Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున డల్‌గా మేడ మీద ఆలోచిస్తూ ఉంటే మిధున పెద్ద తోటికోడలు ప్రమోదిని మిధున దగ్గరకు వెళ్లి దేవా చాలా మంచి వాడని డబ్బు మనిషి కాదని కుటుంబం కోసమే బతుకుతున్నాడని దేవా చాలా గొప్పవాడని చెప్తుంది. దేవా డబ్బు కోసం తప్పు చేయడు అని నమ్మినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక దేవా తండ్రి సత్యమూర్తి ధీనంగా ఇంటికి వస్తాడు.
శారద భర్తతో ఉదయమే ఎక్కడికి వెళ్లారని అడిగితే అప్పుకోసం వెళ్లాలని నీ ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చాలని అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్తాడు. దాంతో శారద చిన్న వాడు రియలస్టేట్‌లో పని చేస్తున్నాడు కదా వాడిని అడుగుతా అని వెళ్తుంది. ఇక చిన్న కొడుకు శ్రీరంగం రియలస్టేట్‌లో వచ్చాయని లక్ష తీసుకొని వచ్చి భార్య సూర్యకాంతం చేతిలో పెడతాడు. ఇంట్లో వాళ్లు చూస్తే ఎవరైనా అడిగేస్తారని బంగారం కొనుక్కుంటానని అంటుంది. శ్రీరంగం సరే అంటాడు. ఇంతలో శారద వచ్చి డబ్బు అడిగితే ఇద్దరూ లక్ష దాచేసి లేవు అనేస్తారు. ఇంతలో అప్పు ఇచ్చిన వాడు సత్యమూర్తిని పెద్ద పెద్దగా పిలిచి డబ్బు అడుగుతాడు. పెద్దాయన్ని కోప్పడతాడు. ఇద్దరు కొడుకులు కోడళ్లతో పాటు మిధున కూడా చూస్తుంది.
సత్య మూర్తి కొంత టైం అడిగితే అప్పుల వాడు తిడతాడు. మీ ఆవిడ పోయింటే పోయిన్ను అనవసరంగా డబ్బు ఇచ్చానని అంటే దేవా వచ్చి అతన్ని చితక్కొడతాడు. అమ్మ మీద అంత ప్రేమ ఉంటే నా అప్పు చెల్లించు అని అంటాడు. దాంతో దేవా ఎంత అప్పు అని అడిగితే 10 లక్షలు అని చెప్పగానే దేవా 12 లక్షలు చేతిలో పెట్టి క్షమాపణ చెప్పమంటాడు. ఇంతలో సత్యమూర్తి ఆ డబ్బు దేవా ముఖం మీద విసిరేస్తాడు. నీ పాపపు సొమ్ము వద్దురా నా భార్య కోసం అప్పు చేసిన నేనే తీర్చుకుంటానని అంటాడు. నువ్వు బాకీ తీర్చితే నా భార్య ప్రాణాలకు విలువ ఉండదు అని అంటాడు. కష్టపడి సంపాదించి ఇలాంటి రక్తపు మడుగులో కాదు అని అరుస్తాడు. ప్రమోదిని కూడా మామయ్య గారు ఇప్పటికైతే ఈ డబ్బు ఇచ్చేద్దాం అని అంటుంది. సత్యమూర్తి ఇంటిలోపలికి వెళ్లి ఇంటి డాక్యూమెంట్స్ ఆ మల్లేశం చేతిలో పెట్టి నెల రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇళ్లు అమ్మేయమని చెప్తాడు.
కింద పడిన డబ్బుని సూర్యకాంతం ఆమె భర్త శ్రీరంగం తీసుకుంటుండగా దేవా రేయ్ అనగానే తీసుకొచ్చి దేవా చేతిలో పెడతారు. దాంతో దేవా బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు మిధున అన్నావదినలు మిధునని ఇంటికి తీసుకురావడానికి ఇక చివరి ప్రయత్నంగా కుట్ర చేయాలని అనుకుంటారు. అందుకు మిధున అత్తింటిలో ఎవరో ఒకరి సాయం తీసుకోవాలని అనుకుంటారు. దేవా తండ్రి మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. మిధున దేవా చేతికి తగిలిన గాయానికి మందు పెడతానని అంటే గుండెకి తగిలిన గాయం కంటే ఇదేం పెద్దది కాదని దేవా అంటాడు. మీ నాన్న డబ్బు వద్దనడానికి అర్థం ఉంది కదా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది. దేవా మిధునని వెళ్లిపోమని తిడతాడు.
పిచ్చి కోపంతో ఉన్నా వెళ్లిపో అని అంటాడు. మీ నాన్న నీకు ప్రాణం అంట కదా మరి అలాంటి నాన్నని బాధ పెట్టి ఎందుకు రౌడీలా మారావని అడుగుతుంది. రౌడీయిజం వదిలేయమని మీ నాన్న చెప్పినా ఎందుకు వినడం లేదని మిధున అడుగుతుంది. ఇది నీకు సంబంధం లేదని దేవా అంటే నాకు ఎందుకు సంబంధం ఉండదు నేను ఈ ఇంటి కోడలిని నీ భార్యని నాకే సంబంధం ఉందని అంటుంది. మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని దేవా అంటాడు. నువ్వు డబ్బు మనిషివి కాదు మరి రౌడీ అవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!