Gruhalakshmi Serial Today Episode: రాజ్యలక్ష్మీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తాడు బసవయ్య. నీ తెలివితో దివ్యను నిజంగానే పిచ్చిదాన్ని చేశావు అక్కయ్య అంటూ ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టామని మరి నాకెందుకు ఇన్ని తెలివి తేటలు రాలేదని అడుగుతాడు బసవయ్య, రాజ్యలక్ష్మీని. అవన్ని వదిలేయ్‌ ఇంతకీ విక్రమ్‌ పరిస్థితి ఏంటంటావ్‌ అంటూ అడుగుతంది. రాజ్యలక్ష్మీ.


బసవయ్య: అనటానికి ఎముందక్కాయ్‌.. కుడితిలో పడ్డ ఎలుకే.. అటు దివ్య వైపు నిలబడలేక ఇటు నీకు సమాధానం చెప్పలేక.. గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇక వెతుకులాటకి మంగళం పాడేస్తాడు.


రాజ్యలక్ష్మీ: మంగళం పాడతాడో.. మంగళహారతే పాడతాడో.. అమ్మ మాట కాదని పెళ్లాం కొంగుపట్టుకుని తిరుగుతే ఎలా ఉంటుందో.. వాడికి తెలిసి వచ్చేలా చేస్తాను.


బసవయ్య: ఇందాక నువ్వు ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే.. వంటాముదం తాగినట్లు ముఖం పెట్టాడు. అర్థం అవ్వలా వాడి పరిస్థితి ఏంటో..


అనగానే రాజ్యలక్ష్మీ మరీ క్రూరంగా ఆలోచిస్తుంది. తర్వాత దివ్య కడుపులో బిడ్డను చంపేసుకునేలా చేయాలని ప్లాన్‌ వేస్తారు. మరోవైపు నంద గదిలోకి లాస్య రావడంతో కోపంగా నంద గదిలోకి ఎందుకొచ్చావని అడుగుతాడు. అందుకు లాస్య భర్త గదిలోనే కదా భార్య ఉండాల్సింది అందుకే నీ గదిలోకి వచ్చానని చెప్తుంది. దీంతో నంద కోప్పడితే.. నీ మీద ప్రేమ కోసం ఎంత వరకైనా తెగించేలా చేయాలనిపిస్తోంది అంటుంది.


నంద: మన మధ్య ఉన్న బంధం పగిలిపోయిన అద్దం లాంటిది. అతుక్కోదు. అర్థం చేసుకో మనం ఈ ఇంట్లో కలిసి ఉండేది కేవలం కొద్ది రోజులే.. నాన్నకు నయం కాగానే నువ్వు ఈ ఇంట్లో ఉండవు.


లాస్య: ఓ అప్పుడే ప్యూచర్‌ ప్లాన్‌ కూడా రెడీ చేసుకున్నావన్నమాట..


నంద: ఎస్‌ అర్జంట్‌గా ఈ గదిలోంచి వెళ్లు.. పడుకోవాలి నిద్ర వస్తుంది.


అనగానే నేను వెళ్లను అంటూ లాస్య చెప్పి అక్కడే కూర్చుంటుంది. నంద ఇరిటేటింగ్‌ ఫీలవుతూ.. దిండు, దుప్పటి తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. పరంధామయ్య హాల్లో కూర్చుని ఉండటంతో నంద మళ్లీ రూంలోకి వెళ్లిపోతాడు.


లాస్య: నాకు తెలుసు బాసు.. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగి ఇక్కడికే వస్తావని.. ఇక్కడ బెడ్ ఖాళీగానే ఉంది ఇక్కడకు వచ్చి పడుకోవచ్చు.


నంద: నోరు మూసుకుని పడుకో..


అనగానే లాస్య పడుకుంటుంది. బయట కూర్చుని చూస్తున్న పరంధామయ్య నంద వాళ్ల రూం దగ్గరకు వెళ్లి లోపల ఏం జరుగుతుందోనని వినబోతుంటే.. అనసూయ వచ్చి పరంధామయ్యను తీసుకెళ్లుతుంది. కొద్దిసేపు తర్వాత లాస్య బయటకు వచ్చి కూర్చోవడంతో పరంధామయ్య వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావని అడగడంతో లాస్య కట్టుకథలు చెప్తుంది.


దీంతో పరంధామయ్య కోపంగా నందాను తెల్లారిన తర్వాత దులిపేస్తానని చెప్పడంతో మీరెన్ని చెప్పినా విన్నట్లు నటిస్తాడని.. తర్వాత పట్టించుకోడని.. తులసి అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్తుంది లాస్య.  తులసిని ఇంట్లోంచి బయటకు గెంటివేద్దామని పరంధామయ్య అనడంతో.. అలా కాదు మామయ్య ఈ ఇంటిని తులసి పేరు మీద రాశారు. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్‌ అని చెప్తుంది. దీంతో పరంధామయ్య అలోచనలో పడిపోతాడు.


ముసలోడు ఆలోచిస్తున్నాడు. రేపో మాపో ఈ ఇల్లు నా పేరు మీద రాస్తాడు. అప్పుడు చెప్తాను. అని మనసులో అనుకుంటుంది లాస్య. మరోవైపు విక్రమ్‌ చందన ఫోటో పట్టుకుని వెతుక్కుంటూ తిరుగుతుంటాడు. ఎంత వెతికినా చందన ఆచూకీ తెలియదు. మరోవైపు పరంధామయ్య అందరినీ పిలిచి ఈ ఇల్లు తులసి పేరు మీద ఉంది కదా.. ఇది నేనే తులసికి రాసిచ్చాను కదా? ఇప్పుడు ఈ ఇల్లు తిరిగి నా పేరు మీదకు చేసుకోవాలనుకుంటున్నాను. అంటూ బాంబు పేలుస్తాడు.


దీంతో అనసూయ పరంధామయ్యను తిడుతుంది. ఎవరు? ఎవరికి అన్యాయం చేశారో ఆయన మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదని అనడంతో ఈ ఇంటి యజమాని మామయ్య. ఆయన చెప్పిందే ఇక్కడ ఫైనల్‌ అంటుంది తులసి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను