Satyabhama Serial Today February 5th: సత్యభామ సీరియల్: సంజయ్ ఫోన్ చెక్ చేసిన సంధ్యకి నిజం తెలిసిందా.. అక్కాచెల్లెళ్ల మధ్య అఘాతం!

Satyabhama Today Episode సంధ్యని భైరవి తన గ్రిప్‌లో పెట్టుకోవాలని నగలు ఆశ చూపించి అతి ప్రేమ నటించి సత్య మీదకు సంధ్యని కయ్యానికి సిద్ధం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Satyabhama Serial Today Episode భైరవి సంధ్యని పిలిచి నగలు వేస్తుంది. ఇప్పుడు నాకెందుకు అత్తయ్యా అని సంధ్య అడిగితే ఆడది ఇలా అనకూడదు ఎంత అయినా నగలు కావాలి అని అడగాలి అని అంగరంగ వైభవంగా జరగాల్సిన మీ పెళ్లి పక్కన ఎవరూ లేకుండా జరిగిందని ఈ ముచ్చట అయినా తీర్చుకోనివ్వు అని చెప్తుంది. 

Continues below advertisement

సంధ్య: ప్రేమించాల్సిన అక్క నన్ను దూరం పెట్టింది. ద్వేషించాల్సిన మీరు నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు.
భైరవి: అయ్యో పిచ్చి తల్లి దా అని హగ్ చేసుకుంటుంది. అప్పుడే వచ్చిన సత్యని చూసి కన్న కొడుతుంది. జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు.
సంధ్య: ఇంత మంచి వారైన మిమల్ని మా అక్క ఎందుకు ద్వేషిస్తుంది.
భైరవి: అదంతా నా ఖర్మ అమ్మ.  
సత్య: ఏంటి అత్తయ్యా మళ్లీ నగల డ్రామా మొదలు పెట్టారా. అప్పట్లో నన్ను బుట్టలో వేసుకోవడానికి ఇవే నగలు చూపించి మాయ చేయబోయారు. నేను పడలేదు. ఇప్పుడు సంధ్య విషయంలో అదే చేస్తున్నారా.
భైరవి: మాయ ఏంటి సత్య నేను ప్రేమతో పెడుతున్నా. నీ అత్తని నేను కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు సత్య. అయినా నీ చెల్లి చూస్తుంది కదా అంతా ఏం జరుగుతుందో తనకు తెలుకు కదా.
సత్య: సంధ్య మెడలో ఆ నగలు తీసి అక్కడ పెట్టిరా. నీకే చెప్పేది.
సంధ్య: నేను ఉంచేసుకుంటాను అక్క. అత్తయ్య ప్రేమని గౌరవిస్తున్నా.
భైరవి: నీ చెల్లిని చూసు నేర్చుకో సత్య అత్తని ఎలా గౌరవించాలో. ఈ ఇంట్లో నిన్ను ఎవరు బెదిరించిన నీకు నేను ఉన్నా సంధ్య.
సంధ్య: నాకు అత్తయ్యకు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్. నన్ను ఒంటరిదాన్ని చేయాలి అనా.
సత్య: ఆల్రెడీ నువ్వు ఈ ఇంట్లో ఒంటరి దానివి. సంజయ్ మంచోడు కాదు ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాడు. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు. తను తిరిగిన అమ్మాయిల ఫొటోలు వీడియోలు కూడా నాకు చూపించాడు. 

సంజయ్ సత్యకి గతంలో ఫొటోలు చూపించి సంధ్యని ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాను అని చెప్పాడని చెప్తుంది. సంధ్య ఎంతకీ నమ్మకపోవడంతో సంజయ్ ఫోన్ చెక్ చేయమని చెప్తుంది. ఒకవేళ అందులో ఏం లేకపోతే సంజయ్‌కి సారీ చెప్పాలని అంటుంది. సత్య సరే అంటుంది. బయట సంజయ్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే సంధ్య ఫోన్ తీసుకుంటుంది. చెక్ చేస్తా అంటే సంజయ్ వద్దని నీ ఫోన్ నేను ఎప్పుడూ చెక్ చేయలేదు అని అంటే సంధ్య తన ఫోన్ సంజయ్ చేతిలో పెట్టి నా ఫోన్ చూసుకో నీ ఫోన్ నేను వెరిఫై చేస్తానని అంటుంది. సంజయ్ చాలా టెన్షన్ పడతాడు. సంధ్య మొత్తం చెక్ చేసి అందులో ఏం లేకపోవడంతో సత్య చేతిలో పెట్టి ఇదిగో నువ్వు కూడా చెక్ చేయ్ అని ఇస్తుంది. సత్య మొత్తం చెక్ చేసి షాక్ అయిపోతుంది. సత్య సంజయ్‌ని ప్రశ్నించడంతో అవ్వా అవ్వా ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి సత్య అని ఈమె నా క్యారెక్టర్ డ్యామేజ్ చేస్తుందని సంజయ్ అంటాడు. సంధ్య అక్క మీద అరుస్తుంది. నింద వేసినందుకు సంజయ్‌కి సారీ చెప్పమని అంటుంది. సంజయ్ వద్దని అంటే భర్తని చూపించి అదీ సంస్కారం అంటే అని చెప్పి సంధ్య వెళ్లిపోతుంది. సంజయ్ సత్య చుట్టూ తిరిగి డ్యాన్స్ వేస్తూ అసలైన కథ ముందుందని అంటాడు. 
 
ఇక సంధ్య భైరవికి నెయిల్ పాలీష్ పెడుతుంది. భైరవి ఎమోషనల్ అయినట్లు నటిస్తుంది. మీరు నన్ను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నా ముందు సత్య చెల్లివి అని అనుమానం ఉంది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అంటుంది. ఇక సంధ్య తన ముద్దు ముచ్చటగా గురించి పట్టించుకోమని అంటే భైరవి సంధ్యకి ముద్దు పెట్టి సరిపోతుందా ఇంకా పెట్టాలా అని అడుగుతుంది.  దాంతో సంధ్య నేను ఫస్ట్‌నైట్ గురించి అడుగుతున్నా అని అంటుంది. భైరవి వెటకారంగా సంధ్యని చూస్తుంది. తర్వాత ఈ రోజు రాత్రికే కార్యం అని అంటుంది. మా అక్క ఏర్పాట్లు చేస్తుందా అని అంటే సత్య చేయదు అని సత్య మీద చాడీలు చెప్తుంది. సంధ్య సత్యతో పుట్టింటిని నాకు దూరం చేశావ్ ఇప్పుడు నా వెనక తిరగడం మానేసి పనికొచ్చిన పని చేయ్ అక్క అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!

Continues below advertisement