తెలుగులో పలు టీవీ సీరియళ్లు, టీవీ షోస్‌లో నటించిన ప్రియాంక నల్కారి గురువారం (మార్చి 23న) పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించి వ్యక్తితో ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా గుడిలో తాళి కట్టించుకుంది. #JustMarried అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు ఆమెకు వెడ్డింగ్ విషెస్ చెబుతున్నారు. ప్రియాంక తన స్టేటస్‌లో కూడా ఒక ఫొటో, వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రియాంక తన కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక, రాహుల్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
వరుడు ఎవరు? 2018లోనే ఎంగేజ్మెంట్?
ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి రాహుల్ వర్మ అనే ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఇతడు కూడా తెలుగులో పలు సీరియళ్లో నటించాడని, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసింది. అయితే, వీరికి 2018లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అదే సమయంలో ప్రియాంక టీవీ సీరియళ్లలో బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో రాహుల్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని మలేషియా వెళ్లిపోయాడని తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక తమిళంలో సెటిలైంది. ‘సన్ టీవీ’లో ప్రసారమయ్యే ‘రోజా’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే జీ-తమిళ్‌లో ప్రసారమయ్యే ‘సీతారామన్’ సీరియల్‌లో కూడా నటిస్తోంది. దీంతో ఆమె తెలుగు షోస్, సీరియళ్లలో కనిపించడం లేదు.
తెలుగులో ఫలించని ప్రయత్నాలు
ప్రియాంక తెలుగులో బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. అయితే, తమిళనాడులో వచ్చినంత పాపులారిటీ ఇక్కడ లభించలేదు. తెలుగులో ‘జబర్దస్త్’ గెటప్ శ్రీనుతో కలిసి ‘ఈటీవీ ప్లస్’లో ప్రసారమైన ‘సినిమా చూపిస్తా మామ’లో యాంకర్‌గా మెప్పించింది. అయితే, ఆ షో అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు అవకాశాలు కూడా దక్కలేదు. చివరికి ఆమెకు తమిళ సీరియల్‌లో అవకాశం లభించింది. ‘రోజా’ సీరియల్‌కు మంచి టీఆర్పీ లభించడంతో ప్రియాంకకు పాపులారిటీ సంపాదించింది. అయితే, ఆమె ఇంత సింపుల్‌గా ఎందుకు పెళ్లి చేసుకుందనేది తెలియాల్సి ఉంది. ప్రియాంక స్వస్థలం హైదరాబాద్. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ మూవీలో నటిగా పరిచయమైంది. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది.
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు