Satyabhama Serial Today Episode చనిపోయిన ఎమ్మెల్యే కొడుకు సతాయిస్తున్నాడని వాడి అడ్డు తొలగించమని మహదేవయ్య క్రిష్‌తో చెప్తాడు. రుద్రని తిట్టినట్లే తిట్టి రుద్రని కాపాడుతాడు మహదేవయ్య. క్రిష్ కోపంగా ఆ రామచంద్ర దగ్గరకు బయల్దేరుతాడు. మామ కుట్ర అర్థమైన సత్య భర్తని ఆపాలని ప్రయత్నిస్తుంది. 


సత్య క్రిష్ బైక్‌కి అడ్డంగా నిల్చొని వెళ్లొద్దని వాళ్లు ఆవేశంగా ఉంటారు వెళ్లొద్దు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటుంది. అందరూ నిన్ను రెచ్చ గొడుతున్నారని నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. నీకు ఏమైనా అయితే నేను బతకలేను అని సత్య ప్రాధేయపడుతుంది. అయినా క్రిష్‌ సత్య మాట వినడు. తనని పిరికివాడిలా మార్చాలని ప్రయత్నిస్తున్నావని తండ్రి మాటే తనకు వేదమని చెప్పి సత్య ఎంత చెప్పినా వినకుండా సత్యని నెట్టేసి వెళ్లిపోతాడు. సత్య చాలా బాధ పడుతూ కోపంగా మామ దగ్గరకు వెళ్తుంది.


