Brahmamudi Serial Today Episode:  శ్రీకాంత్‌ వాళ్ల వచ్చి తన శ్రీకాంత్‌కు స్వరాజ్‌ కంపెనీలో జరిగిన అవమానం గురించి, అవమానం చేసిన రాహుల్‌ గురించి చెప్తాడు. బిజినెస్‌ లన్నీ తన మనవడే చూసుకుంటున్నాడని.. ఇక మీ కంపెనీతో బిజినెస్‌ చెయ్యనని చెప్పాడని మనిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల నేను వచ్చి నీకు చెప్తున్నానని లేదంటే నేను రావాల్సిన అవసరం ఉండేది కాదని చెప్తాడు. దీంతో సీతారామయ్య తన ఫ్రెండ్ కు థాంక్స్‌ చెప్తాడు. మాకు తెలియకుండా ఆఫీసులో ఏం జరుగుతుందో నీ వల్లే తెలిసింది అంటాడు. తర్వాత ఆయన వెళ్లిపోతాడు. అందరూ రాహుల్‌ ను కోపంగా చూస్తుంటారు.


రుద్రాణి: అసలు నీకు బుద్ది ఉందా? రాహుల్‌. నిన్ను నమ్మి కంపెనీని అప్పగిస్తే నువ్వు ఇలాగేనా చేసేది. క్లయింట్స్‌ తో ఎలా మాట్లాడాలో తెలియదా?


రాహుల్‌: మమ్మీ ఒకసారి నేను చెప్పేది కొంచెం విను.


రుద్రాణి: ఇంకా ఏంట్లా నువ్వు చెప్పేది నేను వినేది. నీవల్ల ఎంత నష్టం జరిగిందో చూశావా?


ఇందిరాదేవి: మీ డ్రామాలు ఆపుతారా? నీ కొడకు చేసిన పనికి మేమందరం ఎక్కడ తిడతామో అని ముందే నువ్వు తిట్టేసి మా నుండి వాణ్ని కాపాడాలని చూస్తున్నావా?


రుద్రాణి: అదేంటమ్మా అలా అంటావు. కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా? నిజంగానే వాడు తప్పు చేశాడు కాబట్టే తిడుతున్నాను.


స్వప్న: తప్పు చేసిన ప్రతిసారి మీరు ఇలా తిడుతూ దారిలో పెట్టి ఉంటే ఈరోజు ఇలా తయారయ్యే వాడే కాదు.


అపర్ణ: తిట్టడానికి, తిడుతున్నట్లు నటించడానికి తేడా తెలుసుకోలేనంత చిన్న పిల్లలు ఎవరూ లేరిక్కడ.


రుద్రాణి: సరే వదిన నేను నటిస్తున్నాను అనుకుందాం. కానీ నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి.


సుభాష్‌: శిక్ష వేసినంత మాత్రానా జరిగిన నష్టాన్ని పూడ్చలేము కదా..?


సీతారామయ్యా: సుభాష్‌ నువ్వు ఇప్పుడు మా స్నేహితుడు వచ్చి చెప్పాడు కాబట్టి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. అసలు ఇలా మన కంటికి కనిపించకుండా ఎంత నష్టం జరిగిందో ఎంతమంది వెళ్లిపోయారో.. వెళ్లిపోవాలనుకుంటున్నారో అంచనా వేయగలవా?


సుభాష్‌: నేను తెలుసుకుంటాను నాన్నా..


సీతారామయ్య: తప్పు చేశానురా ఆరోజు కావ్య వద్దు అంటున్నా రాజ్‌ ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి చాలా పెద్ద తప్పు చేశానురా..? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆరోజు కావ్య నన్ను హెచ్చరించింది. రాజ్‌ ఇక నువ్వే కంపెనీ బాధ్యతలు తీసుకో..


రాజ్‌: లేదు తాతయ్యా.. నేను చూసుకోలేను..


సుభాష్‌: ఎందుకు చూసుకోలేవు.. రాజ్‌.


రాజ్‌: నేను కళ్యాణ్‌ ను తీసుకొచ్చే వరకు ఆఫీసుకు వెళ్లలనని పిన్నికి మాటిచ్చాను.


ధాన్యలక్ష్మీ: ఈ పరిస్థితుల్లో రాజ్ ఆఫీసుకు వెళ్లడం నాకేమీ అభ్యంతరం లేదు. కానీ కళ్యాణ్‌ ను తీసుకువచ్చే బాధ్యత కూడా తనపై ఉందని గుర్తు పెట్టుకుంటే సరి.


 అంటుంది. దీంతో అందరూ రాజ్‌ ను ఆఫీసుకు వెళ్లేందుకు ఒప్పిస్తారు. రాజ్‌ సరే అంటాడు. మరోవైపు స్వప్న, కనకానికి ఫోన్‌ చేసి ఇంట్లో జరిగింది మొత్తం చెప్తుంది. దీంతో సంతోషంగా కనకం అదే విషయం కావ్యకు చెప్పబోతుంటే.. తనకు ఏమీ చెప్పొ్ద్దని అంటుంది. దీంతో కనకం నీకెందుకు చెప్తున్నాను మా ఆయనకు చెప్తున్నాను అంటుంది. జరిగింది మొత్తం చెప్పాక. కావ్య నేను ఆరోజే చెప్పాను. ఆయనకు మంచి చెప్పేవాళ్లంటేనే నచ్చదు అంటుంది. మరోవైపు రుద్రాణిపై రాహుల్‌ కోపంగా ఉంటాడు.


రుద్రాణి: ఏంట్రా ఇందాక అలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అది కాదురా ఒకసారి నేను చెప్పేది విను.


రాహుల్‌: అసలు నువ్వు నాతో మాట్లాడకు.


రుద్రాణి: ఇందాక అలా అరచినందుకు సారీ.


రాహుల్‌: అందరి ముందు అరిచేసి ఇప్పుడు వచ్చి సారీ చెబితే సరిపోతుందా? నీ స్వార్థం కోసం ఆఖరికి కోడుకుని కూడా బలి చేసేస్తావా?


రుద్రాణి: ( రాహుల్‌ చెంప మీద కొడుతుంది) ఇప్పుడు వింటావా? నేను కనక అలా మాట్లాడి ఉండకపోతే ఇంట్లో అందరూ కలిసి నువ్వు చేసిన పనికి చీవాట్లు పెట్టేవారు. అలా జరగకూడదనే ఇలా చేశాను.


అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే స్వప్న వచ్చి ఇద్దరిని తిట్టి వెళ్లిపోతుంది. రుద్రాణి కూడా నువ్వు ఇలా చీఫ్‌గా ఆలోచించకుండా ఉండు అంటూ గడ్డి పెట్టి పోతుంది. మరోవైపు అప్పు జాబ్‌ కోసం ప్రిపేర్‌ అవుతుంటే కళ్యాణ్‌ అప్పుడే అప్పు పోలీస్‌ అయినట్లు కలల కంటుంటాడు. తర్వాత అప్పును ఇంట్లో ఉండి చదువుకోవడం కన్నా కోచింగ్‌ సెంటర్ లో జాయిన్‌ కామని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?