Prema Entha Madhuram  Serial Today Episode:  తన తమ్ముళ్లకు పెద్ద ఉద్యోగాలు  వచ్చిన తర్వాత గ్రాండ్‌ పార్టీ ఇస్తానని ఆ ఈవెంట్‌ కు మేనేజ్‌మెంట్‌ కూడా గౌరికే ఇస్తానని అప్పుడు తెలుస్తుంది తన తమ్ముళ్ల టాలెంట్‌ ఏంటనేది అని శంకర్‌ అనుకుంటాడు. మరోవైపు గౌరి బెస్ట్‌ కపుల్స్‌ ఫ్రోగ్రాంలో శంకర్‌ తనకు రింగ్‌ తొడిగిన విషయం గుర్తు చేసుకుంటుంది. శ్రావణి పిలుస్తుంది. అయినా గౌరి పలకదు. దీంతో శ్రావణి అక్కా అంటూ తట్టగానే ఉలిక్కిపడుతుంది గౌరి. ఏం చేస్తున్నావు అక్కా అనగానే చపాతీలకు పిండి కలుపుతున్నాను అంటుంది గౌరి. ఏంటి ఉప్మా రవ్వలో నీళ్లు కలిపితే చపాతి పిండి అవుతుందా? అంటూ శ్రావణి ప్రశ్నిస్తుంది. అది చూసి షాక్‌ అవుతుంది గౌరి. రాత్రి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావని శ్రావణి చెప్పగానే అసలు మనం ఇప్పుడు రాఖీ కట్టడం అంత అవసరమా? అంటుంది. ఇంతలో సంధ్య వచ్చి నువ్వు కరెక్టు అక్కా అంటుంది. ఇద్దరూ కలిసి రాఖీ కట్టే ఫ్రోగ్రాం క్యాన్సిల్‌ చేస్తారు. అయితే శ్రావణి మాటలకు రెచ్చిపోయిన గౌరి మళ్లీ రాఖీ కట్టడానికి రెడీ అవుతుంది. మరోవైపు అభయ్‌కి రాఖీ కడుతుంది అకి.


అకి: హ్యాపీ రక్షాబంధన్‌ అన్నయ్యా..


అభయ్‌: ఈ అన్నయ్య నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. ఐ యామ్‌ ఆల్వేస్‌ విత్‌ యూ.. గాడ్‌ బ్లెస్‌ యూ అకి.


జెండే: అభయ్‌.. గిఫ్ట్‌..?


అభయ్‌: అకి అడక్కపోయినా నువ్వు ఊరుకోవని నాకు తెలుసు ఫ్రెండ్‌. ( లోపలకి వెళ్లి గిఫ్ట్‌ తెస్తాడు.) దిస్‌ ఈజ్‌ ఫర్‌ యూ అకి


అకి: వావ్‌ డైమండ్‌ రింగ్‌ అన్నయ్యా..


అభయ్‌: నీకు నచ్చిందా?


అకి: ఇట్స్‌ రియల్లీ నైస్‌ అన్నయ్యా..చాలా చాలా బాగా నచ్చింది. లవ్‌ యూ అన్నయ్య.


అభయ్‌: ఫ్రెండ్‌ అకికి చిన్నప్పటి నుంచి గిఫ్ట్‌ లన్నా, సర్‌ ఫ్రైజ్‌ లన్నా చాలా ఇష్టం. చిన్నపిల్లలాగే బిహేవ్‌ చేస్తుంది.


జెండే: అన్నయ్యకు చెల్లి ఎప్పుడూ చిన్నపిల్లే కదా?


అభయ్‌: నీకు ఫ్రెండ్‌ గారాబం ఎక్కువైపోయింది. నేను దూరమైపోయాను.


జెండే: అభయ్‌ నాకు మీరిద్దరూ సమానమే.. ఈ కేశవజెండే బతికున్నాడు అంటే మీరిద్దరి కోసమే.. లేదంటే నా ఆర్య ఈ లోకంలో లేడు అని తెలిసిన మరక్షణమే నేను ప్రాణాలు వదిలేసేవాడిని.


అకి: అలా మాట్లాడకు ఫ్రెండ్


అభయ్‌: నేను ఏదో క్యాజువల్‌ గా అన్నాను ఫ్రెండ్. సారీ నిన్ను హర్ట్‌ చేశాను కదా?


రాకేష్‌: ఈ వేషాలన్నీ అభయ్‌ ని గ్రిప్పులో పెట్టుకోవడానికే కదా జెండే.. ఇకపై నీ ఆటలు సాగనివ్వను ( అని మనసులో అనుకుంటాడు.)


జెండే: సరే ఇద్దరూ వెళ్లి అమ్మానాన్న ఆశీర్వాదం తీసుకోండి.


అభయ్‌: ఫస్ట్‌ నువ్వు ఆశీర్వదించు ఫ్రెండ్‌. వాళ్లిద్దర్ని నీలోనే చూసుకుంటున్నాము.


 అని జెండే కాళ్ళు మొక్కగానే ఇద్దరినీ జెండే దీవిస్తాడు. ఇంతలో అభయ్‌ పద అకి అమ్మా నాన్నల ఫోటోల దగ్గర అశీర్వాదం తీసుకుందాం అంటే ఫోటోలు ఎందుకు వాళ్లతోనే నేను ఆశీర్వాతం తీసుకుంటాను అనగానే రాకేష్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో జెండే మాట మారుస్తాడు. అందరూ ఫోటోల దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటారు. తర్వాత అకి గౌరి, శంకర్‌ ల దగ్గరకు వెళ్తుంటే రాకేష్‌ పంపిన రౌడీలు మరో కారులో అకిని ఫాలో అవుతుంటారు. అదే విషయం జెండేకు ఫోన్‌ చేసి చెప్తుంది అకి. అయితే వాళ్లను ఎలాగైనా డైవర్ట్‌ చేయ్‌ అని అలాగే మన వాళ్లను అలెర్ట్‌ చేస్తానని చెప్తాడు జెండే. జెండే చెప్పినట్లే వాళ్లను డైవర్ట్‌ చేసి వెళ్లిపోతుంది అకి. మరోవైపు శంకర్‌ తన తమ్ముళ్లను పంపిస్తుంటే గౌరి వాళ్ల నాన్న వచ్చి ఎక్కడికి పారిపోతున్నారని ఇవాళ రాఖీ పండుగ మా అమ్మాయిలు మీకు రాఖీలు కడతామన్నందుకే నీ తమ్ముళ్లు ఎగ్జామ్స్‌ పేరుతో పారిపోతున్నారా? అని అడుగుతాడు. దీంతో శంకర్‌ ఒక్క మీ అమ్మాయిలతోనే కాదు ఊర్లో ఉన్న అందరితో కట్టించుకుంటామని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.


ALSO READ: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