మహదేవయ్య: ఏం కావాలమ్మా.
సత్య: బయటకు వెళ్లిన క్రిష్ వెంటనే ఇంటికి రావాలి ఫోన్ చేసి చెప్పండి. క్రిష్ గొడవలకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పినా వినలేదు నా మాట వినడం లేదు. మీరు చెప్తే వింటాడు చెప్పండి.
మహదేవయ్య: ఈ ఇంట్లో మగవాళ్లు ఏం చేయాలో అది చేస్తారు. ఆడవాళ్ల పని చూస్తూ ఉండటమే సలహాలు ఇవ్వడం కాదు. 
సత్య: క్రిష్ నా భర్త నాకు అన్నీ హక్కులు ఉన్నాయి. 
మహదేవయ్య: ముందు వాడు నాకు కొడుకు తర్వాతే నీకు భర్త. వాడి మీద నా హక్కులు నువ్వు గుంజుకోలేవు. ఎక్కువ హైరానా పడకు వంటింట్లో పనులు చూసుకో.
సత్య: క్రిష్ వెంటనే రావాలి. ఆ ఎమ్మెల్యే కొడుకు ఎంత డేంజరో మీకు తెలుసు అయినా క్రిష్‌ని పంపారు.
మహదేవయ్య: క్రిష్ వాడికంటే డేంజర్ ఏం కాదు హాయిగా ముసుగు వేసుకొని పడుకో. 
సత్య: ఏమైనా అయితే. ఏంటి అలా చూస్తున్నారు. దులిపేసుకుంటారు అంతే కదా. పోతే పోయాడని వదిలేస్తారు అంతే కదా. 
మహదేవయ్య: పిచ్చిదానిలా మాట్లాడకు వాడు అంటే నాకు ప్రేమ ఉంది వాడు నా కొడుకు ఏమనుకుంటున్నావ్.
సత్య: అలాగా ఏ కన్న తండ్రి రక్తం పంచుకొని పుట్టిన కొడుకిని చేజేతుల చంపుకోవాలి అని చూడరు మీరు ఆ పని చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి. కొడుకు ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు అంటే ఏమనుకోవాలి. చెప్పండి మహదేవయ్య గారు నోరు విప్పండి. క్రిష్ మీ కొడుకు కాదన్నట్లే కదా. మీ రక్తం పంచుకొని పుట్టలేదనే కదా.
మహదేవయ్య: దెయ్యం పట్టిందా ఏం మాట్లాడుతున్నావ్ చిన్నా నా కొడుకే. నా కొడుకే.
సత్య: కాదు మీ కొడుకు కాదు. మీ కన్న కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడ బయట గొడవలకు వెళ్తే ప్రమాదంలో పడతాడో అని దాచి పెట్టారు.
మహదేవయ్య: ఏయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడకు. 
సత్య: మీరు బావగారు వినడం నేను విన్నాను దబాయించకండి. మహదేవయ్య గారు వేసుకున్న ముసుగు తీసేసి నిజం ఒప్పుకోండి. మీ కొడుకు కాని కొడుకుని స్వార్థం కోసం వాడుకుంటున్నానని పైకి చెప్పండి. క్రిష్ ప్రాణాలు అడ్డం పెట్టుకొని బతుకుతున్నా అని పది మంది ముందు బయట పెట్టడండి. మహదేవయ్య గారు అలా ఒప్పుకోనే ధైర్యం ఉందా.
మహదేవయ్య: నోర్ముయ్ నిజం తెలిసిపోయిందని అరవకు. ఇక్కడికి ఇక్కడ నిన్ను చంపే దమ్ముంది. గొంతు నొక్కితే నీతోనే ఆ నిజం నీతోనే చచ్చిపోతుంది. కానీ ఆ పని చేయను ఎందుకో తెలుసా నువ్వు రబ్బరు పామువి. బుసకొట్టడానికి పనికి రావు. ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పు కోడలు కాని కోడలా. నీ మొగుడు నా కొడుకు కాదని నిజం తెలిసి పోయింది కదా ఏం చేస్తావ్ ఏం చేయగలవు. ఈ నిజం వాడికి చెప్తావా చెప్తే నమ్ముతాడా. నా పీక పిసికేస్తాడని అనుకుంటావా.
సత్య: అలాంటి ప్రమాదం లేకుండా తనని మీ మీద గుడ్డి ప్రేమ పెంచుకునేలా చేశారు కదా. 
మహదేవయ్య: చదువు లేని నీ మొగుడు ఎవరి మీద అయినా గెలుస్తాడు. నా మీద తప్ప నేను గెలవనివ్వను.  చచ్చే దాక గెలవనివ్వను.
సత్య: నేను గెలిపిస్తా దగ్గరుండి గెలిపిస్తా.. 
మహదేవయ్య: పెద్దగా నవ్వుతాడు. బతికినంత కాలం నువ్వు నీ మొగుడు నా దగ్గర బానిసలా బతకాలి ఇది గుర్తుపెట్టుకో. 
సత్య: తొందర్లోనే క్రిష్‌ని మీ చేతి నుంచి లాగేసుకుంటాను. మీ మాయ నుంచి బయట పడేస్తాను. మీ అసలు స్వరూపం సాక్ష్యాలతో సహా చూపిస్తాను.
మహదేవయ్య: ఏయ్ నీ వల్లకాదు.
సత్య: చేసి చూపిస్తా మామయ్య. 
మహదేవయ్య: వాడు నా బుట్టలో పాము. 
సత్య: మిమల్నే కాటేసేలా చేస్తాను. మీరు క్రిష్‌కి ఎక్కవ కావొచ్చు కానీ నేను తక్కువ కాదు. క్రిష్‌తో మీకు పేగు బంధం లేదు నాకు తాళి బంధం. ఆఫ్ట్రాల్ మీరెంత.
మహదేవయ్య: సత్యా...
సత్య: మీరు అరిస్తే భయపడే రోజులు పోయావి మహదేవయ్య గారు. ఇప్పుడు మీ ముందు ఉంది మీ కోడలు కాదు. మీ కోడలు కాని కోడలు. భర్త కోసం ఎంత కైనా తెగించడానికి సిద్ధపడిని సత్యభామ. ఆడది ఎదురు తిరిగితే పంచభూతాలు కూడా తోడుంటాయి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి మహదేవయ్య గారు.
మహదేవయ్య: అదీ చూద్దాం.
సత్య: చూద్దాం. 


మైత్రి పాటలు పాడుతూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. హర్ష వచ్చి మైత్రిని అలా చూసి చాలా సంతోషిస్తాడు. ముగ్గు చాలా బాగుందని పొగుడుతాడు. మైత్రి, హర్ష ఇద్దరూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. తన భార్య నందినికి ఏం రాదని నీకు అన్నీ వచ్చని పొగుడుతాడు. హర్ష మాటలు విన్న నందికి కోపంతో ముగ్గు మీద బకెట్‌తో నీరు పోసేస్తుంది. హర్ష, మైత్రి షాక్ అయిపోతారు. హర్ష నందినిని తిడతాడు. ఏం అనొద్దని మైత్రి అంటుంది. నేను అంటే నీకు ఇష్టం లేకపోతే నాతో డైరెక్ట్‌గా చెప్పు కానీ ఇలా వేరే వాళ్ల ముందు కంపైర్ చేసుకోవద్దని నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నావని నేను చేసుకోలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మాస్టర్ ప్లాన్‌తో విద్యాదేవికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీత.. మహాకి దెబ్బ మీద దెబ్బ!