Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌తో పాటు కారులో వెళ్తుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తర్వాత జోకులు వేసుకొని నువ్వుకుంటారు. ఎక్కడికి వెళ్లాలో చెప్పాల్సిన దానివి అయితే నువ్వే చెప్తావ్ లేదంటే అడిగినా చెప్పవని క్రిష్ అంటాడు. దాంతో సత్య బాగానే పెళ్లాం మీద క్లారిటీ ఉందని అంటుంది. దానికి క్రిష్ నీకే మొగుడి మీద క్లారిటీ లేదు అంటాడు. అప్పుడు సత్య ఆ క్లారిటీ తెలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నా అని చెప్తుంది.
క్రిష్: అవును కానీ గంగ గురించి నీ అభిప్రాయం ఏంటి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని ఆమె అంతలా సతాయించింది అంటే ఆమె వెనక ఎవరు ఉంటారు.
సత్య: ఏమో నాకు ఎలా తెలుసు.
క్రిష్: నాకు తెలుసు. ఎవరో ఉన్నారో తెలీదు కానీ చాలా తెలివైన మనిషే ఉన్నారు. తెలుసుకుంటా. క్రిష్ ధ్యాస చేసుకుంటే వదలడు. కనపడని శత్రువు ఎప్పటికైనా ఇబ్బందే.
సత్య: మనసులో నేను శత్రువు కాదు క్రిష్ నీ శ్రేయాభిలాషిని. ఇక సత్య కారులో వెళ్తూ సంధ్య, సంజయ్‌లను చూస్తుంది.. ఆ బైక్‌లో ఉన్నది సంధ్యే కదా.
క్రిష్: కాల్ చేయ్ క్లారిటీ వస్తుంది.
సంధ్యకు సత్య కాల్ చేస్తే సంధ్య కంప్యూటర్ క్లాస్‌లో ఉన్నానని అబద్ధం చెప్పేస్తుంది. ఒక సత్య కాంపౌండర్ చెప్పిన అడ్రస్‌కి వెళ్తుంది. అయితే సత్య, క్రిష్ అక్కడికి చేరుకోవడానికి ముందే ఇద్దరు రౌడీలు ఆ నర్స్ మేరీని లాక్కొని వెళ్లిపోతారు. ఓ మహిళ ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారని అడుగితే మా బంధువు ఇంటికి రావడం లేదని అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్తారు. ఇక సత్య, క్రిష్‌లు వెళ్లి అదే మహిళను అడిగితే మేరీని ఎత్తుకెళ్లారని చెప్తుంది. దాంతో సత్య మనసులో మామయ్య పనే ఇది అని అనుకుంటుంది. అవకాశం చేజారి పోయిందని బాధ పడుతుంది. ఆవిడ ఇక ఎవరికీ కనిపించదు ఈ ఇంటికి వచ్చి తప్పు చేశానని సత్య అనుకుంటుంది. సత్య డిసప్పాయింట్ అయిపోతుంది. క్రిష్, సత్య వెనక్కి బయల్దేరిపోతారు. క్రిష్ ఎంత మాట్లాడించినా సత్య హ్యాపీగా లేనని చెప్తుంది. ఇక మాట్లాడుకుంటూ ఇద్దరూ మళ్లీ హనీమూన్‌కి వెళ్దామని అనుకుంటారు. రేపే వెళ్దామని సత్య అంటే క్రిష్ ఇప్పుడన్నా సరే అంటాడు. ఇక సత్య ఎలక్షన్ ఎమ్మెల్యే టికెట్ అనకు అంటే అవును కదా అదొకటి ఉంది కదా బాపు ఎమ్మెల్యే టికెట్ కన్ఫ్మమ్ అయిన తర్వాత వెళ్దామని అనుకుంటుంది.
మరోవైపు హర్ష మైత్రి ఇంట్లో ఉంటాడు. మైత్రి చీర కట్టుకొని రెడీ అయి వస్తే హర్ష చూస్తూ ఉండిపోతాడు. చీరలో ఎలా ఉన్నాను అని మైత్రి అడిగితే ఇప్పుడే పుట్టిన పాపలా ఉన్నావని చెప్పి నీకో సర్‌ప్రైజ్ ఉందని రాత్రి పూట మేడ మీదకు తీసుకెళ్లి భర్త్‌డ్ కేక్ హార్ట్ సింబల్ బెలూన్స్ డెకరేషన్ చేసి మైత్రికి సర్‌ఫ్రైజ్ చేస్తాడు. తర్వాత కేక్ కట్ చేయించి తినిపిస్తాడు. మైత్రి చాలా సంతోషిస్తుంది. ఇంతలో నందిని కాల్ చేస్తుంది. హర్ష లిఫ్ట్ చేయడు. ఇక హర్ష మైత్రితో నువ్వు రోజు రోజుకు నా మీద చాలా డిపెండ్ అయిపోతున్నావ్ అది అంత మంచిది కాదు మైత్రి అదే నా భయం అని అంటాడు. లైఫ్‌లో నువ్వు సెటిల్ అవ్వాలని నేను మాటి మాటికి మీ ఇంటికి రావడం మంచిది కాదని అందరూ ఏవేవో అనుకుంటారని అంటుంది. దాంతో మైత్రి నేను నీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తా అంటుంది. ఇంతలో మళ్లీ నందిని ఫోన్ చేస్తే నందిని వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్తా అని చెప్పి హర్ష వెళ్లిపోతాడు. క్రిష్ వాళ్లు ఇంటికి వస్తారు. ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి ఆ నర్స్ ఇక ఎవరికీ కనిపించదని చెప్తాడు. ఈ ఇంట్లో నా ఇష్టానికి తప్ప మరెవరి చేతలు వర్క్‌ట్ అవద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!