Prema Entha Madhuram  Serial Today Episode:  గౌరి, శంకర్‌లు ఇంట్లోకి వెళ్లి రాజనందిని ఫోటో చూస్తూ అలాగే నిలబడిపోతారు. వాళ్ల వెనకాలే వచ్చిన శ్రావణి, సంధ్య, చిన్నొడు పెద్దొడు వస్తారు. ఈ ఫోటో ఎవరిది అని అడుగుతారు. అకి వచ్చి మా పెద్దమ్మది అని చెప్తుంది. జెండే వచ్చి వర్దన్‌ కుంటుంబానికి ఆవిడ ఓ దేవత లాంటిది అని చెప్తాడు. శ్రావణి ఆవిడ పేరేంటి అని అడగ్గానే శంకర్‌ రాజనందిని అని చెప్తాడు. గౌరి కూడా రాజనందిని అని చెప్తూ నేనే రాజనందిని  అంటుంది. అందరూ షాక్‌ అవుతారు. అకి హ్యాపీగా ఫీలవుతుంది.


పెద్దొడు: మీ ఇద్దరికీ ఏమైంది చాలా డిఫరెంట్‌ గా బిహేవ్‌ చేస్తున్నారేంటి..?


చిన్నొడు: తన పేరు నీకెలా తెలుసు అన్నయ్యా..


జెండే: ఒకసారి మాటల సందర్భంలో శంకర్‌ కు నేనే చెప్పాను.


శ్రావణి: నువ్వేంటి అక్కా ఆవిడ ఫోటో చూసి అలా అయిపోయావు. పైగా నేనే రాజనందిని అంటున్నావు.


సంధ్య: మే బీ అక్కకు తన గురించి ముందే తెలిసినట్టుంది.


శ్రావణి: ఆ ఫోటోలో ఏదో వెలుగు కనిపిస్తుంది.


జెండే: మీరు రావడం తనకు చాలా ఆనందంగా అనిపించినట్టు ఉంది. అందుకే ఆ వెలుగు కనబడుతుంది. ఐ మీన్‌ మేమంతా కూడా చాలా రోజుల తర్వాత వచ్చాం కదా..!


ఇంతలో అభయ్‌, రాకేష్‌ వస్తారు. అక్కడ బైకులు చూసిన రాకేష్‌ వీళ్లంతా వచ్చేశారన్నమాట. ఇప్పుడు అభయ్‌  లోపలికి వెళ్లి వాళ్లు తన అమ్మా నాన్నా అని తెలుసుకుంటాడు అనుకుని నువ్వు వెళ్లు అభయ్‌ నేను వస్తాను అని చెప్పగానే అభయ్‌ లోపలికి వెళ్తుంటాడు. రాకేష్‌ టెన్షన్‌ పడుతుంటాడు. లోపలికి వెళ్లిన అభయ్ కోపంగా బయటకు వచ్చి రాకేష్‌ను తిడుతూ నువ్వే జలంధర్ కొడుకువారా రాస్కెల్‌ అని తిడుతూ కొడుతుంటాడు. ఇంతలో అభయ్‌  రాకేష్‌ను గట్టిగా తట్టగానే ఉలిక్కి పడి రాకేష్‌ ఇదంతా నేను కలగన్నానా? అనుకుంటాడు రాకేష్‌. ఇంతకీ ఏం జరిగింది అభయ్‌ అని అడుగుతాడు. వాళ్లు వెళ్లిపోయారట అని అభయ్‌ చెప్పగానే రాకేష్‌ ఊపిరి పీల్చుకుంటాడు.


అభయ్‌: చూశావా? మనం చెప్పకపోయినా మనమే అర్థం చేసకుని వెళ్లిపోయారు. ఫ్రెండ్‌ చెప్పింది నిజమే రాకేష్‌ వాళ్లు చాలా మంచివాళ్లలా ఉన్నారు. అకి చెప్పినట్టు వాళ్లను ఒకసారి కలవాలి.


అని చెప్తాడు. మరోవైపు గౌరి, శంకర్‌ వాళ్లు వేరే ఇంట్లోకి వెళ్తారు. సంధ్య తన బ్యాగ్‌ అకి వాళ్ల ఇంట్లో మర్చిపోయాను అని చెప్తుంది. చిన్నొడు నేను వెళ్లి తీసుకొస్తానని చెప్పగానే ఏమీ వద్దని నేనే వెళ్లి తీసుకొస్తానని చెప్తుంది గౌరి. దీంతో శంకర్‌, గౌరికి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత సంధ్య బ్యాగ్‌ కోసం అకి వాళ్ల ఇంటికి వెళ్లిన గౌరిని చూసి రాకేష్‌ భయపడతాడు.


రాకేష్‌: ఇది ఇప్పుడు అందరినీ పిలిచి గొడవ చేస్తుందేమో నా గురించి నిజం బయట పెట్టేస్తుందేమో.. ఇక్కడే చంపేయడం బెటర్‌ ( అని మనసులో అనుకుంటాడు.)


గౌరి: అకి లేదా అండి నేను అకి ఫ్రెండ్‌ ను నా సిస్టర్ హ్యాండ్‌ బ్యాగ్‌ అకి కారులో మర్చిపోయింది.


రాకేష్‌: తనేంటి రాత్రి ఏమీ జరగనట్టు.. నన్ను గుర్తుపట్టనట్టు మాట్లాడుతుంది. ( అని మనసులో అనుకుంటాడు)


గౌరి: ఎక్స్‌క్యూజ్‌ మీ అకిని పిలుస్తారా..? సరే నేనే వెళ్తాను.


రాకేష్‌: ఒక్క నిమిషం అకి ఏదో ఇంపార్టెంట్‌ కాల్‌ మాట్లాడుతుంది. కారు ఇక్కడే ఉంది బ్యాగ్‌ నేను ఇస్తాను.


అని చెప్పి రాకేష్‌ బ్యాగ్‌ ఇవ్వగానే తీసుకుని వెళ్లబోతూ.. మిమ్మల్ని నేను ఎక్కడో చూశానే.. అంటూ వినాయక చవితి రోజు బృందావనం కాలనీ అడ్రస్‌ అడిగారు కదా? అంటుంది. అవును మీకు ఆరోజు కలర్స్‌ ఉన్నాయి కదా? నేను గుర్తు పట్టలేదు అంటాడు రాకేష్‌. తర్వాత గౌరి వెళ్లిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరగుతుందని రాకేష్‌ టెన్షన్‌ పడతాడు.  రాత్రి నా మీద అటాక్‌ చేసింది గౌరి కాదా? అంటూ ఆలోచిస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!