Ennallo Vechina Hrudayam Serial Today Episode జాతరలో బాల మీద అటాక్ చేయడానికి రౌడీలు పులి వేషంలో రావడం అది చూసిన త్రిపుర బాలని తప్పించడంతో త్రిపురకు గాయం అవుతుంది. త్రిపుర పులి వేషంలో ఉన్న మనిషిని ఫాలో అవుతుంది. ఆ రౌడీ పారిపోయి తప్పించుకుంటాడు. ఇక అనంత్, గాయత్రీ ఇద్దరూ అక్క, అన్నల గురించి మొక్కుకుంటారు.
ఇక త్రిపుర బాలని పట్టుకొని వివరాలు అడుగుతుంది. అయినా బాల చెప్పడు. ఇక త్రిపురతో బాల చనువుగా ఉండటం త్రిపుర చేయి పట్టుకోవడం అక్కడే ఉన్న గిరి చూస్తాడు. వదిన చేయి పట్టుకున్నాడని రౌడీలు గిరిని రెచ్చగొడతారు. గిరి ఆవేశంగా బాల దగ్గరకు వెళ్లి ఎవరి చేయి పట్టుకున్నావో తెలుసా అంటే.. తెలుసు నా సుందరి చేయి పట్టుకున్నా అని చెప్తాడు. దాంతో గిరి బాలని కొట్టడానికి కాలర్ పట్టుకుంటాడు. త్రిపుర ఆపినా గిరి ఆగడు. ఏం చేయొద్దు కొట్టొద్దు.. అని బాల గిరిని ఏం చేయొద్దని అంటాడు. అతను చిన్న పిల్లాడి లాంటి వాడని వదిలేయమని త్రిపుర చెప్తుంది. అయినా గిరి వదలను అని నా కాబోయే పెళ్లాం చేయి పట్టుకున్నాడని వీడిని వదలను అని అంటాడు.
గిరి కొరడా తీసుకొచ్చి బాలని కొట్టడానికి కొరడా విసిరితే బాల కొరడా పట్టుకుంటాడు. ఇంతలో పోలీసులు వచ్చి గొడవ అడ్డుకుంటారు. గిరిని పంపేస్తారు. అనంత్, గాయత్రీ మాట్లాడుకుంటూ జాతర మొత్తం తిరుగుతూ ఉంటారు. గాయత్రీ పడిపోబోతే అనంత్ పట్టుకుంటాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మరోవైపు ఊర్వశి, తల్లి ఇద్దరూ తింటూ ఉంటారు. ఇంతలో పెద్ద వర్షం పడుతుంది. ఊర్వశికి ల్యాప్ టాప్ పైన ఉన్న విషయం గుర్తొస్తుంది. పరుగున వెళ్లి తీసుకొస్తుంది. అప్పటికే ల్యాప్ టాప్ మొత్తం తడిసిపోయి పని చేయడం మానేస్తుంది. కొత్త ల్యాప్ టాప్ గాయత్రీతో గొడవపడి మరీ నీకు ఇస్తే ఇలా చేస్తావా అని తల్లి ఊర్వశిని తిడుతుంది.
మరోవైపు బాల జాయింట్ వీల్ ఎక్కుతానని మారాం చేస్తాడు. బాల జాయింట్ వీల్ ఎక్కాలి అనుకున్న బాల పిన్ని బాబాయ్‌లు ఎలా అయినా బాలని చంపాలి అని బాల ఎక్కబోయిన సీట్ బోల్ట్ విప్పేస్తాడు. బాల వెళ్లి కూర్చొంటాడు. బాల జాయింట్ వీల్ ఎక్కి నా పేరు అడిగావ్ కదా నా పేరు బాల అని అరుస్తాడు. దాంతో త్రిపుర నా పేరు త్రిపుర అని అరుస్తుంది. మరోవైపు అనంత్ బియ్యపు గింజ మీద రాయిస్తాడు. ఏం రాయిస్తున్నారు అని గాయత్రీ అడిగితే నేను ఒకరికి గిఫ్ట్ ఇవ్వబోతున్నా తీసుకునే వాళ్లకి తెలుస్తుందని అంటాడు. ఇక బాల జైంట్ వీల్ ఎక్కడం గిరి చూస్తాడు. ఆపరేటర్‌ని పిలిచి రమ్మంటాడు. జైంట్ వీల్ తిరుగుతుంది మధ్యలో ఎలా రాను అంటే సీరియస్‌గా పిలుస్తాడు. దాంతో ఆపరేటర్ వస్తాడు. తర్వాత గిరి మీదకు ఎక్కి జైంట్ వీల్ స్పీడ్ పెంచేస్తాడు. బాల ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అరుస్తాడు. అందరూ చూసి కంగారు పడతారు.
బాల చిన్నాన్న బోల్ట్ విప్పేయడంతో బాల కూర్చొన్న క్యాబిన్ ఊడిపోవడానికి రెడీగా ఉంటుంది. త్రిపుర బయట నుంచి అరుస్తూ బాల జాగ్రత్త ఊగకు అని కేకలేస్తుంది. స్పీడ్‌కి బాల ఎగిరి తుల్లిపోతాడు. ఓ సీట్‌ని పట్టుకొని వేలాడు తాడు. తెగిపోయిన తాడుని త్రిపుర పట్టుకొని లాగుతుంది. బాల వేలాడుతుండటం అనంత్ చూస్తాడు. గాయత్రీకి చేతిలో గిఫ్ట్ పెట్టి అన్నయ్య దగ్గరకు పరుగులు తీస్తాడు. బాల కింద పడేటైంకి అనంత్ వచ్చి పట్టుకొని తీసుకెళ్తాడు. ఇక ఊర్వశి ల్యాప్‌టాప్ గురించి టెన్షన్ పడుతుంటే తల్లి గాయత్రీని చూసి కొత్త ల్యాప్‌టాప్ మళ్లీ ఎవరితో కొనిపించాలో నాకు తెలుసు అని అంటుంది. గాయత్రీని పిలిచి మా మీద ఎందుకు నీకు అంత కోపం అని అడుగుతుంది. కుళ్లుతో ల్యాప్‌టాప్ పొగొట్టేశావని రివర్స్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!