Prema Entha Madhuram  Serial Today Episode:  ఓనరు గారు మీరు వెళ్లి ప్రెషప్‌ అవ్వండి పైకి వెళ్లి రెస్ట్‌ తీసుకోండి అని శంకర్‌ చెప్పగానే.. ఓనరు భయపడుతుంటాడు. ఓనరు గారు మీరు పైకి వెళ్లండి అని ఓనరును పైకి పంపిస్తాడు శంకర్‌. ఓనరు పైకి వెళ్లాక.. ఏంటి శంకర్‌ వీణ్ని ఇంటికి తీసుకొచ్చావు అని జెండే అడగ్గానే ఆ రాకేష్‌ గాణ్ని పట్టుకోవడానికి, గౌరి గారి ఆచూకీ తెలియడానికి వీడే మనుక ఎర అని శంకర్‌ చెప్తాడు. మరోవైపు శంకర్‌ను ఫాలో అయిన రౌడీ రాకేష్‌ దగ్గరకు వెళ్తాడు.


రాకేష్‌: ఏంటి ఆ ఓనరు గాణ్ణి ఆ శంకర్‌ గాడు ఇంటికి తీసుకుపోయాడా..?


రౌడీ: అవును బాస్‌.. అది కూడా చాలా కూల్‌గా గెస్టును తీసుకెళ్లినట్టు తీసుకెళ్లాడు బాస్‌. అసలు ఆ శంకర్‌ ఏం ప్లాన్‌ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు బాస్‌.


రాకేష్‌: నాకు అర్థం అయిందిరా.. ఆ శంకర్‌ గాడు ఒక పూల్‌. ఆ ఓనరు గాడితో మంచిగా ఉండి నా గురించి తెలుసుకోవాలనుకున్నాడు.


రౌడీ: డబ్బు ఆశతో చూపిస్తే చెప్పడని గ్యారంటీ ఏంటీ బాస్‌. అతని సాక్షిగా పెట్టుకుని మీ మీద కేసు పెడితే పోలీస్‌ బెటాలియన్‌ మొత్తం మీ మీదే ఫోకస్‌ చేస్తుంది.


రాకేష్‌: నిజమేరా వాడికి డబ్బులు చూపిస్తే నిజం చెప్పినా చెప్పేస్తాడు. వాడిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి


అని చెప్తాడు. రౌడీ సరే అంటాడు. మరోవైపు శంకర్‌ను నీ ప్లానేంటి అని జెండే అడుగుతాడు. అసలు నువ్వు ఆ ఓనరును ఉపయోగించుకుని గౌరిని ఎలా సేవ్‌ చేస్తావా..? అని అడగ్గానే.. తన ప్లాన్‌ చెప్తాడు శంకర్‌. ఓనరు ద్వారా రాకేష్‌ను ట్రేస్‌ చేయాలని చెప్తాడు. కానీ ఆ ఓనరు మనకు సపోర్టు చేయడు కదా అంటాడు జెండే.. ఇంతలో శంకర్‌ తాను గత జన్మలో ఆర్యవర్థన్‌, అనురాధలము అని చిన్న డ్రామా క్రియేట్‌ చేస్తాను. అంటూ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఓనరును బకరాను చేయడానికి   ఆర్యవర్ధన్‌ తాత భూపతిరాజానే ఈ ట్యాంకరు గాడు అని చెప్పి నమ్మించి వాడి చేతనే నిజాలు బయటకు తీసుకొస్తాను అంటాడు శంకర్‌. అందుకు మీ అందరి సపోర్టు కావాలి.


అభయ్‌: అలాగే శంకర్‌ గారు మీరెలా చెప్తే అలా చేస్తాము.


శంకర్‌: వెరీగుడ్‌ ఇప్పుడు ఇమ్మీడియెట్‌గా మనందరం చేయాల్సిన పనేంటంటే గత జన్మలో ఆర్యవర్ధన్‌, అనురాధల నాది గౌరి గారిది ఒక ఫోటో సెట్‌ చేయించండి.


అభయ్‌: ఫోటో రెడీగానే ఉంది నాన్నా..


శంకర్‌: వారినీ ఇన్‌వాల్వమెంట్‌ తగలేయ్యా.. అప్పుడే యాక్షన్‌లోకి దిగేయడం. నాన్నా అనేయడం పాస్ట్‌ పార్వర్డ్‌ లోకి వెళ్లిపోతున్నావు. అవును అప్పుడే ఫోటో రెడీ ఎలా అయింది.


అకి: అదే శంకర్‌ గారు కపుల్‌ కాంటెస్ట్‌లో మీరు గెలిచినప్పుడు మీకు గిఫ్ట్‌ చేయాలని రెడీ చేయించాము కదా అదే ఫోటో


శంకర్‌: ఆ గుర్తుకు వచ్చింది అకి .. ఆ టాంకర్‌ గాడి ఫోటో నేను రెడీ చేయిస్తాను.


అని శంకర్‌ పైకి వెళ్లిపోతాడు. శ్రావణి, సంధ్య ఏడుస్తూ వెళ్లిపోతారు. తన జీవితంలో జరగుతున్న కథలో తనకు తెలియకుండా తనే నటించబోతున్నారు. చూద్దాం ఈ నాటకం ఎన్ని రోజులు జరగుతుందో అంటాడు జెండే. రూంలో కట్టేసి ఉన్న గౌరి దగ్గరకు వచ్చి రాకేస్‌ వార్నింగ్‌ ఇస్తాడు. నిన్ను అడ్డు పెట్టుకుని ఆ కుటుంబంలో ఉన్న వాళ్లందరినీ నా కాళ్ల దగ్గరకు తీసుకొచ్చుకుంటాను అంటాడు. అకిని వదిలిపెట్టను అనగానే అకి జోలికి వెళ్తే శంకర్‌ నిన్ను వదిలిపెట్టడు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు ఇంట్లో ఎవ్వరూ లేరని ఓనరు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే.. అందరూ వస్తారు. ఓనరు భయంతో ఆగిపోతాడు. ఇంతలో అకి, అభయ్‌ అనురాధ, ఆర్యవర్థన్‌ ల ఫోటోలు తీసుకొచ్చి హాల్ లో పెడతారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!