Ammayi garu Serial Today Episode రూప ఇంట్లో లేదని రూపనే రాజుని బెయిల్ మీద తీసుకొచ్చిందని విజయాంబిక, దీపక్‌లు సూర్యప్రతాప్‌ని రెచ్చగొడతారు. రూపనే ఇలా చేసుంటే ఇంట్లోకి రానివ్వనని సూర్య ప్రతాప్ అంటాడు. రూప పని అయిపోయిందని విజయాంబిక అనుకుంటుంది. ఇంతలో మేడ మీద నుంచి రూప కిందకి దిగుతుంది. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. సుమ రిలాక్స్ అయిపోతుంది.
రూప: పిన్ని తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టిస్తావా.సుమ: రా రూప పెట్టిస్తాను.సూర్యప్రతాప్: ఆగు.. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావ్.రూప: నేను ఎక్కడికి వెళ్తాను ఇంట్లోనే ఉన్నాను కదా నాన్న.సూర్యప్రతాప్: ఇంట్లోనే ఉంటే ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావ్.రూప: ఎవరికైనా ఎందుకు కనిపించాలి నాన్న మీకు ఎదురు పడితే మీరు తల తిప్పుకొని వెళ్లిపోతారు. అత్తయ్యా దీపక్‌లు వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. పిన్ని, బాబాయ్‌లు పింకీ విషయంలో నేను చేసిన పనికి నా మీద కోపంగా ఉన్నారు. సుమ: మనసులో పింకీ విషయంలో నువ్వు చేసిన పనికి మాకు కోపం లేదు రూప. కానీ నువ్వు చేసిన పద్ధతికి కోపంగా ఉంది. ఏది ఏమైనా అక్కడ అది సంతోషంగా ఉంటుందని ధైర్యంగా ఉంది.రూప: అలా అందరూ అన్ని కారణాలతో నాకు దూరంగా ఉంటే నేను మాత్రం అందరికీ దగ్గరగా ఎలా ఉండను నాన్న. సుమ: వదిన గారు ఒకరి మీద కంప్లైంట్ చేసినప్పుడు పూర్తిగా తెలుసుకొని చేయండి.విజయాంబిక: నేను చూశాను సుమ.సూర్యప్రతాప్: చాల్లే ఆపు అక్క కాసేపు రూప కనిపించకపోయే సరికి ఏదో కొంపలు అంటుకుపోయేలా రాద్ధాంతం చేస్తున్నారు. అయినా రూప కనిపించకపోతే మీకు నష్టం ఏంటి. ఆ రాజు చేసిన తప్పు తెలుసుకుంటే చాలా వాడు జైలులోనే ఉండాల్సిన అవసరం లేదు. దీపక్ నువ్వేం టెన్షన్ పడకు నీ పెళ్లి జరుగుతుంది. నేను ఉన్నాను.రూప: మనసులో నన్ను క్షమించండి నాన్న, ఈ పెళ్లి మేం జరగనివ్వం.
రూప గదిలోకి వెళ్లి కిటికీ నుంచి ఏం ప్రాబ్లమ్ లేదని రాజుకి చెప్తుంది. తర్వాత రాజు వెళ్లిపోతాడు. రూప అక్కడ ఉండటం విజయాంబికలు చూస్తారు. ఎందుకు వచ్చారని రూప అడిగితే తలనొప్పి అన్నావ్ ఎలా ఉందని అడుగుదామని వచ్చానని అంటుంది. బయట కారిడార్‌లో ఉన్నానని రూప చెప్తుంది. ఇక తల్లీకొడుకులు రాజు బయటకు రాకపోయి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మందారం గురించి టెన్షన్‌గా ఉందని దీపక్ అంటాడు. రాజుతో ఉండాల్సిన నేను రాజుకి కొడుకుకి దూరంగా ఉంటున్నాను అని రూప ఏడుస్తుంది. విజయాంబిక, దీపక్‌లు పెళ్లి అయిన వరకు మన వంట మనమే చేసుకుందాం ఎవరినీ నమ్మకూడదని విజయాంబిక అంటుంది. ఆ మాటలు రూప వినేస్తుంది.
విజయాంబిక కిచెన్ గదిలోకి వెళ్లి ఉప్మా చేస్తుంటుంది. విజయాంబిక బయటకు వెళ్లగానే రూప ఉప్మాలో పెవికిక్ కలిపేస్తుంది. తల్లీకొడుకులు ఉప్మా నోటిలో పెట్టగానే స్పూన్‌తో నోటిలో ఉండి మూతి అంటుకుంటుంది. ఇద్దరూ ఒకరి స్పూన్ ఒకరు లాక్కొని తెగ తిప్పలు పడతారు. ఎంతకీ నోటి నుంచి స్పూన్ రాదు. సూర్యప్రతాప్ రావడం చూసిన రూప ఇద్దరి దగ్గరకి వెళ్లి ఏమైందని అడుగుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. చంద్ర, రూపలు ఎంత లాగినా స్పూన్లు రావు. రూప చాక్ ఇచ్చి రెండు పెదవులు మధ్య కోసేద్దామని అంటుంది. తల్లీకొడుకులు బిత్తరపోతారు. ఇక సుమ వేడి వేడి నీరు తీసుకొస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!