Sathyabhama Today Episode: సత్యభామ పేరు తెలుసుకోవడానికి క్రిష్ తన ఇంటికి వెళ్తాడు. అక్కడ సత్య బట్టలు ఆరేయడం చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇంట్లో ఎవరో ఒకరు సత్యను పేరు పెట్టి పిలుస్తారు.. అప్పుడు సత్య పేరు తెలిసిపోతుంది అని వెయిట్ చేస్తాడు. అందరూ రకరకాలగా పిలుస్తారు కానీ ఎవరూ పేరుతో పిలవరు. ఇక సత్య ఇంట్లోకి వెళ్తుండగా కాలి పట్టీ కింద పడిపోతుంది. దాన్ని ఎవరూ చూడకుండా తీసుకోవాలి అనుకున్న క్రిష్ అనుకోకుండా పూలకుండీ తన్నేస్తాడు. దీంతో సత్య తల్లి ఎవరూ అంటూ వస్తుంది. ఇక ఆమె చూడకుండా క్రిష్ పట్టీ తీసుకొని వచ్చేస్తాడు.
మరోవైపు రుద్ర భార్య రేణుక బట్టలు ఆరేస్తూ ఉంటే పొరపాటున నీరు నందినీ మీద పడతాయి. దీంతో నందినీ రేణుకని తిడుతుంది.
రేణుక: కనీసం వదిన అని కూడా చూడకుండా నోరు పారేసుకుంటుంది నువ్వు.
నందిని: అవును నేను అనేదాన్ని నువ్వు పడేదానివి. ఇది నా ఇళ్లు. నా ఇష్టం.
రుద్ర: ఏంటే లొల్లి..
నందిని: ఏం లేదు అంటావ్ ఏంటి ఇప్పుడే కదా నా సెల్ మీద నీరు వేసేశావ్.. రేట్ ఎంతో తెలుసా.. ఏదైనా అడిగితే ఎదురు మాట్లాడుతుంది.
రుద్ర: రేణుకా.. ఏమే ఏమైంది నీకు. నా చెల్లిని అనేదానివి అయ్యావా.. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత ధైర్యం.
మరోవైపు క్రిష్ పట్టీ పట్టుకొని సత్యభామతో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఫీలయిపోతాడు. ఇక ఇలా కాదు అని జనాభా లెక్కలు అడిగే వాళ్లలా వెళ్తారు. ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకొని వెళ్తారు. ఇక బామ్మ వచ్చి ఎవరు మీరు దొంగల్లా ఉన్నారని తిడుతుంది. ఇక ఇంట్లో అందరి పేర్లు చెప్తుంది. ఇక పెద్దమనవరాలు సత్య అని చెప్తుంది. దానికి సత్య బామ్మ ఎవరైనా నా పేరు అడిగితే పూర్తి పేరు సత్యభామ అని చెప్పు అంటుంది. ఇక క్రిష్ సత్యభామను అలా చూస్తూ ఉండిపోతాడు.
శాంతమ్మ: ఏరా విశ్వం నేను చెప్పిన పని ఎంత వరకు చేశావ్.. అదేరా సత్యకు పెళ్లి సంబంధాలు చూడమన్నాను కదా ఎవరికైనా చెప్పావా.
హర్ష: సత్యను ఒప్పించినంత ఈజీ కాదు సంబంధాలు దొరకడం అంటే..
శాంతమ్మ: ఎందుకు కాదు నా మనవరాలు ఒప్పుకుంది అని తెలిస్తే రాకుమారుడు లాంటి మనవడు వస్తాడు.
మరోవైపు విశ్వనాథానికి అమెరికా నుంచి ఆయన కాలేజ్ ఫ్రెండ్ శేఖర్ ఫోన్ చేస్తాడు. ఆయన కొడుకుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని... ఆయన కొడుకు పక్కా తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని.. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు. ఇక విశ్వం తనకు ఇష్టమే అని అమ్మాయి.. అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చాలి అంటాడు. దీంతో శేఖర్ మంచి రోజు చూసుకొని వస్తామని చెప్తాడు. మరోవైపు క్రిష్ సత్య పేరును తన చేతిమీద పచ్చబొట్టు వేయించుకుంటాడు.
