Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ సీతని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి మహాలక్ష్మీ ఇంట్లోనే ఉంటానని చెప్తాడు. రామ్ సీతని పక్కకి తీసుకెళ్లి మామయ్యకి ఏం ఇబ్బంది లేకుండా చూడు.. త్వరలోనే ఈ కేసు మామయ్య తేల్చేస్తారని చెప్తాడు. సీత, రామ్‌ల మాటలు మహాలక్ష్మీ చాటుగా వింటుంది. మహాలక్ష్మీని చూసిన సీత కావాలనే తన తండ్రి గురించి మాట్లాడుతుంది.
సీత: మా నాన్న ఇలాంటి కేసులు చాలా పరిష్కరించారు మామ. నా కేసు కూడా సాల్వ్ చేస్తారు. మా మామ, అల్లుడులకు ఏదైనా ఆధారం దొరికి ఆ కిడ్నాపర్లు దొరికితే ఏం చేస్తావు మామ.
రామ్: నిన్ను కష్టపెట్టిన వాళ్లని ఈజీగా వదలను సీత వాళ్ల అంతు చూస్తా. వాళ్లు ఇంట్లో వాళ్లు అయినా సరే వదిలే ప్రసక్తే లేదు.
సీత: వాళ్లు నీకు అత్యంత ఇష్టమైన వాళ్లు అయితే.
రామ్: ఎందుకు అలా అడుగుతున్నావ్ నీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉందా. నాకు నీ కంటే ఎవరూ ఎక్కువ కాదు సీత. నువ్వు నాకు ఏ పరిస్థితిలో దొరికావో తెలుసా నేను అనుభవించిన నరకం.. నువ్వు ఊపిరి పీల్చుకున్న వరకు నేను అనుభవించిన వేదన జీవితంలో మర్చిపోలేను. నేను పడ్డ నరకం వాళ్లు అనుభవించేలా చేస్తా.
సీత: చాలు మామ ఇదే మాట మీద ఉండు వాళ్లకి నువ్వు చెప్పిన శిక్ష వేయ్.
అర్చన: మహా సీత తండ్రికి మన గురించి తెలిసిపోతుందేమో అని టెన్షన్‌గా ఉంది.
మహాలక్ష్మీ: అర్చన అతను ఎస్‌ఐ మాత్రమే ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ కాదు.
అర్చన: మహా మనమే నిజం ఒప్పుకుంటే బెటర్ కదా.
మహాలక్ష్మీ: బుద్ధి ఉందా.. రామ్‌కి నిజం తెలిస్తే మనల్ని మెడ పట్టుకొని గెంటేస్తాడు.
అర్చన: మహా నువ్వు కావాలని నన్ను ఇందులో ఇరికించడానికి నా ఫోన్ వాడావు కదా. నీ దాకా వస్తే నువ్వు నీ గురించి మాత్రమే చూసుకుంటావ్.
మహాలక్ష్మీ: నా మీద నమ్మకం లేదా.
శివకృష్ణ సీత చెప్పిన వివరాలు ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి శివకృష్ణకు కొన్ని ఫైల్స్ ఇస్తాడు. గతంలో కిడ్నాప్స్ చేసిన అంతకుల లిస్ట్ అని అది సీతకి చూపిస్తే సీత వాళ్లని గుర్తు పడితే వాళ్లని పట్టుకుంటే వాళ్ల వెనక ఉన్నవారు తెలుస్తారని అంటాడు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. శివకృష్ణ దగ్గర ఉన్న ఫైల్‌లో నాగు ఫొటో కూడా ఉంటుంది. అది మహాలక్ష్మీ చూసి షాక్ అయిపోతుంది. సీత చూస్తే నాగు దొరికిపోతాడని నిజం తెలిసిపోతుందని తెగ కంగారు పడుతుంది. చలపతి సీతని కిందకి పిలుస్తాడు. రామ్ కూడా ఆవేశంగా కిందకి వెళ్తాడు. మహాలక్ష్మీ కంగారుగా పడుకున్న అర్చన దగ్గరకు వెళ్లి లేపుతుంది. విషయం చెప్తుంది. అర్చన షాక్ అయిపోతుంది. సీత వాడిని గుర్తు పడితే నీ పని అయిపోనట్లే అని మహాలక్ష్మీ అంటుంది. నా పని ఏంటి అని అర్చన అంటే అదే కంగారులో అనేశా మని ఇద్దరి పని అయిపోతుందని అంటుంది. సీతకి తండ్రి ఫైల్ ఇచ్చి చూడమని చెప్తాడు. సీత చూస్తూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మీ అర్చనతో కాఫీ తీసుకొద్దాం పద అని కిచెన్‌కి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!