Trinayani Serial Today Episode నయని తన భర్త విశాల్, గాయత్రీ పాపల్ని కావిడలో మోసుకొని వెళ్తుంటుంది. అతి కష్టం మీద ఇద్దరినీ మోస్తుంటుంది. చిలుక శివ కూడా నయని వెంట వస్తుంది. మణికాంత గిరిలోని మానసాదేవి ఆలయానికి చేరుకుంటారు. ఆ అగ్గి నది, గుడిని చూసి విశాల్ షాక్ అయిపోతాడు. నయని ముందు గజగండ ప్రత్యక్షమవుతాడు. 


గజగండ: మీరు ఎలా అయినా ఇక్కడికి వస్తారని నాకు తెలుసు నయని.
నయని: నువ్వు ఇక్కడికి రావడం కూడా మంచిదే అయింది. పంచకమణిని ఇచ్చేస్తే గుడిలో పెట్టేస్తా.  
గజగండ: నేను అంత అమాయకుడిని కాదు నయని.
విశాల్: గజగండ నువ్వు చేసింది మోసం. పంచకమణిని తిరిగి ఇచ్చేయ్. నిన్ను క్షమించమని అమ్మవారిని కోరుకుంటామని.
గజగండ: అంతే కానీ మీరు లోపలికి వెళ్లి భుజంగమణి ఇస్తానని నాకు చెప్పడం లేదు.
చిలుక: వీడు ఎవరో పిచ్చొడిలా ఉన్నాడే.
నయని: పిచ్చోడే అమ్మవారి ముందు బలి అవ్వడానికి వచ్చాడు.
గజగండ: నీ భర్తకి బాగైతే నా సంగతి తేల్చవచ్చని అనుకుంటున్నావేమో పంచకమణిని ఇవ్వను. నువ్వు భుజంగ మణి తీసుకురావడానికి కూడా అనుమతి ఇవ్వను అని అగ్ని నది దారిని తన మంత్ర శక్తితో కూల్చేస్తాడు. నయని, విశాల్ షాక్ అయిపోతారు. 



అమ్మవారి దగ్గరకు వెళ్లడానికి దారి లేకపోవడంతో నయని ఏడుస్తుంది. గజగండ పెద్దగా నవ్వుతూ వంతెన కూలిపోయిందని ఇంక ఎలా వెళ్తావని అంటాడు. 


గజగండ: రే చుక్క రాబోతుంది. అగ్నికీలలు చల్లబడినా సరే నువ్వు అవతలకి ఎలా వెళ్లగలవు నయని.
విశాల్: నయని పున్నమి వెన్నెల వస్తుంది.  
నయని: నది చల్లపడినా వంతెన లేకుండా అవతలకి ఎలా వెళ్తాం బాబుగారు.
గజగండ: 21 నిమిషాలు మాత్రమే సమయం ఈ లోపు లోపలకి వెళ్లి భుజంగమణి తీసుకురాకపోతే మళ్లీ పౌర్ణమి వరకు ఆగాలి. కానీ ఎన్ని పున్నమిలు వచ్చానా దాటడానికి వంతెన రాదు. 


గజగండ పెద్ద పెద్దగా నవ్వుతాడు. ఇంతలో అమ్మవారి గుడి  నుంచి ఓ పెద్ద పాము అమ్మవారి గుడిని చుట్టి బయట ఉంటుంది. చిలుక శివ భయపడి వెళ్లిపోతుంది.. గజగండ కూడా ఆ పాముని చూసి భయంతో పారిపోతాడు. విశాల్ వెళ్లిపోదాం అంటే నయని మాత్రం వద్దని అంటుంది. పాము మనవైపే వస్తుందని విశాల్ అంటాడు. చూడటానికి భయంకరంగా ఉన్న ఆ పాము నయని ముందు పడగ పెట్టడంతో నయని ఆ పాముని వేడుకుంటుంది. తన బిడ్డ, భర్తలను శిక్షించొద్దని తనని మాత్రమే బలి తీసుకోమని అంటుంది. నీతో పాటే నేను చనిపోతా అని విశాల్ అంటాడు. ఇక నయని తనని పాము బలి తీసుకుంటే పాపని తీసుకొని మీరు ఇంటికి వెళ్లిపోమని అంటుంది. నయని మొక్కకోవడంతో నయని అఖండ పాము మనకి ఏం చేయడం లేదని వంతెనలా మనకోసం మారిందని అంటుంది. ఇక నయని విశాల్ పాపలని కావిడలో కూర్చొపెట్టుకొని పాము మీద నడుచుకుంటూ గడిలోకి వెళ్తుంది.


సీన్ కట్ చేస్తే తిలోత్తమ మెట్ల మీద దెయ్యంలా కూర్చొని ఉంటుంది. వల్లభ భయపడతాడు. తిలోత్తమ మాత్రం తనకు ప్రశాంతంగా ఉందని నయని లేకపోవడం వల్ల చాలా హ్యాపీగా ఉందని అంటుంది. నయని రాకపోతే నీకు హ్యాపీ కదా అని అంటే నయని భుజంగ మని తెస్తే మనం లాగేసుకోవాలని అంటుంది. నయని మానసాదేవి ఆలయానికి చేరుకుని ఉంటుందని గజగండ కూడా వెళ్లే ఉంటాడని అంటుంది. ఇద్దరి మధ్య యుద్ధం జరిగి ఎవరో ఒక్కరే మిగులుతారని మిగిలిన వారిని మనం చంపేసి గట్టిగా సంపాదించాలని అంటుంది తిలోత్తమ. 


నయని వాళ్లు మానసాదేవి ఆలయానికి చేరుకుంటారు. మానసాదేవిని చూసి విశాల్ పులకరించిపోతాడు. ఇక అక్కడ ఉన్న నీటి దీపం చూసి ఏంటి తల్లి ఇలా నీటి దీపం కొండెక్కేలా ఉందని అని అడుగుతుంది. దాంతో గుడి నుంచి వాయిస్ వినిపిస్తుంది. నయని పంచకమణి నువ్వు తీసుకెళ్లి సద్వినియోగం చేయకుండా దుర్మార్గుల చేతిలోకి వెళ్లడం వల్ల నీటి దీపం తేజస్సు తగ్గిపోతుందని వినిపిస్తుంది. మళ్లీ నీటి దీపం వెలిగేలా చేయాలి అప్పుడే నీకు భుజంగ మణి దక్కుతుందని వినిపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని బలిపశువుని చేస్తున్న మహదేవయ్య.. భర్త కోసం రుజువుల వేటలో సత్య!