Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ జనార్థన్, రేవతి వాళ్లతో కిరణ్‌కి రావాల్సిన ట్రెండర్‌ మనకు వచ్చేసిందని చెప్తుంది. కిరణ్‌కి కోలుకోలేని దెబ్బ కొట్టామని అనుకుంటారు. ఇంతలో సీత వచ్చి ఎవరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నారు మీ తోడ పుట్టిన చెల్లి మీద ఆమె భర్త మీద అని అడుగుతుంది.


మహాలక్ష్మీ: మమల్ని కాదు అని పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్లు మాకు శత్రువులు అయిపోయారు.  
జనార్థన్: మేం చెప్పిన పెళ్లి చేసుకొని ఉంటే రేవతి సంతోషంగా ఉండేది కాదు అని వేరే పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కష్టాలు.
సీత: ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా మామయ్య అలా అయితే సుమతి అత్తమ్మని మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. 
మహాలక్ష్మీ: సీత జరిగిపోయింది అనవసరం ఇది బిజినెస్ బంధుత్వాలు అవసరం లేదు.
సీత: కిరణ్‌ గారి టెండర్‌ని అన్యాయంగా లాక్కోవడం మీకు తప్పు అనిపించడం లేదా. కిరణ్ గారి మీద విజయం సాధించామని మీరు ఆనంద పడుతున్నారు కానీ మీ చెల్లి ఇబ్బంది పడుతుంది.
గిరిధర్: మా మాట విని ఉంటే తనకు ఆ బాధ ఉండదు కదా.
జనార్థన్: వ్యాపారం అంటే ఎన్నో ఉంటాయి అవన్నీ నీకు అనవసరం.
సీత: మీ వల్ల నిజంగానే రేవతి పిన్ని వాళ్లకు కష్టాలు వస్తే  వాళ్లని ఎలా ఆదుకోవాలో నాకు తెలుసు.
అర్చన: ఏంటి మహా సీత అన్నింట్లో తల దూర్చుతుంది.
జనార్థన్: సీత పంతం పడితే మనకే మంచిది కాదు కొన్ని విషయాల్లో తనని వదిలేయడం బెటర్.
గిరిధర్: ట్రెండర్ విషయం పక్కన పెట్టండి ప్రీతి పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే మనకే ప్రాబ్లమ్.
మహాలక్ష్మీ: ప్రీతి పెళ్లి ఆగిపోతే నా ప్రాణం పోయినట్లే నేను ఇప్పుడే రాకేశ్ వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి పనులు స్పీడప్ చేయమని అంటాను.
విద్యాదేవి: మొత్తం విని మహాలక్ష్మీతో మాట్లాడటానికి బయటకు వెళ్తుంది. రాకేశ్ మంచి వాడు కాదని సీత ఎంత చెప్పినా మీరు ఎందుకు వినడం లేదు.
మహాలక్ష్మీ: సీత మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రీతి నా కూతురు తన పెళ్లి నా ఇష్టం మీద జరుగుతుంది.
విద్యాదేవి: ప్రీతి మీ కన్న కూతురు అయితే ఇలా చేసేవారా. ప్రీతి కన్న తల్లి ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేదా. ప్రీతి మీకు పెంపుడు కూతురు సీతకి మేనత్త కూతురు మీ కంటే ప్రీతి కోసం సీత ఎక్కువ ఆలోచిస్తుంది. మీరు ప్రీతిని కష్టాల్లోకి నెట్టాలని చూస్తున్నారు. మీ మాటే నెగ్గాలని చూస్తున్నారు. 
మహాలక్ష్మీ: అయిపోయిందా లేక మీ క్లాస్ ఇంకా ఉందా. నన్ను ఇంతలా నిలదీస్తున్నారు అంటే మీకు ఈ ఇంటికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది. మీరు ఎవరు? ప్రీతి మీ కూతురా.. రామ్ మీ కొడుకా.. నేను ఎవరో తెలుసా మహాలక్ష్మీని ఇంట్లో వాళ్లు కంపెనీలో అంతా నేను చెప్పిందే చేయాలి నా మాట వినాలి ఇక్కడ నా మాటే శాసనం. నేను ఈ పెళ్లి విషయంలో ఏ మాత్రం రాజీ పడను. పెళ్లి జరుగుతుంది అదే ఫైనల్.
 
రాకేశ్ ఇంట్లోనే మందు తాగుతూ ఉంటాడు. సడెన్‌గా వెళ్లి సర్‌ఫ్రైజ్ ఇస్తానని మహాలక్ష్మీ అనుకొని లోపలికి వెళ్తుంది. రాకేశ్ తల్లిదండ్రులు ఈ రెండు రోజులు అయినా జాగ్రత్తగా ఉండమని అంటారు. ఇక రాకేశ్ గురించి అంతా తెలిసిన ఓ వ్యక్తిని తీసుకొస్తారు. మహాలక్ష్మీకి నా నేర చరిత్ర చెప్తా అని బెదిరించాడని అంటాడు. ఇక రాకేశ్ ఇంట్లో రాకేశ్ నిజస్వరూపం మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మీ వినేస్తుంది. వీడు మహాలక్ష్మీకి నిజం చెప్తే ఈ పెళ్లి జరగదు అని అనుకోవడం మహాలక్ష్మీ చూసేస్తుంది. రాకేశ్‌తో నువ్వు నా చెల్లి జీవితం నాశనం చేశావని ఎంతో మంది అమ్మాయిలు నీ వల్ల ఇబ్బంది పడ్డారని అదంతా చెప్తా అనడం వాడిని రాకేశ్ తల్లిదండ్రులు చంపేయ్ మనడం మహాలక్ష్మీ వింటుంది.  


ఆ వ్యక్తిని రాకేశ్ చంపేసి నా గురించి ఎవరికి నిజం తెలిసినా ఆఖరికి ఆ మహాలక్ష్మీకి తెలిసినా చంపేస్తా అంటాడు. వాళ్ల నేరాలు ఘోరాలను మహాలక్ష్మీ విస్తుపోతుంది. భయంతో మహాలక్ష్మీ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. రాకేశ్ ఫ్యామిలీ ఎవరో మన మాటలు విన్నారని అనుకుంటారు. ఆమె ఎవరైనా ఎత్తుకు వచ్చేయండి అని రాకేశ్ రౌడీలను పురమాయిస్తాడు. మహాలక్ష్మీ కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో రోడ్డు మీద పరుగులు తీస్తుంది. మహాలక్ష్మీ పరుగున వచ్చి సీత వ్యాన్ వెనక దాక్కోవడం సీత చూస్తుంది. రౌడీలను చూసి వ్యాన్‌లోకి మహాలక్ష్మీ ఎక్కిపోతుంది. సీత చూసి చీరల్ని లోపల విసిరేసి డోర్ వేసేస్తుంది. వ్యాన్ స్టార్ట్ చేసి సీత వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!