Renu Desai: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Renu Desai Post: రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తుంది.
సామాజికి సేవలోనూ చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాల సంరక్షిస్తుంది. మరోవైపు సింగిల్ మదర్‌గా అకిరా, ఆధ్యల బాధ్యతను నిర్వర్తిస్తుంది.
ఇటీవల కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ ఆత్యాచార ఘటనపై స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉన్నారు.
రెండు రోజులు క్రితం పిల్లలను పెంచే విధానంపై ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన కూతురు ఆధ్య కరాటే నేర్చుకుంటున్న ఫోటో షేర్ చేశారు.
దీనికి మీ కొడుకుకు మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించండి. ఎందుకంటే నేను నా కుమార్తెకు ఎముకలు విరగొట్టడం నేర్పించబోతున్నాను అని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది.
దీనికి బ్యాక్ గ్రౌండ్‌లో కరాటే నేర్పిస్తున్న ఫొటోను జత చేసింది. దీంతో రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. 'గుడ్ డెసిషన్ మేడమ్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.