Krishna Mukunda Murari Telugu Serial Today Episode: ఆర్టిస్ట్ శ్రీధర్‌ని చంపిన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకుంటారు. అతడిని పోలీసులు మురారి ఇంటికి తీసుకొస్తారు. వాడికి నిజం చెప్పమని మురారి కొడితే అంతా కృష్ణ బాబాయ్ పెద్దపల్లి ప్రభాకరే చేయించాడు అని చెప్పేస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఇందులో ఏదో కుట్ర ఉంది నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తేల్చుతా అని మురారి అంటే భవాని అతడిని ఇళ్లు దాటనివ్వదు. ఇక కృష్ణని అవమానించి తన ఇంటి నుంచి పంపేస్తుంది భవాని. మరోవైపు పోలీసులకు దేవ్ డబ్బులు ఇస్తాడు.
కృష్ణ: అసలు ఏం జరుగుతుంది ఏసీపీ సార్.. ఇది కుట్రా.. నిజమా.. మా చిన్నాన్న ఎందుకు చేస్తారు ఇలా.. లేదు ఏసీపీసార్ కానీ అతను చెప్పింది..
మురారి: పూర్తిగా అబద్ధం.. కానీ దీని వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టాలి.
కృష్ణ: అంత అవసరం ఎవరికి ఉంటుంది ఏసీపీ సార్. మనల్ని వేరు చేయాలి అన్నంత కోపం ఎవరికి ఉంది. ముకుందకు తప్పా.
మురారి: ముకుందకు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఉంది తప్ప. ఒకరిని చంపాలి ఇంకొకరి చేత ఇలా చేయించడం లాంటివి మాత్రం చేయదు. కృష్ణ పెద్దమ్మ అలా అంది అని నువ్వు బాధపడకు.
కృష్ణ: లేదు ఏసీపీ సార్ మిమల్ని ఎవరు అయినా అలా అంటే ఎవర్ని అయినా ఎదిరిస్తా ఏసీపీ సార్.
మురారి: అసలు ఇవన్నీ ఎందుకు పెద్దమ్మ నిన్ను నమ్మితే చాలుకదా.. అవును అసలు ఆ రింగ్ విషయం ఏమైందో ఒక్క నిమిషం ఆగు అని రింగ్ ఎంక్వైరీ ఎంత వరకు వచ్చిందని డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేసి అడుగుతాడు.
కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి జైలుకి వెళ్తుంది. అయితే పెద్దపల్లి ప్రభాకర్ ఎవర్నో కొట్టాడు అని అందుకే ఆయన్ను జైలులోని క్షమశిక్షణ సెల్‌లో వేశామని.. ఇప్పట్లో ఆయన్ను ఎవరూ కలవడానికి వీలులేదు అని కానిస్టేబుల్ చెప్తాడు. దీంతో కృష్ణ షాక్ అయిపోతుంది. తన చిన్నాన్న ఎవర్ని కొట్టుంటాడు. శ్రీధర్‌కి ఇందాక ఇంటికి వచ్చిన వాడికి ఏదైనా సంబంధం ఉందా.. లేకపోతే వేరే ఎవర్ని అయినా కొట్టాడా అని కృష్ణ ఆలోచిస్తుంది.
మరోవైపు భవాని ఇంట్లో ముకుందకు కోన్ పెడుతుంటారు. భవాని ఇంట్లో నుంచి నవ్వులు వినిపించడంతో కృష్ణ, శకుంతల బయట నుంచి విని ఏడుస్తుంటారు. ఇక మురారి కూడా అక్కడికి వస్తాడు.
కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ ఇలా వచ్చారు ఒకసారి చివరిగా చూసి వెళ్దామనా..
మురారి: అలా మాట్లాడకు కృష్ణ ప్లీజ్..
రేవతి: కృష్ణ ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావ్ వెళ్దాం రా. నువ్వు నా కళ్లెదుటే ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ఏం చేసుకుంటావా అని భయంగా ఉందే.
మురారి: అమ్మా ఏంటి ఇది పెళ్లి అయిపోనట్లు బాధ పడుతున్నావేంటి.
రేవతి: లేదు కృష్ణ నాతోనే ఉండాలి.. కృష్ణ అటు ఇటు అయితే నేను కూడా నీతోనే వచ్చేస్తా మనిద్దరం కలిసే ఉందాం.. నువ్వు లేకుండా నేను ఉండలేను.
కృష్ణ: అత్తయ్య నిజంగా ఆ దేవుడు అనే వాడే ఉండుంటే మనకు అన్యాయం చేయడు మీరు బాధ పడకండి. నేను బాధ పడటం కంటే ఇంకేం చేయలేకపోతున్నా నందూ. తర్వాత మురారి రేవతి, నందూ వాళ్లని వెళ్లిపోమని చెప్తాడు. ఇక కృష్ణ ఏడుస్తూ మురారిని హగ్ చేసుకుంటే మురారి కూడా ఏడ్చేస్తాడు. ఇక అందరూ ముకుందకు గోరింటాకు పెడుతుంటే అక్కడికి వస్తారు. కృష్ణ కూడా వస్తుంది.
కృష్ణ: ఏసీపీ సార్ రేపటి నుంచి నేను మీకు మాజీ భార్యనా..
మురారి: ఏంటి నువ్వు అనేది ఆ మాట నువ్వేనా అనేది. కృష్ణ నీ ధైర్యమంతా ఏమైపోయింది. అసలు నువ్వు..
