Satyabhama Serial Today Episode మహాదేవయ్య ఇంట్లో అందరూ రేణుక సీమంతం కోసం చీరలు సెలక్ట్ చేస్తుంటారు. క్రిష్‌కి బిడ్డ పుడితే ఆ బిడ్డ కూడా మహదేవయ్య వారసుడు అవుతాడా? ఆ బిడ్డకు తాత ఆస్తిలో వాటా ఉంటుందా? అని సత్య అడుగుతుంది. ఆలూ లేదు సూలు లేదు అప్పుడే ఆస్తిలో వాటా గురించి ఎందుకు అని అంటుంది భైరవి. దానికి జయమ్మ సరదాగా అడిగిందిలే అని అంటుంది.


జయమ్మ: అయినా తాత ఆస్తిలో మనవడికి మనవరాలికి అందరికీ సమానమైన వాటా ఉంటుంది. 
భైరవి: ఆస్తి గురించి తర్వాత ముందు అయితే వారసుడిని కను.
సత్య: అయ్యోరామ ఆస్తి గురించి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు. నేను అన్న ఆస్తి డబ్బు, భూములు కదా తాత గారి సంతోషం. సంతోషానికి మించిన ఆస్తి ఏముంటుంది. నేను అడిగింది చిన్న కొడుకుకి వచ్చిన వారసుడికి కూడా తాతయ్య సంతోషంలో వాటా ఉంటుందా అని అడిగాను అంతే మామయ్య గారు.
భైరవి: గాని సంతోషంలో వాటా ఎందుకు ఉండదే. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసినప్పుడు మీ మామ ఎంతగానం డ్యాన్స్ చేశాడో తెల్వదా నీకు. అందరి వారసులు మీ మామయ్యకు సమానమే అందులో ఏ తేడా ఉండదు.
సత్య: చిన్న కొడుకు వారసుడు కూడా త్వరలోనే వస్తాడు. అప్పుడు ఆ వారసుడి వల్ల తాతయ్య డ్యాన్స్ చేసేలా చేస్తా. తాతయ్య మీసాలు పట్టుకొని ఉయ్యాలూగేలా చేస్తా. 
మహదేవయ్య: ఈ తాత మామూలోడు కాదు దేనికైనా రెడీ. ఆట ఆడటానికి అయినా ఆడించడానికైనా రెడీ.


మైత్రిని తీసుకొని హర్ష సంగీత దగ్గరకు వెళ్తాడు. మైత్రి ఒక్కర్తినే ఎక్కడికీ పంపకు నేను రిటర్న్‌లో వచ్చి తీసుకెళ్తా ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయ్ అని హర్ష సంగీతకు చెప్పి వెళ్లిపోతాడు. హర్ష వెళ్లిపోయిన తర్వాత మైత్రి, సంగీత పెద్దగా నవ్వుకుంటారు. పాపం పిచ్చోడే అని సంగీత అంటే మైత్రి సంగీత మీద ఫైర్ అవుతుంది. నా హర్షని ఏమైనా అంటే చంపేస్తా అంటుంది. చూస్తే మైత్రి విలన్‌లా మారిపోతుంది.


సంగీత: అబ్బో ప్రేమే.
మైత్రి: కాదా మరి దేవుడు నా విషయంలో చేసిన మొదటి మోసం హర్షని నాకు దూరం చేయడం. పెళ్లి వరకు వచ్చిన మా ప్రేమను బలి చేయడం. నేను ఉండాల్సిన స్థానంలో నందిని ఉంది. దేవుడు చేసిన రెండో మోసం నా తల్లిదండ్రుల్నినాకు శాశ్వతంగా దూరం చేయడం. నన్ను అనాథని చేసి తమాషా చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో నన్ను మా అమ్మానాన్నల తర్వాత అంతలా అమితంగా ప్రేమించింది హర్ష మాత్రమే. చనిపోయిన అమ్మానాన్నల్ని ఎలాగూ తెచ్చుకోలేను అందుకే హర్షని తిరిగి పొందాలి అనుకుంటున్నా. హర్షతో జీవితం పంచుకోవాలి అనుకుంటున్నా. నా ప్రేమను గెలిపించుకోవాలి అనుకుంటున్నా. 
సంగీత: నువ్వు అనుకుంటున్నావ్ సరే అది సాధ్యమయ్యే పని ఏనా?
మైత్రి: నేను బతికుండాలి అంటే నేను అనుకున్నది సాధించిన వరకు వదిలి పెట్టను. ప్లాన్ ప్రకారమే హర్ష ఇంట్లో తిష్ట వేషాను. అని మొత్తం తనతో క్లోజ్‌గా ఉన్నది అంతా జరిగింది అంతా చెప్తుంది. మా ఇంటిని అమ్మేస్తా మంచి బ్రోకర్‌ని చూడు. నేను ఎవర్నీ మోసం చేయడం లేదు నా నుంచి పోయిన ప్రేమని  మళ్లీ పొందాలి అనుకుంటున్నా అంతే. 


రాత్రి క్రిష్, బాబీలు ముసుగు వేసుకొని హాస్టల్ దగ్గరకు వస్తారు. వాచ్ మెన్ చూడకుండా గోడ దూకుతారు. అక్కడ ఓ అమ్మాయి తన లవర్‌తో మాట్లాడుతుంటే వీళ్లతో మాట్లాడుతుందని భయపడిపోతారు. మెల్లగా ఎవరూ చూడకుండా సత్య ఫ్రెండ్ గది నెంబరు తెలుసుకోవడానికి ఆమె కోసం వెతుకుతారు. క్రిష్ వాళ్లు సౌండ్ చేయడంతో ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి  ఎవరో వచ్చారనుకొని సెక్యూరిటీకి చెప్తుంది. క్రిష్‌, బాబీలు హాస్టల్‌లోని అన్ని గదులు వెతుకుతూ ఆ అమ్మాయిని వెతుకుతారు. సెక్యూరిటీ రావడంతో దొరికితే అయిపోతామని ఇద్దరూ పరుగులు తీస్తారు. ఇంతలో క్రిష్‌ ఆ అమ్మాయిని ఢీ కొడతాడు. దాంతో ఒకర్ని ఒకరు చూసుకొని అరుస్తారు. ఇక ఆ అమ్మాయి గది నెంబరు 20 అని క్రిష్‌చూసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. మరోవైపు రేణుక సీమంతం చీర తన ఒంటి మీద వేసుకొని మురిసి పోతుంది. సత్య వచ్చి చాలా బాగుంది అక్క అని అంటుంది. 


సత్య: అక్క ఈ చీరతో వచ్చే అందం కంటే నీ ముఖంలో సంతోషంతో వచ్చే అందమే ఎక్కువ ఉంది.
రేణుక: ఈ సంతోషం వెనక ఎన్నో ఏళ్లు నేను నరకం అనుభవించాల్సి వచ్చింది. చావుకి దగ్గరగా వెళ్లాల్సి వచ్చింది. 
సత్య: అక్క ఇప్పుడు అవి ఎందుకు నేను పక్కనుండగా నీకు కష్టాలు రానివ్వను. 
రేణుక: కడుపులో బిడ్డని చంపాలని ప్రయత్నించిన నా మొగుడు ఇప్పుడు సీమంతానికి చీర కొని పెట్టే అంత మారిపోయాడు అంటే ఇంకేం కావాలి చెప్పు.
సత్య: ఒప్పుకుంటా కానీ నీకు మర్యాద ఇవ్వాలి. 
రేణుక: అమ్మ అని పిలిపించుకోవడానికి నాకు బిడ్డని ఇస్తున్నాడు అది చాలులే సత్య. సత్య నా కాన్పునకు నీకు పక్కనే ఉంటావా. పుట్టింటి వాళ్లు ఎలాగూ రారు నువ్వే నాకు అమ్మ అయినా చెల్లి అయినా
సత్య: ఈ ఇంట్లో నీ పరిస్థితి నాకు తెలుసు. నేను నీకు అన్నింటిలో తోడు ఉంటాను.
రేణుక: నీకు ఓ విషయం చెప్తా ఏం అనుకోవద్దు. నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించుకో సత్య. అత్తామామలకు కోపం తెప్పించి కాపురం పాడు చేసుకోవద్దు.
సత్య: యుద్దం చేయక తప్పని పరిస్థితి అక్క.
రేణుక: నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది సత్య. ఈ లొల్లి అంతా పక్కన పెట్టు ఈ రోజు నీ శోభనం కదా. అరణ్యంలో పెరిగిన క్రిష్‌కి నీ లాంటి భార్య దొరకడం క్రిష్ అదృష్టం నీకు అంతా మంచే జరగాలి చెల్లి.


రాత్రి నందిని హర్ష కోసం హాల్‌లో ఎదురు చూస్తూ ఉంటుంది. హర్ష వస్తాడులే అని అత్తామామలు అంటే తాను మైత్రి కోసం ఎదురు చూస్తున్నానని ఆడపిల్ల కదా ఈ రాత్రి వరకు రాకపోతే ఎలా అని అంటుంది. ఇంతలో మైత్రి, హర్ష ఇద్దరూ బైక్ మీద రావడం నందిని చూసి కోపంతో రగిలిపోతుంది. మైత్రి గదిలోకి వెళ్తుంటే ఆపి హర్షతో నువ్వు ఆఫీస్‌కి వెళ్లావా తనతో చట్టాపట్టాలు వేసుకోవడానికి వెళ్లావా అని అడుగుతుంది. దాంతో మైత్రి మనసులో ఇలాగే ఇది రెచ్చిపోతే హర్షని నా సొంతం చేసుకోవడానికి ఎన్నో రోజులు పట్టదని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన గాయత్రీదేవి, గాయత్రీ పాప.. ఇదెలా సాధ్యం?