Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీకి పెళ్లి కాలేదు కాబట్టి తన మీద అనుమానం పోవాలి అంటే తన పాపిటిలో ఉన్న కుంకుమ చెరగాలి అని పద్మాక్షి అంటుంది. అంబికతో చెప్పి బొట్టు చెరిపేయమని అంటుంది. వద్దని లక్ష్మీ వేడుకుంటుంది. యమున కూడా వద్దని చెప్తుంది. అడ్డుపడుతుంది. అయినా అంబిక వినకుండా యమునను తప్పుకోమంటుంది. భయంతో యమున తప్పుకుంటుంది. పద్మాక్షి లక్ష్మీని పట్టుకోగానే అంబిక లక్ష్మీ బొట్టు చెరపడానికి వెళ్తుంది. ఇంతలో నర్స్ వచ్చి విహారి కళ్లు తెరిచాడని చెప్తుంది. అందరూ సంతోషంతో విహారి దగ్గరకు పరుగులు తీస్తారు. 


పండు: లక్ష్మమ్మ నీ భర్తకి నువ్వు చేసిన సేవ గురించి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నీ భర్తని నువ్వు ముట్టుకున్నందుకు అందరూ తిడుతున్నారు. నీ భర్తకి నువ్వు సేవలు చేస్తున్నందుకు నిందలు వేస్తున్నారు. నాకు చాలా బాధేస్తుంది అమ్మ.
లక్ష్మీ: వీళ్లంతా అసలు నిజం తెలియని అమాయకులు. నిజాలు తెలీకుండా నిందలు వేస్తున్నారు. అలాంటప్పుడు నిందలు వేయడంతో తప్పు లేదు.
పండు: కనీసం మనిషికి ఇచ్చిన విలువ అయినా ఇవ్వాలి కదమ్మా. మరీ ఇంత దారుణమా.
లక్ష్మీ: వాళ్లు అలా మాట్లాడారు అంటే ఆ తప్పు వాళ్లది కాదు వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితులది మనమే అర్థం చేసుకోవాలి. 
పండు: అందరికీ నీలాంటి మనసు ఉంటే బాగుండమ్మా. 


అందరూ విహారి దగ్గరకు వెళ్తారు. యమున కొడుకు చేయి పట్టుకొని నీకు ఏమైపోయిందో అని కంగారు పడ్డానని ఎమోషనల్ అవుతుంది. నీ కోసమే నేను త్వరగా కళ్లు తెరిచాను అమ్మ అని విహారి అంటాడు. దానికి డాక్టర్ మీకు రక్తం ఇచ్చిన అమ్మాయి వల్లే ఇదంతా సాధ్యం అయిందని లక్ష్మీని పొగుడుతాడు. సమయానికి తాను రక్తం ఇవ్వడం వల్లే ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారని అంటాడు.. తనకు రక్తం ఇచ్చింది కనక మహాలక్ష్మీనా అని విహారి షాక్ అయిపోతాడు. ఇక డాక్టర్ లక్ష్మీ బొట్టు పెట్టి తీర్థం తాగించడం వల్లే ఇది సాధ్యమైందని మీరంతా తనకు రుణపడి ఉన్నారని అంటాడు. దాంతో విహారి లక్ష్మీని పిలవమని చెప్తాడు. 


లక్ష్మీ విహారిని చూసి చాలా సంతోషపడుతుంది. విహారి లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. సహస్ర రగిలిపోతుంది. ఒక రకంగా ఇదంతా నా బాధ్యత అని కనకం అంటే ఆ బాధ్యత సరిగ్గా నిర్వర్తించినందుకు థ్యాంక్స్ అని విహారి అంటాడు. యమున కూడా లక్ష్మీ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు మా కోసమే మా ఇంటికి వచ్చావని పైవాడు కావాలనే మాకోసం పంపాడని నీకు మాకు మధ్య దేవుడు ఏదో బంధం పెట్టాడని అంటుంది. నువ్వు మా జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నావని అంటుంది. నాకు ఆశ్రయం ఇచ్చిన మీరు సంతోషంగా ఉండాలని లక్ష్మీ అంటుంది. ఇక డాక్టర్ అందర్ని బయటకు వెళ్లిపోమని అంటాడు. 


మరోవైపు కనకం తండ్రికి కూడా అదే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆదికేశవ్ బ్రైన్‌లో గడ్డ కట్టిందని దాని వల్ల బ్రైయిన్ స్ట్రోక్ వస్తుందని ఆపరేషన్ చేయించాలని అంటాడు. అది విని కనకం తల్లి షాక్ అయిపోతుంది. ఆపరేషన్‌కి 20 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కనకం తల్లి ఏడుస్తుంది. పది రోజుల్లో ఆపరేషన్ జరగాలి అని ఆయనని గాజు బొమ్మలా చూసుకోవాలని ఎలాంటి బాధ పెట్టే విషయాలు చెప్పొద్దని చెప్తారు. రాజీ, కనకం తల్లి ఏడుస్తారు. ఆ విషయాలు ఆదికేశవ్‌కి చెప్పొద్దని రాజీతో చెప్తుంది. ఇక నర్స్ ఆదికేశవ్‌ని స్కాన్‌కి తీసుకెళ్తారు.


ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేస్తుంది. విహారి పది రోజుల్లో తిరిగేలా ఉన్నాడని మనకు ఎక్కువ టైం లేదని ఈలోపు మనం అనుకున్నవి చేయాలని అంటుంది. అంబిక ఫోన్‌లో అన్నీ సెట్ చేసుకోవాలని చెప్పడం చారుకేశవ వింటాడు. అంబిక బావని చూసి షాక్ అయిపోతుంది. చారుకేశవ కూడా అంబికకు అర్థమయ్యేలా ఫోన్‌లో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగించే వాడు వస్తాడని అంటాడు. నీ టైం బాలేదని అంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు నీ చేయి జారిపోయావని అంటాడు. ఇంతలో చారుకేశవకి ఫోన్ రావడంతో అంబిక ఏంటి బావ రాని ఫోన్లు తెగ మాట్లాడేస్తున్నావ్ అని అంటుంది. ఇక విహారికి నేనేంటో చూపించాలి అని అంబిక అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పెళ్లి టైంకి సుమతిని తీసుకొస్తానని శపథం చేసిన సీత.. విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేయమన్న మహాలక్ష్మీ!