Prema Entha Madhuram Serial Today Episode:  పిల్లల్ని స్కూల్‌ లో డ్రాప్‌ చేయడానికి వెళ్లిన నీరజ్‌కు మాన్షి ఎదురుపడుతుంది. నీరజ్‌ కోపంగా తిడతాడు. దీంతో మాన్షి ఏడుస్తూ ఆ చాయా వాళ్లు నన్ను నమ్మించి మోసం చేశారు. వాళ్ల మాయలో పడి మన కుటుంబానికి అన్యాయం చేశాను అని ఏడువడంతో నీరజ్‌ తిడుతూ కొత్త డ్రామా ఏంటి? అని నిలదీస్తాడు. నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను ఎవ్వరూ నమ్మరు అంటాడు నీరజ్‌. మాన్షి ఎంత బతిమాలినా నీరజ్‌ వినడు. మాన్షిని పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఇంతలో మాన్షికి  చాయ ఫోన్‌ చేసి వెల్లిన పని ఏమైందని అడుగుతుంది. నన్ను నమ్మలేదని మాన్షి చెప్తుంది. సరే ఎలాగైనా సరే పాప గురించి కూడా తెలుసుకోవాలని ఫోన్‌ కట్ చేస్తుంది. మరోవైపు కేశవ్‌, ఆర్య, ఆనంది రూంలోకి వెళ్తారు.


ఆర్య: ఆనంది ఏం చేస్తున్నావమ్మా


ఆనంది: ఏం లేదు.


ఆర్య: దా కూర్చో బోర్‌ కొడుతుందా? టీవీలో కార్టూన్‌ చూడకపోయావా?


ఆనంది: అలవాటు లేదు.


ఆర్య: ఓ అలాగా పోనీ గేమ్స్‌ ఏమైనా ఆడతావా? ఫ్రెండ్స్‌ తో లేదా మొబైల్‌ లో  అన్నట్టు నీకు ఎవరైనా ఫ్రెండ్స్‌ ఉన్నారా?   


అంటూ ఆర్య, ఆనందిని డీటెయిల్స్‌ అడుగుతాడు. ఆనంది మౌనంగానే ఉంటుంది. ఏమీ మాట్లాడదు.  మరోవైపు అను ఇడ్లీలు ప్లేట్‌లో పెడుతుంది. ఇంతలో శారదాదేవి వచ్చి టిఫిన్స్‌ ఎవరికి అని అడుగుతుంది. ఆనంది కోసమని అను చెప్తుంది.


శారదాదేవి: ఏ ఇంటి బిడ్డో ఏమో మన ఇంటికి చేరింది. కానీ వీలైనంత త్వరగా ఆ పాప డీటెయిల్స్‌ తెలుసుకోవాలి.


అను: ఆర్య సార్‌ అదే పనిలో ఉన్నారు అత్తమ్మ..


శారదాదేవి: సరే తీసుకెళ్లు.


పైన ఆర్య, ఆనందితో మాట్లాడుతుంటాడు.


ఆర్య: ఆనంది నీకేం భయం లేదు నేను నిన్ను సేఫ్‌గా మీ అమ్మా నాన్నల దగ్గరకు తీసుకెళ్తాను. ఇప్పటికైనా మీ నాన్నెవరో చెప్పమ్మా?


 అని ఆర్య అడగ్గానే ఆనంది మళ్లీ ఆర్య ఫోటో తీసి చూపిస్తూ.. నువ్వే మా నాన్న అంటుంది. కేశవ్‌ గట్టిగా ఇదిగో చూడు పాప అనగానే ఆనంది భయంతో ఉలిక్కిపడుతుంది. దీంతో ఆర్య ఫోటో కిందపడుతుంది. ఇంతలో అను రావడం చూసి ఆర్య, కేశవ్‌ షాక్‌ అవుతారు. కేశవ్‌ ఫోటోను పక్కకు తోసేస్తాడు. అను టిఫిన్స్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.


కేశవ్‌: చూడు పాప నువ్విలా సైలెంట్‌ గా ఉంటే బాగోదు.


ఆర్య: జెండే ఫస్ట్‌ తనని టిఫిన్ చేయనివ్వు.. ఆనంది నువ్వు టిఫిన్‌ తినమ్మా.. ఆనంది ఏంటి ఆకలిగా లేదా?


ఆనంది: ఉంది..


అని ఆనంది చెప్తుంది కానీ తినదు. ఇంతలో ఆర్య   నేను తినిపిస్తాను తిను అనగానే హ్యాపీగా తింటుంది. ఆనంది తింటుండగానే ఆర్య ఆ జ్యూస్‌ గ్లాస్‌ ఎందుకు పడేశావు అని అడుగుతాడు. నాకు తెలియదు అని ఆనంది చెప్తుంది. తర్వాత ఆర్య, కేశవ్‌ ఆఫీసుకు టైం అవుతుందని బయటకు వెళ్తారు.


కేశవ్‌: ఈ పాప మనింట్లోనే ఉంటే ముందు ముందు మనం చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేయాల్సి వస్తుంది.


ఆర్య: నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ పాప గురించి సోషల్‌ మీడియాలో పబ్లిసిటీ చేయండి. అలాగే పోలీస్‌ స్టేషన్‌లోనూ ఎంక్వైరీ చేయించండి.


అని అనుతో కలిసి ఆఫీసుకు వెళ్తారు. మరోవైపు మాన్షి, చాయా ఇద్దరూ నీరజ్‌ గురించి ఆలోచిస్తుంటారు. తాను ఎంత బతిమాలినా నీరజ్‌ పట్టించుకోలేదని కోప్పడుతుంది. ఏదో ఒకలా ఆ ఇంట్లో తిరిగి అడుగుపెడతాను అంటుంది మాన్షి. మరోవైపు చాలా రోజుల తర్వాత ఆర్య, అను ఆఫీసుకు వస్తున్నారని నీరజ్‌ స్టాఫ్‌తో కలిసి గ్రాండ్‌ వెల్‌కం చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.