కృష్ణ: ఆడపిల్లని.. అంత కంటే మీ భార్యని. దేన్ని అయినా గుప్పెట్లో పట్టుకోవచ్చుకానీ పరిస్థితుల్ని పట్టుకోలేము ఏసీపీ సార్. అది ఒక్క దేవుడికే సాధ్యం. నేను అంతకు మించి కాదు కదా ఏసీపీ సార్. నా స్థానాన్ని వాళ్లు తీసేసుకుంటే నేను మౌనంగా చూస్తూ కూర్చొన్నాను. ఇలా చూస్తూ ఉండటం అంటే రాజీ పడటం అంటారు అది నాకు ఇష్టం లేదు ఏసీపీ సార్. దేన్ని అయినా రాజీ పడొచ్చు కానీ. ఇలా..
నందూ: పిన్ని ఇక ఆశలు వదిలేసుకున్నట్లేనా..
రేవతి: నాతో మాట్లాడకు నందూ అసలు ఎవరూ నాతో మాట్లాడొద్దు. నా అంత పాపాత్మురాలు ఈ భూమ్మీద ఎవరూ ఉండరు. నా బిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాను. ఇంత కంటే దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా.
మధు: నువ్వే కాదు మనమందరం తప్పు చేస్తున్నాం.
నందూ: అమ్మది తప్పు అని నిలదీయలేకపోతున్నాం కదా పిన్ని.
దేవ్: ఎందుకు నిలదీయలేకపోతున్నారు నందూ.. అయినా కన్న తల్లిదండ్రులను గౌరవించు కానీ ఎందుకు భయం. భవాని సుమలతకు భోజనం ఏర్పాట్లు చూసుకోమని చెప్పడంతో.. మీరు చేస్తున్నదే తప్పు మళ్లీ దానికి భోజనం ఏర్పాట్లు బాగుంది మేడమ్.
భవాని: దేవ్..
ముకుంద: మనసులో.. ఏంటి నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా..
భవాని: పోనీలే అని వదిలేస్తే నన్నే తప్పు పడతావా.. హౌడేర్ యూ.. నేను అంత దుర్మార్గురాలిలా కనిపిస్తున్నానా.. అవతల వారిది తప్పే అని నిరూపించాలి చూస్తున్నాను. అన్నీ ఆలోచించే చేస్తున్నాను. నాలో లోపం ఉంది అని చెప్పేందుకు నిన్ను ఇక్కడే షూట్ చేసి పారేసేదాన్ని. ముకుంద అన్నవని వదిలేస్తున్నా బీ కేర్ ఫుల్.
కృష్ణ: సారీ అన్నయ్య నా వల్ల నీవు ఎంత అవమానం పడుతున్నావో.
దేవ్: పర్లేదురా.. కానీ నేను ఉండి కూడా నీకు న్యాయం చేయలేకపోతున్నాను అని నా బాధ. అది భరించలేకపోతున్నాను. సారీ అమ్మా. చెల్లెమ్మా నీకు జీవితంలో ఎలాంటి సాయం కావాలి అన్నా ఈ అన్నయ్య ఉన్నాడు. పెద్దపల్లి ప్రభాకర్ గారిని నేను రిలీజ్ చేయిస్తాను అని నీకు ప్రామిస్ చేస్తున్నా.. అంటూ కృష్ణ చేతిలో చేయి వేస్తాడు. కృష్ణ దేవ్ రింగ్ చూస్తుంది.
కృష్ణ: దేవ్ చేయి వదిలించుకొని యూ చీటర్ అని కాలర్ పట్టుకుంటుంది. ఏసీపీ సార్ వీడే.. శ్రీధర్‌ని చంపింది వీడే. చూడండి అదే రింగ్.
భవాని: ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్. శ్రీధర్‌ని దేవ్ చంపడం ఏంటి.
మురారి: పెద్దమ్మ ప్లీజ్ కాసేపు ఎవరూ మాట్లాడకండి. చెప్పరా.. శ్రీధర్‌ని చంపింది నువ్వే కదూ.. ఈ ఉంగరం ముద్ర శ్రీధర్ చెంప మీద పడింది.
దేవ్: ఏం మాట్లాడుతున్నావ్ బావ.
మురారి: ఏయ్.. ఎవడ్రా నీకు బావ..
దేవ్: ఉంగరం నాదే కానీ నేను ఏం చేయించలేదు షాపులో కొన్నాను. ఇలాంటి ఉంగరం ఇంకా ఎవరూ కొనరా..
భవాని: అదే కదా మురారి అలాంటి రింగ్స్ ఎవరైనా కొనొచ్చు కదా.. దానికి మీరు ఇలా గొడవ చేయడంలో అర్థం లేదు.
పరిమళ: అప్పుడే పరిమళ పోలీసులు భవాని ఇంటికొచ్చి.. అర్థముంది మేడం. నూరుకి నూరు శాతం అర్థముంది. మురారి ప్రణతి గోల్డ్ షాపులో ఆరు రోజుల క్రితం రింగ్ కొన్నాడురా ఇదిగో బిల్.
దేవ్: మీరే ఆర్టిఫిషియల్..
మురారి: వర్మ ఫుటేజ్ లేదా..
వర్మ: ఉంది సార్.. ఇప్పుడే ఇస్తాను. అంటూ పెన్‌డ్రైవ్ చేతికిస్తూ..
దేవ్: అవసరం లేదు నా చెల్లెలు ఆనందం కోసమే నేను ఈ పని చేశాను. ముకుందతో పాటు అందరూ షాక్ అవుతారు. కానీ ఈ విషయాలు ఏవీ తనకు తెలీదు.
ముకుంద: సీరియస్‌గా దేవ్ చెంప చెల్లుమనిపించి.. నాకు ఎందుకురా చెప్పలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. ఎందుకు ఇలా చేశావ్.. చెప్పు మాట్లాడు దేవ్.. అని ఏడుస్తుంది. ఇక పోలీసులు దేవ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను