Madhuranagarilo July 17th: పోలీస్ స్టేషన్లో ఉన్న శ్యామ్ ఇన్స్పెక్టర్ తో తను ఈవ్ టీజింగ్ చేయలేదు అని అమ్మాయి తనకు తెలుసు అని చెబుతూ ఉంటాడు. అమ్మాయిని ప్రేమిస్తున్నానని. తనను ప్రపోజ్ చేశాను అని అనడంతో ఇన్స్పెక్టర్ అది ఈవ్ టీజింగ్ కిందికే వస్తుంది అని అంటాడు. సంతోషం కావాలంటే నేను తనకు ఫోన్ చేసి మాట్లాడుతాను అని అనటంతో ఇన్స్పెక్టర్ చేయమని ఒప్పుకుంటాడు.


మరోవైపు రాధ జరిగిన విషయం గురించి తలుచుకుంటుంది. అప్పుడే తనకు శ్యామ్ ఫోన్ చేయటంతో ఆ విషయం గురించి మాట్లాడటానికి చేస్తున్నాడేమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయదు. వెంటనే ఇన్స్పెక్టర్ కు అనుమానం వస్తుంది. ఇక మళ్లీ మరోసారి ప్రయత్నిస్తాను అనటంతో మరోసారి కూడా రాధ ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ నువ్వు అంత అబద్దమాడుతున్నావు అంటూ శ్యామ్ ని నిందిస్తాడు.


 ఇక శ్యామ్ ఇన్స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేసి తన ఫోన్ అడుగుతాడు. శ్యామ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ నుండి రాధకు ఫోన్ చేయడంతో..  వెంటనే రాధ శ్యామ్ తన ఫ్రెండ్ ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నాడేమో అనుకొని కోపంతో కట్ చేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ కట్ చేస్తుంది అనటంతో మరోసారి ట్రై చేస్తాను కచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది అని అంటాడు శ్యామ్. ఈసారి లిఫ్ట్ చేయకపోతే మరోలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు ఇన్స్పెక్టర్.


 ఇక మళ్లీ అదే నెంబర్ నుండి ఫోన్ రావటంతో ఎవరు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేస్తున్నారేమో అని లిఫ్ట్ చేయగా వెంటనే ఫోన్ ఇన్స్పెక్టర్ తీసుకుంటాడు. మొత్తం విషయం చెప్పటంతో తనదేమి తప్పులేదు అని రాధ తనను వదిలేయమని అంటుంది. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను అని అక్కడి నుంచి రాధ బయలుదేరుతుంది. మరోవైపు నెల్సన్ తన భార్యకు సమంత కట్టిన చీర తీసుకొని రావటంతో శిరోజా  గుర్తుపట్టి నెల్సన్ ను బాగా చితక్కొడుతుంది. అది చూసి గన్నవరం వాళ్లు తెగ సంతోషపడతారు.


పోలీస్ స్టేషన్ కి వచ్చిన రాధ శ్యామ్ శ్రీరాముడు లాంటివాడని గొప్పగా చెబుతుంది. ఇక తను నిన్ను ప్రేమిస్తున్నాడు అంట అని ఇన్స్పెక్టర్ అనటంతో అవును కానీ తను మాత్రం ప్రేమించటం లేదు అని చెబుతుంది. అయితే తన తల్లిదండ్రులను ఇక్కడికి వచ్చి అతని తీసుకెళ్లమని చెప్పమని ఇన్స్పెక్టర్ వాళ్ళు రాలేరు అని ఎందుకంటే ఈయనకు మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగిందని ఈ విషయం తెలిసే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పటంతో ఇన్స్పెక్టర్ వారిని వదిలేస్తారు.


ఆ తర్వాత రాధ శ్యామ్ ఒక చోట నిలబడి రాధ శ్యామ్ తో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని ఆడవాళ్లు అంటే గౌరవం ఇచ్చే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు చాలా మారిపోయారు అని అనడంతో దాంతో అవును అంటే తన మనసులో ఉన్న మాటలన్నీ బయటకి చెప్పేస్తాడు. రాధ మాత్రం మీ పెళ్లి గురించి అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని  చెబుతుంది.


 ఇక తరువాయి భాగంలో రాధ సంయుక్త బోనం ఎత్తుకుంటారు. ఇక సంయుక్త రాధ బోనం అమ్మవారికి సమర్పించకుండా చేయాలని తన తల్లికి చెప్పటంతో తన బోనం అమ్మవారికి దక్కకుండా నేను చేస్తాను అని అంటుంది. ఒక ఆవిడ చేతిలో ఉన్న నిప్పు రవ్వలు కింద పడటంతో రాధ అటువైపు నుండే వస్తుంది.


also read it : Prema Entha Madhuram July 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ : కన్న కొడుకుతో కలిసి యాగం చేస్తున్న ఆర్య.. అను పూజకు అడ్డుపడుతున్న మాన్సీ?



Join Us on Telegram:  https://t.me/abpdesamofficial