Nindu Noorella Saavasam Serial Today Episode:   యుముడు సీరియస్‌ గా చూస్తుంటే.. గుప్త మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. దీంతో నువ్వు నీ కర్తవ్యాన్ని సక్రమంగా చేసి ఉంటే నేను వచ్చే వాడినే కాదు. అంటూ యముడు చెప్పగానే గుప్త అనుమానంగా ఆ బాలికకు ఏదో ప్రమాదం వస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని గుప్త అడగ్గానే అవునని ఘోర రూపంలో ప్రమాదం రానుందని యముడు చెప్తాడు. దీంతో గుప్త భయపడతాడు. ఏన్నో ప్రాణాలు తీసిన మీరు ఈ ఒక్క ఆత్మ కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని గుప్త యముణ్‌ని అడగ్గానే అసలు విషయం చెప్తాడు యముడు. ఇక ఆలస్యం చేయకుండా ఆ బాలికను అమావాస్య గడియలు మొదలవగానే తీసుకువెళ్లాలి అంటాడు. మరోవైపు భాగీ అటూ ఇటూ తిరుగుతూ.. ఉంటే ఇంతలో అమర్‌ పిల్లలు వస్తారు.


అమ్ము: అంజు దిగవే దిగు..


అంజు: దిగను..


రాథోడ్‌: ఇంటి ముందుకు వస్తే మిస్సమ్మ రాదు. ఇంట్లోకి వెళ్లి పిలిస్తే వస్తుంది. మిమ్మల్ని కాదు సార్‌ పిల్లల్ని.


అమర్‌: రాథోడ్‌ వెళ్లి తీసుకుని రా…


రాథోడ్‌: సార్‌ నేను విన్నదే మీరు అన్నారా..? తిట్టింది మీరు వెళ్లిపోమ్మంది పెద్ద సారు. మధ్యలో నేను వెళితే వస్తుందా..?


అమర్‌: పిల్లలను తీసుకుని వెళ్లు.. పిల్లలు రాథడ్‌ తో వెళ్లి భాగీని తీసుకుని రండి.  


రాథోడ్ : అంజు పాప అందరూ అంటే తమరు కూడా అని.


అంజు: నేను డాడీకి తోడుగా ఉంటాను.


అమ్ము: అంజు డాడీ చెప్పారు కదా..? అందరూ వెళ్లాలని రా వెళ్దాం.


అంజు: నాకు డాడీని వదిలి రావాలని లేదు. నేను డాడీతోనే ఉంటాను. అయినా ఏంటి అందరూ వెళ్తే కానీ ఆ మిస్సమ్మ రాదా..?


రాథోడ్‌: అయినా వాళ్లు అపార్థం చేసుకున్నవాళ్లు రాకపోతే రాదని నీకు అర్థం అయిందా…?


అమర్‌: అంజు నువ్వు కూడా వెళ్లి తీసుకురా వెళ్లు..


అని చెప్పగానే పిల్లలు రాథోడ్‌ ఇంట్లోకి వెళ్తారు. లోపల భాగీ పిల్లల కోసమే ఎదురుచూస్తుంది. రామ్మూర్తి  బయటకు వెళ్లబోతుంటే.. పిల్లలు, రాథోడ్‌ రావడం చూసి లోపలికి వెళ్లి భాగీకి చెప్తాడు. పిల్లలు రాథోడ్‌ మాత్రమే లోపలికి వస్తున్నారు. కానీ బాబు గారు లోపలికి రావడం లేదని చెప్తాడు. భాగీ బాధపడుతుంది. బాబు లోపలికి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు కొంచెం కో ఆపరేట్‌ చేయ్‌ అని చెప్పి గుమ్మం దగ్గరకు వెళ్తాడు రామ్మూర్తి.


రామ్మూర్తి: ఏమయ్యా రాథోడ్‌ నేను లేనప్పుడే వస్తావనుకున్నాను. నేను ఉన్నప్పుడు కూడా వచ్చావే..?


రాథోడ్: మీరు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు సార్‌.


రామ్మూర్తి: నేను లేనప్పుడు నా కూతురుని ఇంట్లో వదిలేసి వెళ్లావు కదయ్యా..? సరేలే ఎందుకు వచ్చావో చెప్పు. నా కూతురు ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చావా..? లేక ఆ ఇంట్లో వాళ్లు ఈ ఇంట్లో నా కూతురు ఎలా ఉందో చూడమని పంపించారా..?


రాథోడ్‌: సార్‌ అది మిస్సమ్మ..


రామ్మూర్తి: ఉంది… ఇంట్లోనే ఉంది.


రాథోడ్‌ : ఓ మిస్సమ్మ నేను ఒక్కడినే కాదు. పిల్లలు కూడా వచ్చారు.


అని రాథోడ్‌ చెప్పగానే మిస్సమ్మ లోపలి నుంచి బయటకు పరుగెత్తుకొస్తుంది. పిల్లలను హగ్‌ చేసుకోబోతుంటే.. రామ్మూర్తి ఆపుతాడు. ఇంతలో రాథోడ్‌ మీ నాన్న పెద్దరాయుడిలో రజనీకాంత్ లా ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడు ఆపమని చెప్పు అంటాడు. ఇంతలో పిల్లలు ఎమోషనల్ గా మాట్లాడతారు. భాగీ కూడా ఎమోషనల్ అవుతుంది.


అమ్ము: మేము వచ్చాము కదా తాతయ్య భాగీని మాతో పంపించండి.


ఆనంద్‌: అవును తాతయ్యా మిస్సమ్మ లేకుండా ఇల్లంతా చాలా బోర్‌ కొడుతుంది.


రామ్మూర్తి: నీ కూతురు మీద మీకున్న ప్రేమకు నేను తృప్తిగా ఉన్నా మనసుకు అయిన గాయం మాననంటుంది అమ్మా మాననంటుంది.


భాగీ: నాన్నా నేను చెప్పేది వినండి నాన్నా..పిల్లలు


రామ్మూర్తి: పిల్లల మీద నీకున్న ప్రేమ నిన్ను ఆ ఇంటికి వెళ్లమంటుందని నాకు తెలుసమ్మా..? కానీ బాబు గారే వచ్చి స్వయంగా అడిగితే తప్పా నిన్ను ఆ ఇంటికి పంపలేను అమ్మా..?


అంజు: ఆగండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. మిస్సమ్మ, తాతయ్య ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. పదండి మనం వెళ్దాం.


రాథోడ్‌: అంజు పాప ఆవేశపడకు. నేను వెళ్లి సారకు విషయం చెప్తాను. సార్‌ ఏం అంటారో వింద్దాం.


అని రాథోడ్‌ అమర్‌ దగ్గరకు వెళ్తాడు. మరోవైపు మనోహరి కుంటుతూ బాధపడుతుంది. భాగీ మళ్లీ ఈ ఇంటికి వస్తే ఇంతవరకు నేను పడ్డ కష్టం అంతా వృథా అవుతుందని అనుకుని అక్కడ ఏం జరుగుతుందో మంగళకు ఫోన్‌ చేసి తెలుసుకుందామనుకుని ఫోన్‌ చేస్తుంది. మంగళ ఫోన్‌ లిఫ్ట్ చేయదు. మరోవైపు రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన విషయం చెప్తాడు. మీరు ఒక్కసారి లోపలికి రండి మీరు పిలిస్తే కానీ ఆయన మిస్సమ్మను ఇంటికి పంపించను అంటున్నాడు సార్‌. అని రాథోడ్‌ చెప్పగానే అమర్ అయితే వెళ్దాం పద అంటాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!