హేంద్రని రిషి డాడ్ అని పిలవడం విని ఏంజెల్ షాక్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ రిషి డాడ్ అనలేదని అబద్ధం చెప్పి కవర్ చేసేందుకు చూస్తారు. విశ్వం వస్తే రిషి ఇందాక మహేంద్ర సర్ ని డాడ్ అని పిలిచాడని చెప్తుంది. అలా ఎందుకు పిలుస్తాడు నువ్వు పొరపాటు పడి ఉంటావు. అయినా పిలిస్తే తప్పేముంది వయసులో పెద్ద వాడు గురువుతో సమానమని విశ్వనాథం కన్వీన్స్ చేస్తాడు. దీంతో ఏంజెల్ మౌనంగా ఉంటుంది. రిషి ఏం మాట్లాడకుండా డల్ గా వెళ్ళిపోతాడు. ఇక జగతిని వసుధార గదికి తీసుకెళ్ళి చూపిస్తుంది. మీరు ఉండాల్సింది ఈ గదిలోనే మీకు కావలసిన ఏర్పాట్లు చేసి పెట్టామని చెప్తుంది. నిన్ను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉందని జగతి వసుని పట్టుకోబోతుంటే విదిలించుకుంటుంది.


వసు- జగతి: రిషి సర్ కి దగ్గరగా మాత్రమే ఉన్నాను ఆయన మనసులో కాదని అంటుంది. రిషి విషయంలో చాలా భయపడ్డాను శైలేంద్ర ఏం అపాయం తల పెడతాడోనని ఆలోచించాను. ఒక తప్పుడు సాక్ష్యం నిన్ను దూరం పెట్టడానికి కారణం అయ్యాను. చివరికి మీ అమ్మ చనిపోవడానికి కూడా పరోక్షంగా కారణం అయ్యాను. నా కొడుక్కి మంచి చేయడం కోసం నీకు అన్యాయం చేశాను. ఇప్పుడు ఏం అనుకుని ఏం ప్రయోజనం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతం గురించి తీయొద్దు మేడమ్. నీకోసం తిరగని ఊరు లేదు వెతకని చోటు లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావని మహేంద్ర చెప్పేసరికి మనసు కుదుటపడింది. ప్లీజ్ కాసేపు మాట్లాడు వసు. మాట్లాడటానికి ఏమి లేదు ఇప్పుడు మనం గురుశిష్యులం కాదు పోనీ అత్తాకోడలు అంటే నా భర్త నన్ను దూరం పెట్టాడు. నా బంధం నన్ను దగ్గరకి తీసుకునే వరకు నేను మీతో మాట్లాడలేను. నేను ఇక్కడ విష్ కాలేజ్ లెక్చరర్ ని మాత్రమే. మీతో మాట్లాడుతూ రిషి సర్ కి దూరం కాలేను. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను కాదు ఏంజెల్ ని పిలవండి


Also Read: దొంగని పట్టుకొచ్చిన లాస్య, పిచ్చోడిలా నమ్మేసిన విక్రమ్ - నందు, తులసికి మళ్ళీ పెళ్ళా?


అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఎంత విచిత్రంగా ఉందో మీరందరూ ఎవరో కానీ అందరూ ఒకే కుటుంబం మాదిరిగా ఇక్కడ ఉన్నామని విశ్వనాథం అనేసరికి రిషి షాక్ అవుతాడు. మీరు కూడా ఒకే కుటుంబంలాగా ఫీలవమని చెప్తాడు. ఫీల్ అవడం కాదు మా అందరిదీ ఒకే కుటుంబమని వసు మనసులో అనుకుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీతో కలిసి భోజనం చేసే అదృష్టం దక్కిందని మహేంద్ర మనసులో సంతోషపడతాడు. ఇలా అందరం కలిసి తింటుంటే చాలా బాగుందని ఏంజెల్ అంటుంది. ఆ మాటకి రిషికి పొలమారుతుంది. వెంటనే జగతి కంగారుగా వాటర్ ఇస్తుంటే రిషి తీసుకుంటూ ఒక్కసారిగా ఆగిపోతాడు. తల్లీ, కొడుకులు కళ్ళతోనే నటించి జీవించేస్తున్నారు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.


విశ్వనాథం: మీ డీబీఎస్టీ కాలేజ్ కి పేరు ప్రఖ్యాతలు రావడం కోసం ఏం చేశారు


మహేంద్ర: అందుకు కారణం మా ఎండీ. తను కాలేజ్ కోసం తీసుకునే నిర్ణయాలు అందుకు కారణం


ఏంజెల్: అంటే ఈ మేడమ్ ఆలోచనలు కూడా రిషి ఆలోచనలు మాదిరిగా ఉన్నాయి. కాదు కాదు రిషి ఆలోచనలే మేడమ్ లాగా ఉన్నాయి.


విశ్వం: రిషి మన కాలేజ్ కి అవసరమైన విషయాలు మేడమ్ దగ్గర అడిగి తెలుసుకో.. ఆ మాటకి టీషి మౌనంగా ఉంటాడు. రిషి మౌనమే మనకి సమాధానం కదా అవసరమైతే తెలుసుకుంటాడులేనని ఏంజెల్ సపోర్ట్ చేస్తుంది. మహేంద్ర వాళ్ళు వెళ్లిపోతారు. రిషి అలాగే ఉంటాడని జగతితో అంటుంది.


జగతి: రిషి నీకు ఎప్పటి నుంచి తెలుసు


ఏంజెల్: చాలా ఏళ్లుగా తెలుసు. తను నేను కాలేజ్ లో కలిసే చదువుకున్నాం. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిషి కనిపించాడు. తనని కాపాడటం కోసమే నేను కనిపించాను ఏమో


జగతి: కాపాడుకోవడం ఏంటి రిషి సర్ కి ఏమైంది


Also Read: స్వప్నకి యాడ్ షూట్ ఆఫర్- డిజైన్స్ వేస్తుంది కళావతేనని తెలుసుకున్న రాజ్, కావ్యకి కొత్త కష్టాలు?


ఏంజెల్: కొనఊపిరితో ఉన్న రిషికి ట్రీట్మెంట్ చేయించింది నేనే కదా మేడమ్ అనేసరికి ఇద్దరూ షాక్ అవుతారు.


జగతి: ఏంటి నువ్వు అనేది


ఏంజెల్: కొన్ని సంవత్సరాల క్రితం రిషిని ఎవరో కత్తితో పొడిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిషిని నేను, విశ్వం వెళ్ళి కాపాడుకున్నాం