Prema Entha Madhuram  Serial Today Episode:  షాపింగ్‌ పూర్తి అయ్యాక బిల్‌ కట్టే దగ్గర అందరూ క్యూలో నిల్చుంటే.. పెద్దొడు, చిన్నొడు వచ్చి మాది ఎక్కువ బిల్లు ముందు మాది తీసుకోండని అడుగుతారు. బిల్లు వేసే వ్యక్తి లైన్‌ లో రమ్మని చెప్తాడు. వినకుండా గొడవ చేస్తుంటారు. గౌరి వాళ్లను తిడుతుంది. శంకర్‌, గౌరిని వారిస్తాడు. తర్వాత మేనేజర్‌ వచ్చి మీరే ఇవ్వండి సార్‌ అంటాడు. దీంతో బిల్డప్‌ కొడుతూ క్రెడిట్‌ కార్డు ఇస్తారు. కార్డు స్వైప్‌ చేస్తే కార్డు పని చేయదు. దీంతో మేనేజర్‌ కార్డు పని చేయడం లేదని చెప్తాడు. సరిగ్గా చూడమని చెప్తారు రెండు మూడు సార్లు ప్రయత్నించి కార్డు డిక్లెయిన్‌ అయిందని చెప్తాడు. దీంతో పాండుకు ఫోన్‌ చేస్తారు. పాండు కూడా ఫోన్‌ లిఫ్ట్ చేయడు.


చిన్నొడు: ఇప్పుడెలారా పెద్దొడా..? పరువు పోతుంది.  


పెద్దొడు: మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్‌ చేద్దాం.


చిన్నొడు: ఫ్రెండ్స్‌ కు ఫోన్‌ చేస్తే రెండు వేలు మూడు వేల కన్నా ఎక్కువ ఎవ్వడూ ఇవ్వడురా..? ఇంత అమౌంట్‌ ఎవరు ఇస్తారు.


మేనేజర్‌: కస్టమర్స్‌ అంతా వెయిటింగ్‌.. కార్డు పని చేయకపోయినా పర్వాలేదు. ఫోన్‌ ఫే, గూగుల్‌ ఫే అయినా పర్వాలేదు.


గౌరి: ఏంటి మేనేజర్‌ గారు ఎక్కువ తీసుకున్న మీ కస్టమర్‌ బిల్‌ కడతారా..? కట్టరా..? మేమెందుకు వెయిట్‌ చేయాలి.


పెద్దొడు: మాకు కొంచెం టైం కావాలి.


మేనేజర్‌: ఇంత మాత్రానికే బిల్‌ ముందు కడతామని గొడవెందుకు ఆ బాగ్స్‌ పక్కన పెట్టండి.


శంకర్‌: అక్కర్లేదండి ఆ బిల్‌ నేను కడతాను.


గౌరి: శంకర్‌ గారు అవసరమా..?


అకి: శంకర్‌ గారు ఆ బిల్‌ నేను ఫే చేస్తాను.


శంకర్‌: వద్దు అకి మీరు తీసుకోండి.


మేనేజర్‌: మీరు మా బ్యాగులు తీసుకెళ్లొచ్చు.


గౌరి: శంకర్‌ గారు ఏం చేశారు మళ్లీ మీరు.


శంకర్‌: గౌరి గారు ఇన్నేళ్లు ప్రతి సంవత్సరం పండక్కి బట్టలు నేనే కొన్నాను. ఈ సంవత్సరం అది మిస్సయ్యిందనుకున్నాను. అది ఇలా నెరవేరింది.


అని శంకర్‌ చెప్పగానే గౌరి కోపంగా శంకర్‌ ను తిడుతుంది. ఇదే వాళ్లకు మీరిచ్చే అలుసు. అసలు వాళ్ల బిల్లు మీరెందుకు కట్టారు అని అడుగుతుంది. దీంతో అన్నయ్యను కాబట్టి కట్టాను. మనతో ప్రేమతో ఉంటేనే బంధాలు అనుకోవడం కాదు. మనతో ప్రేమతో ఉన్నా లేకున్నా.. ఆ బంధాలను అలాగే నిలబెట్టుకోవాలి అని చెప్పి శంకర్‌ వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన అకి అందరి కోసం నేను షాపింగ్‌ చేశానని చెప్తుంది. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు అకి అని అభయ్‌ అడుగుతాడు. ఇంతలో రాకేష్ వస్తాడు.


అభయ్‌: రాకేస్‌ కరెక్టుగా టైం కు వచ్చావు రేపు పండగకి క్రాకర్స్‌ తెచ్చుకుందాం.


రాకేష్‌: లేదు అభయ్‌ రేపు నేను సిటిలో ఉండను.


అభయ్‌: అదేంటి ఎక్కడికి వెళ్తున్నావు.


రాకేష్‌: అది చిన్న పర్సనల్‌..


అభయ్‌: అదేంటి  నీకు నాకు పర్సనలా.. అసలు ఎక్కడికి వెళ్తున్నావు.. ఎందుకు వెళ్తున్నావు.


జెండే: అభయ్‌ ఎంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయినా ఎవరి పర్సనల్‌ స్పేష్‌ వాళ్లకు ఉంటుంది. అది ఎప్పుడు డిస్టర్బ్‌ చేయకూడదు. రాకేష్‌ నువ్వు ఎక్కడికైనా వెళ్లు.. ఎన్ని రోజులైనా ఉండు.. తీరిగ్గా తిరిగిరా..


  అని చెప్పగానే జెండే ఏంటి సపోర్టు చేస్తున్నాడు అని రాకేష్‌ మనసులో అనుకుంటాడు. ఇంతలో సరేలే రాకేష్‌ నువ్వు ఎక్కడికైనా వెళ్లు అంటాడు. దీంతో రాకేష్‌ ఏడుస్తూ అభయ్‌ను హగ్‌ చేసుకుంటాడు. నన్ను చిన్నప్పుడు పెంచిన ఆవిడ చావుబతుకుల్లో ఉందని ఫోన్‌ చేయించింది. నేను ఒక్కడినే వెళ్లాలంటే భయంగా ఉంది అంటాడు. దీంతో నేను నీతో పాటు వస్తానని అభయ్‌ చెప్పగానే జెండే, అకి షాక్‌ అవుతారు. అభయ్‌ ని వద్దని వారిస్తారు అభయ్ వినడు.  


   మరోవైపు శంకర్‌ తన తమ్ముళ్లకు కార్డు, కారు ఇచ్చిన వాళ్ల డీటెయిల్స్‌ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. వాళ్ల వెనక జలంధర్‌ కొడుకు ఉన్నాడని తెలుసుకుని శంకర్‌ షాక్‌ అవుతాడు. అసలు జలంధర్ ఎవడని యాదగిరిని అడుగుతాడు. జెండే సార్‌ను అడిగి చెప్తానంటాడు. పాండు దగ్గరకు వెళ్లిన చిన్నొడు, పెద్దొడు షాపులో జరిగిన ఇష్యూ గురించి చెప్పి బాధపడతారు. మా అన్నయ్య లేకపోతే మా పరిస్తితి ఏంటని మాట్లాడుతుంటే పాండు లేనిపోని మాటలు చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!