Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ప్రస్తుత పరిస్థితులు చక్కపడాలంటే మీరు కూడా పెళ్లికి ఒప్పుకోండి. పెళ్లి ముహూర్తానికి మీ భర్తని వెతికి తీసుకొని వస్తాను అతని డీటెయిల్స్ చెప్పండి అంటాడు ఆర్య.
అను: మీరు అలా మాట్లాడకండి నాకు ఇష్టం లేదు ఈ జన్మకి నా పిల్లలకి నేను, నాకు వాళ్ళు అంతే అంటూ ఏడుస్తుంది.
ఆర్య : ఈ పెళ్లి జరగడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పెళ్లి ముహూర్తానికల్లా మీ భర్తని తీసుకు వస్తాను లేదంటే మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి ఆ త్యాగం ఏదో నేనే చేస్తాను అంతేకానీ మీకు మాత్రం అన్యాయం జరగనివ్వను అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఆర్య మాటలు తలుచుకొని ఏడుస్తుంది అను. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే నేను అందరికీ దూరంగా వెళ్లిపోవాలి దీని వలన సార్ ని జీవితాంతం బాధ పెట్టిన దాన్ని అవుతాను అయినా తప్పదు అనుకుంటుంది.
మరోవైపు యాదగిరి కోసం గదిలోకి నీళ్లు తీసుకువచ్చిన జ్యోతి గదంతా అగరొత్తుల పొగతో నింపేసిన యాదగిరిని ఏంటిది అని అడుగుతుంది.
యాదగిరి: మనకి కొత్తగా పెళ్లయింది కదా ఫస్ట్ నైట్ ప్రోగ్రాం అంటాడు.
దాంతో జ్యోతి మెలికలు తిరిగిపోతుంది. మీలో ఎంత మార్పు. ఎలా ఉండేవారు ఎలా మారిపోయారు అని ఆనందపడుతుంది.
యాదగిరి: మరీ ఓవర్ యాక్షన్ చేయకు బీరువాలో పువ్వులు ఉన్నాయి వెళ్లి తీసుకురా అనటంతో మరింత ఆనందంగా వెళ్లి పువ్వులు తీసుకొస్తుంది జ్యోతి.
యాదగిరి: ఆ పొట్లం తీసుకొని ఇవి పువ్వులు కాదు పకోడీ అని చెప్పి అక్కడ మందు సెటప్ పెడతాడు. అది చూసి షాక్ అవుతుంది జ్యోతి.
జ్యోతి: ఈ పని చేయటానికా ఎంత బిల్డప్ ఇచ్చింది అంటూ మూతి ముడుచుకుంటుంది.
యాదగిరి : దేవుడు లాంటి మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు గదిలోనే చేయాలి అంటాడు.
జ్యోతి: మా అన్నయ్య మీకు ఏ మందు పెట్టాడో తెలియదు కానీ తెగ సపోర్ట్ చేస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది.
యాదగిరి: మీ అన్నయ్య గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావంటే ఇదే మందులో విషయం కలిపి నీ చేత తాగించేస్తాను అనటంతో సైలెంట్ గా వెళ్లి పడుకుండిపోతుంది.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన సుగుణ పిల్లలందరితో ఇల్లు శుభ్రం చేయమని చెప్తుంది ఎందుకు అని అడుగుతారు ఉష వాళ్ళు.
సుగుణ: పిల్లల మాల తీసే కార్యక్రమం ఉంది. పిల్లలు ఆరోగ్య దృష్ట్యా క్షమాపణ చెప్పి మాల తీసేయవచ్చుట గురుస్వామి ఆ పని స్వయంగా చేస్తానన్నారు పిల్లలు మాలలో ఉండగా పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదంట అందుకే ఈ హడావిడి అంటుంది.
దివ్య: మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసారు కదా అంటుంది.
సుగుణ: నేను మాట్లాడేది రాధ, సూర్య లో పెళ్లి గురించి అంటుంది.
అను: నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు అంటుంది.
సుగుణ: ఇంత జరిగినా కూడా నీ ఆలోచనలో మార్పు రాలేదా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను.
ఆర్య కూడా తల్లిని మందలిస్తాడు అయినా సుగుణ వినిపించుకోకుండా ఈరోజు అటో, ఇటో తేలిపోవాలి పిల్లల్ని కూడా తీసుకొని రా అని చెప్పి ఉష ని పంపిస్తుంది సుగుణ.
అయితే గదిలో పిల్లలు కనిపించరు అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది ఆ లెటర్ చదివిన ఉష కంగారుపడి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది.
పిల్లలిద్దరూ అమ్మ ఫ్రెండ్ తో పెళ్ళికి ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు మనం ఒక పని చేద్దాం అనుకుంటూ పేపర్ మీద మేము ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాము. అమ్మ.. నువ్వు ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నట్లయితే వెనక్కి వస్తాము అని రాసి దేవుడి దగ్గర పెట్టి వెళ్ళిపోతారు.
ఆ లెటర్ ని చదివిన ఆర్య కంగారుపడి యాదిగిరిని తీసుకొని పిల్లల్ని వెతకడానికి వెళ్తారు. మరోవైపు ఉష అను కూడా పిల్లల్ని వెతకడానికి వెళ్తారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.