్. అంటే.. నీలాంటి డైమండ్‌ని ఇలా వదిలేసి వెళ్లిపోవడం మాకు బాధగా ఉంది. నీకు లేదా..
గౌతమ్ ప్రశ్నలకు జ్యోత్స్న ఫుల్లుగా తాగేస్తుంది. మరోవైపు జ్యోత్స్న రఘురాం మాటలు తలచుకుంటుంది. సౌర్యతో మనం ఇక్కడే ఉంటున్నాం అంటుంది. సౌర్య తనకు ఇక్కడ అందరూ ఉన్నారని ఊరిలో నానమ్మ తప్ప ఎవరూ లేరు అని అంటుంది. ఇక సౌర్య అమ్మా నానమ్మ ఇక్కడికి వస్తుందా అని అడుగుతుంది. దీంతో అనసూయ గురించి ఆలోచిస్తుంది. రెండు రోజుల్లో వస్తాను అని చెప్పి ఐదు రోజులు అయిందని అనసూయ ఏం అనుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప ఖాళీ చేతులతో వెళ్లే కంటే ఇక్కడే ఏదో పని చేసుకొని డబ్బులు తీసుకొని వెళ్లాలని అనుకుంటుంది.
సౌర్య తన తండ్రి ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. నాన్నని వెతకడానికి కార్తీక్ సాయం చేస్తాను అన్నాడని ముగ్గురం కలిసి వెతుకుదామని అంటుంది. ఇక దీప తండ్రి గురించి అడగొద్దని సర్‌ఫ్రైజ్ ఇస్తానని సౌర్య దగ్గర మాట తీసుకుంటుంది. ఇక మనసులో చూశావా సౌర్య నాకు నాన్న లేడు. నీకు ఉన్నా లేనట్లే అని అనుకుంటుంది.
మరోవైపు శ్రీథర్ కాంచనకు పాలు తీసుకొని ఇస్తాడు. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్నని వదిలేసి ఎలా వచ్చావని శ్రీథర్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న పుట్టిన రోజు నాడు కూడా తనని వదిలేసి ఫోన్ కాల్ కోసం వచ్చావ్..కాల్‌కు ఉన్న ప్రాముఖ్యత నా కోడలికి లేదా అని కాంచన ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది