Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తల్లిని వెతకటానికి వెళ్లిన పిల్లలకి అను ఎక్కడ కనిపించదు.


అక్కి: అమ్మ కావాలనే దాక్కుంటునట్లుగా అనిపిస్తుంది, ఎందుకు ఇలా అందరికీ దూరంగా ఉంటుంది.


అభయ్: నాకు ఒక ఐడియా వచ్చింది నాతో రా  చెప్తాను అని చెల్లెల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తాడు.


సుబ్బు: పిల్లలు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తానని వెళ్లారు ఇంకా రాలేదు ఆలస్యం అవుతుంది నేను బయలుదేరుతాను అంటాడు.


అంతలో ఆర్య, యాదగిరి ఇద్దరు బయటినుంచి వస్తారు. ఇదంతా కిటికీలోంచి చేస్తున్న అను ఆర్య సుబ్బు ఒకరిని ఒకరు చూస్తారేమో అని కంగారు పడిపోతుంది. ఆమె అనుకున్నట్లే ఆర్య సుబ్బు ఒకరిని ఒకరు చూసుకుని ఇద్దరు షాక్ అయిపోతారు.


సుగుణ: ఇతనే నా కొడుకు సూర్య  అని పరిచయం చేస్తుంది. అలాగే పిల్లలు సుబ్బుకు చేసిన సఫర్యల గురించి ఆర్య కి చెప్పి సుబ్బు ని పరిచయం చేస్తుంది.


సుబ్బు: ఏమి తెలియని వాడిలాగా ఆర్యకి నమస్కరించి మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.


ఆయనని పంపించి వస్తాను  అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత తను ఇక్కడ సూర్య లాగా ఎందుకు ఉంటున్నది చెప్పాలనుకుంటాడు ఆర్య.


సుబ్బు : మీరు నాకు ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తున్నారు సార్, మీరు ఏదైనా చేశారంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది.


ఆర్య : నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం మీరు అర్థం చేసుకున్నట్లు అను నన్ను అర్థం చేసుకొని ఉంటే తన కష్టం నాకు చెప్పుకునేది, ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు.


సుబ్బు: జరిగిపోయిన దానికోసం బాధపడటం ఎందుకు ఎప్పటికైనా మీరు కలుస్తారు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.


ఇదంతా కిటికీలోంచి చూస్తున్న అను ఆ మాటలు విని బాధపడుతుంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఏంటి సార్ మీకోసమే, మీరు క్షేమంగా ఉండాలనే నేను మీకు దూరంగా ఉంటున్నాను. నాలో నేను నలిగిపోవడమే కానీ నా బాధను ఎవరితో  చెప్పుకోలేను అనుకుంటుంది. ఆ తర్వాత గదిలోంచి బయటికి వచ్చిన అనుతో


సుగుణ : ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు పిల్లలు నీకోసమే వెతుకుతూ బయటికి వెళ్లారు ఇంకా రాలేదు.


అను ఏమి తెలియనట్లుగా అవునా నేను లోపలే ఉన్నాను అంటుంది.


సుగుణ ఆర్యని పిలిచి పిల్లలు బయటికి వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఒకసారి వెళ్లి చూడు అని చెప్తుంది. ఇంతలో అయ్యప్ప మాల వేసుకొని పిల్లలిద్దరూ వస్తారు వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.


సుగుణ: ఎవరికీ చెప్పకుండా ఇలా మాల వేసుకున్నారు ఏంటి అని అడుగుతుంది.


యాదగిరి : ఇందాక ఒక పెద్దాయన వచ్చారు కదా ఆయనే ఈ పిల్లలిద్దరికీ మాల వేయించి ఉంటారు అని అంటాడు.


పిల్లలిద్దరూ ఏమీ మాట్లాడకుండా తండ్రి దగ్గరకి వెళ్తారు. ఆర్యతో వాళ్లు గడిపిన క్షణాలని తలచుకొని బాగా ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ ఆర్య పాదాలకి నమస్కరించి నాన్న అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.


అను: వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారేంటి, నాన్న వీళ్ళకి నిజం చెప్పేసాడా అని కంగారు పడిపోతుంది.


ఉష: మీరేంటి మా అన్నయ్యని నాన్న అని పిలుస్తున్నారు అని అడుగుతుంది.


ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు ఏం చెప్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: రైతుబిడ్డ కోసం పాటబిడ్డ న్యాయపోరాటం - అందుకే అలా జరిగిందన్న భోలే