కాళీ: ఏంటి అన్నా ఇది పచ్చబొట్టు అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. వదినతో ఇంకేం మాట్లాడకుండానే ఆమె పేరు ఇలా పర్మినెంట్‌గా ఉండేలా వేయించుకుంటున్నావ్.. అన్నా సమాధానం చెప్పవేంటి
క్రిష్: ఫిక్స్ అయిపోయానురా తనే నా పిల్ల అని.. ఫిక్స్ అయిపోయా. రేయ్ ఈ పచ్చబొట్టుపైకే పర్మినెంట్‌గా ఉంటుందిరా. కానీ ప్రేమ గుండెల్లో పచ్చబొట్టలెక్క లైఫ్ లాంగ్ ఉంటుంది. నా జిందగీలో ఇంకో పోరీ లేదు.. రాదు.
బాబీ: అన్నా నువ్వు ఇంత ప్రేమ పెంచుకుంటున్నావ్. కానీ వదిన నిన్ను ఇష్టపడాలి అన్న రూల్ లేదు కదా అన్న. ఒకవేళ వదనకు నువ్వు నచ్చకపోతే.. అంటే పచ్చబొట్టు పొడిపించుకున్నంత ఈజీగా చెరిపేయ్‌లేం కదా.. ఒకసారి ప్రేమిస్తే మనసు నుంచి చెరిపేయలేం కదా అన్నా. తర్వాత ఏదైనా నువ్వు అనుకున్నట్లు జరగకపోతే ఆ బాధ నువ్వు తట్టుకోగలవా అన్నా.
క్రిష్: అవును రా నువ్వు చెప్పేది కరెక్ట్. కానీ నా మనసు చెప్తొంది ఆమె నా కోసమే పుట్టింది అని. రేయ్ మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది. నేను నా శంపంగిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న. నా ప్రేమ నిజమైతే అదే మా ఇద్దరినీ కలుపుతుంది.
కాళీ: మనసులో.. మరి నేనెందుకు ఉన్నదీడ. నీకు భజన చేయడానికా.. లేక వాళ్లలాగ చెంచాగిరి చేయడానికా.. పిచ్చోడా దానికి ఇప్పటికే నువ్వు రౌడీలకే రౌడీ అనే అభిప్రాయం కలుగజేశా. ఇంకోసారి నువ్వు నువ్వేంటే పక్కా అసహ్యించుకునేలా చేస్తా. అప్పుడు ఇక నువ్వు ఆ టాటూని దాన్ని చెరిపేలేక చచ్చేదాక ఫీలవుతూ ఉంటావ్..
బాబీ: ఏయ్ నువ్వేంటి తెగ ఫీలవుతున్నావ్.
కాళీ: ఏం లేదు అన్నా ఏ పిల్ల అయినా తన పేరు ఇలా పచ్చబొట్టు వేయించుకున్నారని తెలిస్తే మస్తు పీలవుతుంది అన్నా. పోరీలు ఇలాంటి వాటికే ఇంప్రెస్ అవుతారు. అన్నా ఒక్కసారి వదినను కలిసి ఈ పచ్చబొట్టు చూపించావ్ అంటే ఇక నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు అన్న.
నందిని అర్థరాత్రి ఇంటికి వస్తుంది. రేణుక తలుపు తీసి ఇలా చేయడం తప్పు అని అంటుంది. దానికి నందిని అర్థరాత్రి వస్తున్నాను అని ఎవడితోనో తిరిగి వస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా అని సీరియస్ అవుతుంది. దీంతో రేణుక నేను అలా అనుకోవడం లేదు.. కానీ నువ్వు పెళ్లి కావాల్సిన దానివి ఇలా చేయకూడదు అని చెప్తే. నందిని రేణుక మీద విరుచుకుపడుతుంది. బయట నుంచి వచ్చిన నువ్వు బయట దానిలానే ఉండు అని తిడుతుంది. ఇక తన అన్నయ్యని పిలిచి చెప్తుంది. దీంతో రుద్ర కూడా రేణుకని తిడతాడు. ఇక నందినీ నీ పెళ్లమయినా ఇంట్లో ఉండాలి.. లేదంటే నేను అయినా ఉండాలి అని అంటే రుద్ర రేణుకని ఇంట్లో నుంచి తరిమేందుకు వెళ్తాడు. అప్పుడే నందిని తల్లి వచ్చి అడ్డుకుంటుంది. తన కూతుర్నే తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘సైంధవ్’లో సారా పాపే హీరో, సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేశ్