Madhuranagarilo July 26th: శ్యామ్ న్యూస్ పేపర్ లో అలా అనౌన్స్ చేయించటంతో అపర్ణ మధుర పై ఫైర్ అవుతూ ఉంటుంది. అలా ఎలా చేస్తాడు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. వెంటనే సంయుక్త ఇది శ్యామ్ పని కాదు రాధ వెనకాల ఉండి నడిపించింది. మా ఇద్దరిని కలుపుతానని చెప్పి తను శ్యామ్ ను వలలో వేసుకుంది. ఇప్పుడు పెళ్లి కోసం ఇలా ప్లాన్ చేసింది అని రాధ గురించి నోటికొచ్చినట్టు చెబుతుంది.


కానీ ఆ మాటలు మధుర అస్సలు నమ్మదు. మరోవైపు గన్నవరం బ్యాచ్ మొత్తం న్యూస్ పేపర్లో శ్యామ్ ఇచ్చిన ప్రకటన చూసి షాక్ అవుతారు. ఇలా ఇచ్చాడు ఏంటి అని ఒకరికొకరు చర్చ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాధమ్మ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడతారు. వెంటనే రాధ దగ్గరికి వెళ్లి అడుగుదామని బయలుదేరుతారు. ఇక రాధ ఇంట్లో ఉండగా గన్నవరం వాళ్ళు పిలవడంతో బయటికి వస్తుంది.


ఇక వాళ్ళు పేపర్ ఇచ్చి ఆ న్యూస్ చూడమని అనడంతో రాధ అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి మధురవాళ్ళు కూడా వస్తారు. అపర్ణ, సంయుక్త కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక గన్నవరం వాళ్లంతా శ్యామ్ దే తప్పు అన్నట్లుగా మాట్లాడటంతో మధురకు కోపం వస్తుంది. కానీ సంయుక్త ఇదంతా రాధ పని అనటంతో రాధ అలా చేసి ఉండదు.. రాధ మనసు అటువంటిది కాదు అని రాధ ని వెనకేసుకొస్తుంది.


వెంటనే సంయుక్త అసలు విషయం తెలియాలంటే గుడికి వెళ్ళాలి అని అక్కడికి బయలుదేరుతారు. ఇక శ్యామ్ పెళ్లి కొడుకు గెటప్ లో ఉండగా అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి ఇలా ఎందుకు ప్రకటించారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడే రాధ అక్కడికి రావడంతో తననే అడగండి అని అంటాడు శ్యామ్. దాంతో రాధ లాగి గట్టిగా కొడుతుంది.


ఇక అందరూ షాక్ అవుతారు. ఎందుకిలా చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే రాధ జీవితం పాడవుతుంది అని మధురం ఉంటుంది. అపర్ణ కూడా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. దాంతో శ్యామ్ నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ.. నేను ఎందుకు ఇలా చేశానో చెబుతాను అని మ్యాటర్ లోకి వెళ్తాడు. గతంలో రాధ గుడికి వచ్చినప్పుడు తన భర్త ఇక్కడే ఉన్నాడని పూనకం వచ్చిన ఆవిడ చెప్పటంతో అతను ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకోవడానికి ఇలా చేశాను అని అంటాడు.


రాధ భర్త ఇక్కడికి రావడం కోసమే ఇలా ప్రకటించాను అని అంటాడు. దానితో మధుర, గన్నవరం వాళ్లు శ్యామ్ చేసిన పని మంచిదే అని ఫిదా అవుతారు. దాంతో మధుర వెంటనే సంయుక్త వాళ్లకు చూశారా తను ఏది చేసినా మంచి పని చేస్తాడు అని తిరిగి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడుతుంది. ఇక గన్నవరం వాళ్లు కూడా మేము ఆవేశంలో నిన్ను తప్పుపట్టాము అని క్షమాపణలు చెప్పుకుంటారు.


ఇక రాధ సమాధానం చెప్పమని అనటంతో.. తన మనసు చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రాధ శ్యామ్ కు సారీ చెప్పటానికి వెళ్ళగా శ్యామ్ డోర్ పెడతాను అప్పుడు సారీ చెప్పు అని అంటాడు. డోర్ పెట్టగా వెంటనే పండు ఆ డోర్ తోస్తాడు. నేరుగా రాధ శ్యామ్ మీద పడి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అది పండు చూసేస్తాడు.


also read it : Prema Entha Madhuram July 25th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: పిల్లలతో అత్తారింటికి వెళ్లనున్న అను, జైల్లో ఉన్న మాన్సీకీ సత్తెమ్మ సపోర్ట్ దొరకనుందా?


 



Join Us on Telegram:  https://t.me/abpdesamofficial